Karthika Deepam June 13th (ఈ రోజు) ఎపిసోడ్: హిమపై కోపంతో నిరుపమ్‌కు తన ప్రేమ సంగతి చెప్పకుండానే వెళ్లిపోయిన జ్వాల
జ్వాల తన ప్రేమను నిరుపమ్ చెప్పే క్షణాలను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుంది హిమ. మధుర క్షణాలను జీవితాంతం గుర్తుచుకునేలా ఇలా ఏర్పాటు చేశానంటుంది హిమ. ఆ ఏర్పాట్లను చూసిన జ్వాల ఆనందంతో పులకించిపోతుంది.
క్యాన్సర్ పేరుతో హిమ వేసిన ప్లాన్‌తో జ్వాల, నిరుపమ్‌ను ఒక్కటి చేయడానికి ప్రయత్నిస్తుంది. తన ప్రేమ సంగతి నిరుపమ్‌కు చెప్పాలని జ్వాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది హిమ. దీంతో జ్వాల ప్రేమలోకంలో విహరిస్తూ ఉంటుంది. తన ప్రేమ సంగతి చెప్పినట్టు నిరుపమ్ దానికి ఓకే చెప్పినట్టు కూడా కలలు కంటుంది.
తనకు ఇంతలా సాయ పడుతున్న హిమ గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది జ్వాల. తింగరీ అని పిలుస్తున్నానే కానీ.. నీ అసలు పేరు తెలియదని... అసలు పేరు ఏంటో చెప్పమంటుంది. తల్లిదండ్రులు వివరాలపై కూడా ఆరా తీస్తుంది. జ్వాల అలా అడిగే సరికి షాక్ తింటుంది హిమ. తాను ఏం చెప్పలేనంటూ దాటవేసే ప్రయత్నం చేస్తుంది. అయినా ఊరుకోని జ్వాల.. నిరుపమ్‌కి ఫోన్ చేసి అడుగుతానంటూ ఫోన్ చేయబోతుంది. దాన్ని కూడా అడ్డుకుంటుంది హిమ. తనపై ప్రేమ ఉంటే ఇలాంటి ఎంక్వయిరీలు మానేయాలని మాట తీసుకుంటుంది.
జ్వాలను ప్రేమించాలని.. పెళ్లి చేసుకోవాలని తన ఆఖరి కోరిక తీర్చాలంటూ హిమ తీసుకున్న మాట గురించి ఆలోచిస్తుంటాడు నిరుపమ్. అసలు హిమ ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటుందని అసహనంతో ఉంటాడు. నేను జ్వాలను ప్రేమించడం ఏంటని తనని తానే ప్రశ్నించుకుంటాడు. కచ్చితంగా వాళ్లు చెప్పిన చోటుకు వెళ్లి... అసలు విషయం చెప్పేయాలని ప్లాన్ చేసుకుంటాడు నిరుపమ్.
ఇక్కడ హిమ ఆరోగ్యం, సౌర్య గురించి సౌందర్, ఆనందరావు ఆలోచిస్తుంటారు. సౌర్య ఎక్కడ ఉందో ఎన్ని కష్టాలు పడుతుందో అనుకుంటారు. పెళ్లి చేసుకునే ఉంటుందేమో అనుకుంటారు. ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారా ఆని సౌందర్యను ప్రశ్నిస్తాడు ఆనందరావు. చిన్నప్పటి ఫొటోతో వెతకడం చాలా ఇబ్బందిగా ఉంటుందని కొన్ని రోజులు టైం పడుతుందని అనుకుంటారు. ఇంతలో నిరుపమ్‌ను తనను పెళ్లి చేసుకుండా హిమ ఒప్పించిందని ఆనందరావుకు చెప్తుంది సౌందర్య. ఎలా ఒప్పుకున్నాడని... అసలు ఆమెతోనే జీవితాంతం ఉంటానన్న నిరుపమ్‌ను ఎలా ఒప్పించిందని అనుకుంటారు ఇద్దరు. సౌర్య చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోతే... హిమ ఇప్పుడు లోకం నుంచే వెళ్లిపోతుందని బాధపడతారు.
జ్వాల తన ప్రేమను నిరుపమ్ చెప్పే క్షణాలను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుంది హిమ. మధుర క్షణాలను జీవితాంతం గుర్తుచుకునేలా ఇలా ఏర్పాటు చేశానంటుంది హిమ. ఆ ఏర్పాట్లను చూసిన జ్వాల ఆనందంతో పులకించిపోతుంది. అక్కడకు నిరుపమ్ కూడా ఉంటాడు కానీ.. హిమ చేసిన పనికి లోలోపల రగిలిపోతుంటాడు. జ్వాల తన ప్రేమ సంగతి చెప్తే నా మనసులో హిమ ఉందని.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పాయాలన్న ఆలోచనతో ఉంటాడు.
జ్వాల వస్తున్న దారిని పూలదారి చేస్తుంది హిమ. ఇద్దరి మధ్య ఏడు అడుగుల దూరాన్ని ఉంచి.. ఒక్కో అడుగుకు ఒక్కో అర్థం చెబుతూ ఉంటుంది. జ్వాల ప్రేమ సంగతి చెప్పేందుకు ఇంకో అడుగు ఉండగానే...ఫోన్ వస్తుంది. అంతే అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది జ్వాల. జ్వాల చేసిన పనికి షాక్ తింటుంది హిమ.
రేపటి ఎపిసోడ్
అసలు నువ్వు అలా వెళ్లిపోవడం కరెక్టేనా... ఎందులా వెళ్లిపోయావని జ్వాలను హిమ నిలదీస్తుంది. తన శత్రువు హిమ ఫోన్ చేసిందని... అందుకే వెళ్లానంటూ అసలు సంగతి చెబుతుంది. హిమ నేను ఇక్కడ ఉండగా జ్వాలకు ఫోన్ చేసిందెవరనే అనుమానం హిమకు వస్తుంది.