అన్వేషించండి

Karthika Deepam June 2nd (ఈ రోజు) ఎపిసోడ్: ఆటో జ్వాల కోసం తల్లినే ఎదిరించిన నిరుపమ్- షాక్‌లో స్వప్న

నాకు ఎవరైతే ఇష్టమో వాళ్లతోనే తిరుగుతానంటూ తల్లి స్వప్నను తొలిసారి ఎదిరించి మాట్లాడతాడు నిరుపమ్. ఆ మాటలు విన్న స్వప్న షాక్ తింటుంది.

హిమ పెళ్లి సంగతి తెలుసుకున్న నిరుపమ్‌ ఆసుపత్రిలో ఆమెను నిలదీస్తాడు. తనను ప్రేమించింది నిజామా కాదా అని నిలదీస్తాడు నిరుపమ్. దీనిపై సమాధానం చెప్పాలని గట్టిగా పట్టుబడతాడు. అంతా విన్న హిమ... నా పెళ్లి సంబంధాన్ని ఎందుకు చెడగొట్టావని ప్రశ్నిస్తుంది. దీంతో మరింత అసహనంతో ఊగిపోతాడు నిరుపమ్. నేను ఏమి అడుగుతున్నాను... నువ్వేం చెబుతున్నావని మండిపడతాడు. నా పెళ్లి సంబంధం ఎందుకు చెడగొడతావో సమాధానం చెప్పమంటుంది హిమ. చెడ గొట్టకపోతే పెళ్లి చేసుకుంటావా అని ఎదురు ప్రశ్నిస్తాడు. నువ్వేంటి ఇంకో పెళ్లి చేసుకోవడమేంటని అంటాడు. పేరు పెట్టి పిలిచిన హిమ.. నా పెళ్లిపై నాకు హక్కు ఉందని చెబుతుంది. దీంతో మరింత ఆగ్రహంతో... ఊగిపోతూ.. పేరు పెట్టి పిలిచి నా గుండెను మరింత ముక్కలు చేస్తున్నావంటాడు నిరుపమ్. అన్నీ మర్చిపోయి.. నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమంటుంది హిమ. ఏంటీ ఆ శోభను పెళ్లి చేసుకోమంటావా అంటాడు నిరుపమ్. చాచా.. ఆమెను పెళ్లి చేసుకోమని నేనెందుకు చెప్తానంటుంది హిమ. ఇంతలో అక్కడకు వచ్చిన శోభ తన పేరు తన టాపిక్ విని షాక్ అవుతుంది. అప్పుడే నిరుపమ్ ఫోన్ మోగుతుంది. మాట్లాడిన నిరుపమ్‌ నేను వెంటనే వస్తున్నానని చెప్పేసి వెళ్లిపోతాడు. 

శోభ వచ్చి హిమతో వాదన పెట్టుకుంటుంది. నువ్వేదో సాధుజీవి అనుకున్నాను... నన్ను ఛీఛీ అంటావా అంటు నిలదీస్తుంది శోభ. ఛీ ఛీ అన్నావుగా... నేను కచ్చితంగా నిరుపమ్‌ను పెళ్లి చేసుకొని తీరుతానంటూ శపథం చేసి వెళ్లిపోతుంది. 

దీంతో మళ్లీ ఆలోచనలో పడుతుంది హిమ. నేను నిరుపమ్‌ను సౌర్యను కలపాలని చూస్తుంటే మధ్యలో ఈ శోభ ఏంటి ఇలా మాట్లాడుతుందని కంగారు పడుతుంది. స్వప్న, శోభ ఏదైనా కుట్ర చేస్తున్నారా అని అనుమానపడుతుంది. వీళ్లిద్దర్నీ కనిపెట్టి ఉండాల్సిందే అంటుంది. 

హిమను కలవడానికి వచ్చిన జ్వాలను తీసుకొని బయటకు వెళ్దామని ప్లాన్ చేస్తాడు నిరుపమ్. ఇంతలో శోభ వచ్చి బయటకు నిరుపమ్‌ను కారులో వెళ్దామంటుంది. ఆమెను కాదని జ్వాలతో బయటకు వెళ్లిపోతాడు. 

