Karthika Deepam June 6th (ఈ రోజు) ఎపిసోడ్: శోభ ప్లాన్ వర్కౌట్ కాకపోయినా నిరుపమ్ అన్న మాటకు బాధపడుతున్న జ్వాల- ఇద్దరి మధ్య గ్యాప్ మొదలైందా!
పార్టీకి పిలిచి జ్వాలను అవమానించాలన్న శోభ వేసిన ప్లాన్‌ను హిమ అడ్డుకుటుంది. చివరి నిమిషంలో సీసీ కెమెరాలను అడ్డం పెట్టుకొని జ్వాల బాబాయ్‌కు శోభతో సారీ చెప్పిస్తుంది.
శోభ పిలిచినట్టుగానే ఫంక్షన్‌కు నిరుపమ్, హిమ వస్తుంది. అందరూ వచ్చినప్పటికీ జ్వాల కోసం వెతుకుంది శోభ. ఎవరి కోసం వెతుకుతున్నావని నిరుపమ్ అడుగుతాడు. ఇంకెవరు... జ్వాల కోసం వెయిట్ చేస్తున్నానని చెప్తుంది. ఈ పార్టీకి తన అవసరం ఏంటని.. అడుగుతాడు నిరుపమ్. తన నీ ఫ్రెండ్ అని అందుకే పిలిచానంటుంది శోభ. ఓసారి జ్వాలకు ఫోన్ చేసి నిరుపమ్‌ను అడగమంటుంది. ఆమె చెప్పినట్టే జ్వాలకు ఫోన్ చేసి వస్తున్నావా అని అడుగుతాడు. మీరు వస్తున్నారని తెలిసి నేనూ వస్తున్నానని చెబుతుంది జ్వాల. శోభ ఉత్సాహాన్ని చూసిన హిమ చాలా కంగారు పడుతుంది. శోభ ఏదో ప్లాన్ చేస్తుందని అనుమాన పడుతుంది హిమ.
హిమ, నిరుపమ్ మాట్లాడుతున్నప్పుడే స్వప్న వస్తుంది. వాళ్లిద్దర్ని చూసి అసహనం వ్యక్తం చేస్తుంది. స్వప్న రాక చూసిన శోభ.. పార్టీలో ఆమె చీఫ్ గెస్ట్ అని ప్రకటిస్తుంది.
అక్కడ జ్వాల పిన్ని, బాబాయ్‌ను చూసి మీరేంటి ఇక్కడా అని ఆరా తీస్తుంది. ఇంతలో స్వప్నను చూసి ఈమేంటి ఇక్కడ అని అనుకుంటారు.
హిమ టెన్షన్ చూసి నిరుపమ్ అడుగుతాడు. ఎందుకిలా ఉన్నావని ఆరా తీస్తాడు. అయినా ఏం చెప్పదు.
జ్వాల పిన్ని, బాబాయ్‌ను చూసి ఆశ్చర్యపోతుంది స్వప్న. వాళ్లు అని ఏదో చెప్పబోతుంటే... శోభ వదిలేయండీ అంటుంది. ఇంతలో జ్వాల పార్టీలోకి ఎంట్రీ ఇస్తుంది. అక్కడ పిన్నీ, బాబాయ్‌ను చూసి షాక్ అవుతుంది. ఇక్కడ మాత్రం మీ చేతివాటం చూపించవద్దని హెచ్చరిస్తుంది జ్వాల.
నేరుగా వెళ్లి నిరుపమ్‌ను పలకరిస్తుంది జ్వాల. నీ కోసం శోభ ఎదురు చూస్తుందని చెప్తాడు నిరుపమ్. నాకు ఉన్నది మీరు ఇద్దరేనని వేరే వారిని కేర్ చేయనుంటుంది. ఇంతలో శోభ పలకరిస్తుంది.
