Karthika Deepam 2 Serial Today November 7th: కార్తీకదీపం 2 సీరియల్: దీప ఆటలు చూసి మురిసిపోయిన కార్తీక్.. తల్లీదండ్రుల్ని దగ్గరుండి కలుపుతున్న శౌర్య!
Karthika Deepam 2 Serial Today Episode దీప పిల్లలతో కలిసి తొక్కుడు బిల్ల ఆడటం కార్తీక్ అది చూసి మురిసిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కాంచన సుమిత్రకు కాల్ చేస్తుంది. సుమిత్ర ఏడుస్తూ చిన్నప్పుడు నువ్వు మీ అన్నయ్యకి మాట అడిగి నీకు మాట ఇచ్చి మీ అన్నయ్య పిల్లల జీవితం నాశనం చేశారని అంటుంది. మన ఇష్టాల కోసం పిల్లల ఆశల్ని బలి తీసుకున్నామని ముందు చూపు లేకుండా నా కూతురిని కోడలిని చేసుకుంటా అని మాట తీసుకోవడం తప్పు అని ఏడుస్తుంది.
సుమిత్ర: అప్పుడు మీరు చేసిన తప్పునకు ఇప్పుడు నా కూతురు ఏడుస్తుంది. దాన్ని తిట్టాను కొట్టాను అయినా ఏం లాభం లేదు వదినా అది కార్తీక్‌ని మర్చిపోలేకపోతుంది. కొడుకులా చూసుకున్న నా మేనల్లుడు నాకు అన్యాయం చేస్తే కూతురిలా చూసుకున్న దీప నా కూతురికి అన్యాయం చేసింది. సారీ వదినా కోపం వచ్చి తిట్టేశా.. నువ్వేం అనుకోకు వదినా ఉండబట్టలేక ఇలా చేశాను.
కాంచన: కోపంగా తిట్టుకోవడానికి అయినా ప్రేమగా మాట్లాడుకోవడానికి అయినా మనకు మనం తప్ప ఎవరు ఉన్నారు వదినా. నా కొడుకు నీ కూతురు అన్న వ్యత్యాసం మనకి ఎప్పుడూ లేదు వదినా పిల్లలు జీవితాలు బాగుండాలి అనుకున్నా. ఈ పెళ్లి నా కొడుకు ఇష్టప్రకారమే జరిగింది. జరిగిన పెళ్లి పది మందికి తెలియాలి అని రిసెప్షన్ చేస్తున్నాం అక్కడి పరిస్థితి తెలుసు కాబట్టి ఎవరూ రారు అని తెలుసు కానీ మీరు వస్తే బాగున్ను అని అనుకుంటా. ఫంక్షన్ చివరి వరకు ఎదురు చూస్తా ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి.
సుమిత్ర: ఎంత తెలివిగా మాట్లాడావు వదినా. నేను అంటే నీకు ఎంత ప్రేమో నాకు తెలుసు. నాకు నువ్వు అంటే ఎంత ప్రేమో నీకు తెలీదు. రిసెప్షన్‌కి రావాలి అని ఉంది కానీ ఇప్పుడెలా.
శౌర్య తన ఫ్రెండ్స్‌తో ఆడుకుంటూ ఉంటుంది. మా అమ్మానాన్నలకు ఫంక్షన్ అవుతుంది మీరు వస్తే మా నాన్నని చూపిస్తాను అంటుంది. ఇక పిల్లలు తొక్కుడు బిల్ల ఆడుతారు. మరోవైపు శ్రీధర్ దగ్గరకు కావేరి వెళ్లి నా కూతుర్ని కాంచన అక్క కూతిరిలా చూసుకుంటుంది. అప్పుడు కార్తీక్ కూడా నాకు కొడుకే కదా దీప నా కోడలు కదా అని గిఫ్ట్ తీసుకొని వెళ్దామని చెప్తుంది. రామా ఏంటి నాకు ఈ ఖర్మ అని శ్రీధర్ తల బాదుకుంటాడు. కాంచను అక్క అంటావా కార్తీక్‌ని కొడుకు అంటావా అని అంటాడు. నువ్వు నేను ఒకటే కదా ఫంక్షన్‌కి వెళ్దాం అంటుంది. రిసెప్షన్‌కి కచ్చితంగా వెళ్దామని అంటుంది.
మరోవైపు శౌర్య తన ఫ్రెండ్స్‌తో తొక్కుడు బిల్ల ఆడుతుంటే దీప అక్కడికి వస్తుంది. దీపని కూడా ఆడమని శౌర్య బతిమాలితే దీప తొక్కుడు బిల్ల ఆడుతుంది. ఇంతలో కార్తీక్ చూసి సంతోషంగా ఫీలై ఇది కలా నిజమా అనుకుంటాడు. ఇంతలో శౌర్య కార్తీక్‌ని చూసి కార్తీక్ దగ్గరకు నాన్న అనుకొని వెళ్తుంది. కార్తీక్ దీప ఆట చూశానని అనుకుంటే దీప ముందు వెనక చూసుకోవాల్సింది అనుకుంటుంది. ఇక శౌర్య తన ఫ్రెండ్స్‌తో రేపు ఫంక్షన్ ఉంది స్కూల్‌కి రాను అని చెప్తుంది. ఫంక్షన్ ఏం లేదు స్కూల్‌కి వెళ్లు అని దీప అంటుంది. దీప ఫంక్షన్‌కి ఒప్పుకుంటుందనే ధైర్యంతో కాంచన వాళ్లు చీరలు రెడీ చేస్తారు. దీప కాంచన, అనసూయని భోజనానికి పిలిస్తే మీ ఆయన తొందరగా తింటాడు వెళ్లు పిలు అంటుంది. దీప కార్తీక్ గదికి వెళ్తుంది. కార్తీక్ వర్క్ చేస్తూ ఫోన్ కోసం మొత్తం వెతుకుతాడు. శౌర్య తీసుకెళ్లిందేమో అని బయటకు వెళ్తుంటే దీప రావడంతో ఒకర్ని ఒకరు గుద్దుకుంటారు. అందరూ అక్కడికి చేరుకుంటారు. కొమ్ములు వస్తాయని శౌర్య అంటుంది. మరోసారి గుద్దుకోమని అంటుంది. దాంతో బలవంతంగా కార్తీక్ దీపకి ఢీ కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సత్యతో మసాజ్ చేయించుకోవాలని క్రిష్ తంటాలు.. కోడలికి షాక్ కొట్టించాలని భైరవి ప్లాన్!