Karthika Deepam 2 September 9th: కార్తీకదీపం 2 సీరియల్: దీపని చంపడానికి వచ్చిన నర్శింహ చేతిలో బలైపోయిన కార్తీక్.. కండీషన్ సీరియస్!
Karthika Deepam 2 Serial Episode దీపని చంపడానికి వచ్చిన నర్శింహ కార్తీక్‌ని పొడిచేయడం కార్తీక్ పరిస్థితి విషమంగా మారడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప వంట చేయడానికి వస్తుంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో అనసూయ, శౌర్యని తీసుకొచ్చి ఉంటే బాగుండేదని అనుకుంటుంది. ఇంతలో నర్శింహ అక్కడికి వస్తాడు నర్శింహని చూసి దీప షాక్ అవుతుంది.
నర్శింహ: సంబంధం లేని చోటుకి వీడెలా వచ్చాడు అనుకుంటున్నావా. లేదా నేను ఇక్కడ ఉన్నట్లు వీడికి ఎలా తెలుసు అనుకుంటున్నావా.
దీప: నన్ను నీడలా వెంటాడుతుంటే నేను ఎక్కడ ఉన్నాను అని తెలుసుకోవడం నీకు పెద్ద కష్టమేమీ కాదులే. ఏదో వంట కోసం వచ్చాను నా పని నన్ను చేసుకోనిచ్చి నాలుగు డబ్బులు సంపాదించుకోనివ్వు. నీ లాంటి మనిషి దగ్గర ఎక్కువ సేపు మర్యాదగా నేను మాట్లాడలేను. ఎదురుగా కట్టిపీట కూడా ఉంది దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో.
నర్శింహ: ఎంత పద్ధతిగా వార్నింగ్ ఇస్తున్నావే సరే చివరిగా నీకు ఓ అవకాశం ఇస్తున్నా ఆ ఇళ్లు, డబ్బు నాకు ఇస్తావా లేదా.
దీప: ఆ ఇళ్లు మా నాన్న కష్టపడి కట్టారు. నా కూతురికి ఇవ్వడానికి నా కంటూ ఉన్న గుర్తు అది.
నర్శింహ: ఈ సోది అంతా కాదు ఇస్తావా ఇవ్వవా చెప్పు.
దీప: ఇవ్వను.
నర్శింహ: దేవుడు నీకు ఇచ్చిన చివరి అవకాశం కూడా వదులు కున్నావ్ ఇక నిన్ను చంపడం తప్ప నాకు వేరే అవకాశం లేదు. ఏంటే అలా చూస్తున్నావ్ ఇక్కడ వంటా లేదు పెంట లేదు ఇదంతా నిన్ను చంపడానికి నేను వేసిన ప్లాన్. ఆ పెద్దావిడని నేనే పంపాను. నువ్వు ఆ కార్తీక్ గాడితో కలిసి నా బతుకు రోడ్డుకి ఈడ్చావు కదే అందుకే బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా. నిన్ను చంపేస్తే ఆ ఇళ్లు నాదే, డబ్బు నాదే, కూతురు నాదే, అప్పుడు మా అమ్మ కూడా చచ్చినట్లు నాతో వస్తుంది.
దీపని చాకుతో పొడవడానికి నర్శింహ ప్రయత్నిస్తాడు. దీప ఎంత చెప్పినా చంపడానికి రావడంతో దీప నర్శింహని తోసేసి కత్తిపీట తీస్తుంది. ఒకర్ని ఒకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో దీపని నర్శింహ పొడవబోతే కార్తీక్ అడ్డు వస్తాడు. దాంతో కార్తీక్‌ని నర్శింహ పొడిచేస్తాడు. దీప షాక్ అయిపోతుంది. నర్శింహ పారిపోతాడు. దీప కార్తీక్‌ని ఎందుకు వచ్చారు అంటే దీప ఫోన్ చూపిస్తాడు. దీప ఏడుస్తూ మీకేం కానివ్వను బాబు అంటూ హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది.
మరోవైపు సుమిత్ర, కాంచన వాళ్లు అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. ఇంట్లో వాళ్లకి ఏం చెప్పాలి అని దీప ఏడుస్తుంది. ఇంతలో కాంచన కార్తీక్ ఫోన్‌కి కాల్ చేస్తుంది. దీప ఫోన్ ఎత్తి కాంచన మాటలకు ఏడుస్తుంది. ఫోన్‌లో దీప ఏడుస్తుంది. దీప ఏడ్వడంతో కాంచన షాక్ అయిపోతుంది. దాంతో సుమిత్ర ఫోన్ తీసుకొని దీపతో మాట్లాడుతుంది. దీప కార్తీక్‌ని కత్తితో నర్శింహ పొడిచేశాడు అని చెప్తుంది. సుమిత్రతో పాటు అందరూ షాక్ అయిపోతారు. ఇక కాంచన కూడా ఏడుస్తుంది. అందరూ కంగారుగా హాస్పిటల్‌కి వెళ్తారు. ఇక జ్యోత్స్న కూడా కార్తీక్‌కి కాల్ చేస్తుంది. దీప కాల్ లిఫ్ట్ చేస్తుంది. నర్శింహ కార్తీక్‌ని పొడిచేశాడు అని చెప్పి వెంటనే హాస్పిటల్‌కి రమ్మని చెప్తుంది. దీంతో జ్యోత్స్న ఏడుస్తూ హాస్పిటల్‌కి వెళ్తుంది. అందరూ హాస్పిటల్‌కి చేరుకొని ఏడుస్తారు. నర్శింహ కార్తీక్‌ని ఎందుకు పొడిచాడు అని శ్రీధర్ దీపని అడుగుతాడు. దీప జరిగింది అంతా చెప్తుంది. ఇంతలో డాక్టర్ వచ్చి కార్తీక్ కండీషన్ సీరియస్ అని చెప్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.