Karthika deepam 2 Serial Today April 6th: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో దీప, హారతిచ్చి స్వాగతం పలికిన పారిజాతం.. అమ్మమ్మ తాతయ్యలతో సౌర్య ఆటలు!
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode తనని కాపాడిన దీపను సుమిత్ర ఇంటికి తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam 2 Serial Today Episode సుమిత్ర, జ్యోత్స్నలు దీప, సౌర్యలను తమ ఇంటికి తీసుకెళ్తారు.సౌర్య కూడా అమ్మమ్మ అంటూ సుమిత్రకు దగ్గరైపోతుంది. మరోవైపు శోభ గుర్రు గుర్రుగా ఉంటుంది. నరసింహ శోభ కాళ్లు పట్టుకొని కూర్చొంటాడు. నరసింహ దీపతో ఇక తనకు ఏ సంబంధం లేదు అని అంటాడు. శోభ విడాకులు తీసుకోమని అంటుంది.
సుమత్ర వాళ్ల రాకకోసం అందరూ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో దీపని తీసుకొని ఇంటికి వస్తారు. జ్యోత్స్న వాళ్ల ఇళ్లు చూసి దీప, సౌర్య ఇద్దరూ ఆశ్చర్యపడతారు. చూస్తూ ఉండిపోతారు. సౌర్య ఇది ఎవరి ఇళ్లు అని అండిగితే మన ఇళ్లే అని సుమిత్ర అంటుంది. ఇక అందరూ దీపకు ధ్యాంక్స్ చెప్తారు. పారిజాతం మాత్రం దీపని తిట్టుకుంటుంది. ఇక సుమిత్ర దీపకు దిష్టి తీయమని పారిజాతానికి చెప్తుంది.
దీప: నా బతుకులో ఆనందం ఉంటే కదా దిష్టి తీయడానికి.
పారిజాతం: ఏం ఖర్మరా ఇది సుమిత్ర కాపాడిన దానికి నేను హారతి ఇచ్చి ఆహ్వానించడం ఏంటి.
కాంచన: నీకు ప్రమాదం జరిగింది అని తెలిసి చాలా భయపడ్డాం వదిన.
సుమిత్ర: సమయానికి దీప లేకపోతే నేను మీ ఇంటి ముందు ఉండేదాన్ని కాదు వదిన.
సౌర్య: అమ్మా ఈ ఇళ్లు మన స్కూల్ బిల్డింగ్‌లా ఎంత పెద్దగా ఉందో.
దశరథ: సుమిత్ర మీద అటాక్ చేసిన వాళ్లని దీప గుర్తు పడుతుంది. అందుకే కొన్ని రోజులు మన ఇంట్లో ఉంటుంది.
పారిజాతం: మనసులో.. ఇది ఇంట్లో ఉంటే నాకే ప్రమాదం.
జ్యోత్స్న: అక్క నువ్వేం భయపడకుండా హ్యాపీగా ఉండొచ్చు. అని మిగతా అందరిని పరిచయం చేస్తుంది. తనకు బావ ఉన్నాడు అని రాగానే పరిచయం చేస్తానని చెప్తుంది.
దీప: అమ్మా ఇంత పెద్ద ఇంట్లో నేను ఉండటం మీకు ఇబ్బంది లేకపోవచ్చు కానీ నాకు ఇబ్బందిగా ఉంది.
సుమిత్ర: బాస్వరం దీప అవుట్ హౌస్‌లో ఉంటుంది. సమయానికి ఏం కావాలో చూసుకో.
పారిజాతం: కాపాడింది కదా అని నెత్తిన పెట్టుకోవడం ఎందుకు ఏ పదో పరకో ఇస్తే చాలు కదా..
శివనారాయణ: నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ నెత్తి పగులుతుంది. ఆ రౌడీని గుర్తు పట్టే వరకు దీప ఇక్కడే ఉంటుంది.
మరోవైపు కార్తీక్ ఇంటికి బయల్దేరుతాడు. ఇక దీప బ్యాగ్ చిరిగిపోయి ఉంటుంది. అందువల్ల తన ఫోన్ పడిపోయి ఉంటుంది. సౌర్య ఆరుబయట ఉన్న బొమ్మలు పువ్వులు చూసి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇక పువ్వులు చూసి శోభ తిట్టినట్లు ఊహించుకుంటుంది. ఇక దీప సౌర్యకు ఊయల ఊగిస్తుంది.
దీప: సౌర్యకు ఈ ఇళ్లు బాగా నచ్చినట్లు ఉంది. అలవాటు అయితే ఇబ్బంది అవుతుంది. ఈ రెండు రోజుల్లో వెళ్లిపోవాలి. కానీ ఎక్కడికి వెళ్లాలి. సౌర్య ఆడుకుంది చాలు రా..
సౌర్య: అమ్మా ఆ ఇళ్లు చాలా బాగుంది అమ్మా నాన్న ఇళ్లు కూడా అలాగే ఉంటుందా..
అనసూయ: దీనికి ఇంకా నా కొడుకు కనిపించాడో లేదో.. ఇంటికి తాళం వేసి ఉండటం చూసి.. ఏనా కొడుకురా ఇంటికి తాళం వేసింది..
మల్లేశ్: నేనే వడ్డీ మల్లేశ్.. నీ కొడుకు తీసుకున్న అప్పు తీర్చు. నా చేతిలో పైసల్ పెడితే మీ చేతిలో తాళం పెడతా. నా పైసల్ నా చేతికి వచ్చిన దాగా నువ్వు నా ఇంట్లో పని చేయాలి. పద.. నువ్వు ఇప్పుడు రాకపోతే ఇళ్లు ఉండదు. నువ్వు ఉండవు.
అనసూయ: దొంగసచ్చినోడా నా కోడలు రాని నీ పని చెప్తా..
సుమిత్ర: మొక్క తీర్చుకున్నప్పుడు ఇలా జరగడం బాధగా ఉంది అండి.
దశరథ: ఇలా జరిగింది కాబట్టే మనకు శత్రువులు ఉన్నారని తెలిసింది. ఇది మంచిదే కదా..
ఇంతలో జ్యోత్స్న సౌర్య, దీపలను తీసుకొని ఇంటికి వస్తుంది. సౌర్యతో ప్రేమగా మాట్లాడుతుంది సుమిత్ర. తనకు ఆడుకోవడానికి ఎవరూ లేరు అని బుంగమూతి పెట్టుకుంటుంది. దీంతో సుమిత్ర, దశరథలు తమతో ఆడుకోమని చెప్తారు. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: టైట్ ఫిట్‌లో గ్లామర్ ట్రీట్ ఇస్తున్న 'గుంటూరు కారం' బ్యూటీ మీనాక్షి చౌదరి