ఇక్కడ ప్రేమ్‌ హిమ కోసం ఆలోచిస్తూ గడిపేస్తున్నాడు. నేను ప్రేమించిన మరదలకు ప్రేమ విషయం చెప్పలేకపోతున్నానని... ఇప్పుడైనా చెప్పేయాలని అనుకుంటాడు. నాలుగు గోడల మధ్య కూర్చొని  బాధ పడుతుంటే హిమకు నా మనసులోని మాట ఎలా తెలుస్తుందని ఆలోచిస్తాడు. దీనికి మార్గం వెతకాలని అనుకుంటాడు. పాత పద్దతిలో ప్రేమ లేఖ రాస్తే ఎలా ఉంటుందని పేపర్ తీసుకొని లవ్‌ లెటర్ రాయడం స్టార్ట్ చేస్తాడు.ఈ ప్రేమ లేఖ మనవల్ల కాదని డిసైడ్ అవుతాడు. తర్వాత ఓ సెల్ఫీ వీడియో ద్వారా చెప్పి పంపిస్తానంటాడు. సెల్ఫీ వీడియో షూట్ చేస్తాడు. బ్యాక్‌గ్రౌండ్ బాగాలేదని అది కూడా వాయిదా వేసుకుంటాడు. 

ఆసుపత్రిలో బయల్దేరిన నిరుపమ్ అనాథ శరణాలయానికి వస్తాడు. హిమ అడిగిన ప్రశ్నలే గుర్తుకు వస్తుంటాయి నిరుపమ్‌కు. ఎవర్ని ఎవరు అర్థం చేసుకోలేదనే ఆలోచిస్తుంటాడు. హిమ ఎందుకు రిజెక్ట్ చేసిందో అని అనుకుంటా ఉంటాడు. ఈ విషయాన్ని అక్కడే పని చేస్తున్న పనిమనిషి నిరుపమ్ వచ్చాడని శోభకు చేరవేస్తుంది. 

ఇంతలో జ్వాల నిరుపమ్‌కు ఫోన్ ఎక్కడున్నావని అడుగుతుంది. మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయి ఎక్కడకు చేరావని ప్రశ్నిస్తుంది. అనాథ శరణాలయంలో ఉన్నానని చెప్తాడు నిరుపమ్. రమ్మంటావా అని అడుగుతుంది జ్వాల. పని ఏదీ లేకుంటే రమ్మని చెప్తాడు. వెంటనే వెళ్లిపోతుంది జ్వాల. 

తన మనసులో మాట చెప్పడానికి వీడియో ప్లాన్ చేసిన ప్రేమ్‌... మంచి లొకేషన్ చూసుకొని వీడియో స్టార్ట్ చేస్తాడు. ఏం మాట్లాడాలి... ఎలా మాట్లాడాలి అనుకుంటాడు. మనసులో మాట చెప్పడానికి అంత కష్టపడాలా అని వీడియో స్టార్ట్ చేస్తాడు. మొత్తానికి మనసులో మాట చెప్తూ వీడియో రికార్డ్ చేస్తాడు. మనసును అర్థం చేసుకోమని రిక్వస్ట్ చేస్తాడు. నైట్ సెండ్ చేద్దాని ప్లాన్ చేసుకుంటాడు. 

నిరుపమ్ ఉన్న అనాథ శరణాలయానికి జ్వాల వస్తుంది. విషయాన్ని జ్వాలకు చెప్పేసి హిమ మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటాడు. నాకు మంచి ప్లేస్ చూపించావంటాడు. ఇక్కడకు వచ్చి కూర్చుంటే ఏదో ప్రశాంతత వస్తుందని చెప్తాడు. 

ఇంతలో నిరుపమ్‌కు స్వప్న ఫోన్ చేస్తుంది. ఎక్కడ ఉన్నావని ప్రశ్నిస్తుంది. అనాథశరణాలయంలో ఉన్నానని చెప్తాడు. అక్కడ నీకు ఏం పని అని... నీతో ఎవరు ఉన్నారని నిలదీస్తుంది. ఆ ఆటోదానితో నీకేం పని అని...ఆమెతో ఎందుకు తిరుగుతున్నావని గట్టిగా అడుగుతుంది. తనకు ఎలాంటి రెండో ఆలోచన లేదని చెప్పినా స్వప్న వినిపించుకోదు. దీంతో నిరుపమ్ తిరగబడతాడు. నాకు ఇష్టమైంది నేను చేస్తానంటాడు. నాకు కారు ఇష్టమైతే కారులో, ఆటో ఇష్టమైతే ఆటోలో వెళ్తానంటాడు. ఆటోవాళ్లు నచ్చితే ఆటోవాళ్లు నచ్చితే వాళ్లతోనే ఫ్రెండ్స్‌షిప్ చేస్తానంటాడు. ఆటో అంటే ఇష్టమని చెప్పేస్తాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Embed widget