ఇంతలో ఓ రెండు సెకన్ల పాటు కరెంటు పోతుంది. వచ్చిన వెంటనే తన నెక్లెస్ పోయిందంటూ శోభ గోల చేస్తుంది. అంతా కంగారు పడతారు. వాడెవరో ప్రొఫెషనల్ దొంగపనే ఇదని నిరుపమ్ అనుమాన పడతాడు. జ్వాల వెంటనే తన పిన్నీ బాబాయ్ వైపు చూస్తుంది. అవునా అని సైగలు చేసి అడుగుతుంది... కాదని అంటాడు బాబాయ్.
శోభ నెక్లెస్ పోయిందని.. ఇక్కడి నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి వీళ్లేదని... పోలీసులను పిలుస్తాను వాళ్లే చూసుకుంటారని నిరుపమ్ అంటాడు. పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు మాట వినగానే జ్వాల బాబాయ్. పిన్ని కంగారు పడతారు. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇస్తారు.
వచ్చిన పోలీసులు ముందు వర్కర్స్‌ను చెక్ చేస్తారు. జ్వాల బాబాయ్ జేబు నుంచి నెక్లెస్ తీస్తారు. నా జేబులోకి ఎలా వచ్చిందో తెలియదని కాళ్ల వేళ్ల పట్టుకొని బాధపడతారు. జ్వాలా వీళ్లు అని నిరుపమ్ అడుగుతాడు. మా బాబాయ్, పిన్ని అని చెబుతుంది జ్వాలా. స్వప్న కలుగుజేసుకొని... వీళ్లందరిదీ దొంగల ఫ్యామిలీ అని స్టేట్‌మెంట్ ఇస్తుంది. జ్వాల మాట్లాడుతూ... ఒకప్పుడు చేసేవాళ్లేమో గానీ... ఇప్పుడు చేయడం లేదంటుంది జ్వాల. ఇంకా వాళ్లను సమర్థిస్తున్నావా అంటూ నిరుపమ్ కసురుకుంటాడు. పోలీసులు వాళ్లిద్దర్నీ తీసుకెళ్తుంటే... హిమ ఆపుతుంది. అసలు కరెంట్ ఈ ఇంట్లో పోయిందా ఊరు మొత్తం పోయిందా అని ప్రశ్నిస్తుంది. పోలీసుల వెరిఫై చేస్తారు. అంటే కావాలనే ఎవరే దీన్ని ప్లాన్ చేశారని అంటుంది హిమ. అక్కడే ఉన్న ఓవర్కర్‌ను పిలిచి గట్టిగా కొడుతుంది.. పవర్ ఎందుకు ఆఫ్ చేశావని నిలదీస్తుంది. మెయిన్ ఆఫ్ చేస్తుండగా... సీసీ కెమెరాల్లో రికార్డయిందని చెబుతుంది.
పోలీసులు గట్టిగా అడగడంతో తానే ఈ పని చేశానంటూ.. ఓ వ్యక్తి ఒప్పుకుంటాడు. ఇంతలో హిమ మాట్లాడుతూ... ఇది ఎవరు చేశారనో ఒప్పుకొని జ్వాల బాబాయ్‌కు సారీ చెప్పాలంటుంది.
శోభ దగ్గరకు వచ్చి నీ పేరు చెబితే పార్టీలో పరువు పోతుందని.. ముఖ్యంగా నిరుపమ్ వద్ద చులకనవుతావని అంటుంది హిమ. దానికి భయపడిపోయిన శోభ... తాను పెట్టిన ఇద్దరి వర్కర్స్‌ను కొట్టి తీసుకెళ్లి మీ స్టైల్‌లో విచారించమని చెప్పి లాక్కెళ్లమంటుంది. జ్వాల పిన్నీ బాబాయ్ వద్దకు వెళ్లి సారీ చెబుతుంది శోభ. ఏదో ఎక్కడో పొరపాటు జరిగిందని అంటుంది.