Karthika Deepam 2 Serial Today November 19th: కార్తీకదీపం 2 సీరియల్: దీప, కార్తీక్‌లపై విరుచుకుపడ్డ శివనారాయణ.. కార్తీక్ కోసం తాతపై చేయెత్తిన దీప!
Karthika Deepam 2 Serial Today Episode తన రెస్టారెంట్ పేరు ఎందుకు వాడుకున్నావ్ అని శివనారాయణ కార్తీక్, దీపల మీద ఫైర్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీపని రెస్టారెంట్‌కి తీసుకెళ్లిన కార్తీక్ దీపకి ఉప్మా బిర్యానీ చేయమని అంటాడు. దీప బయటపడితే కార్తీక్ దీపని మోటివేట్ చేసి ఉప్మా బిర్యానీ చేయడానికి పంపిస్తాడు. దీప కిచెన్‌కి వెళ్లి చెఫ్ సాయంతో ఉప్మా బిర్యానీ చేస్తుంది. కార్తీక్ మరో చెఫ్‌తో మాట్లాడుతూ నూడిల్స్ గురించి మాట్లాడుతుంటే దీప కార్తీక్‌ని చూస్తూ ఉంటుంది. చెఫ్ దీప దగ్గర కార్తీక్ గురించి గొప్పగా చెప్తే దీప అలా చూస్తూ ఉంటుంది.
కార్తీక్: శివ నిన్ను మేడం దగ్గర పెట్టింది ఉప్మా బిర్యానీ నేర్చుకోవడానికి నా గురించి ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు.
దీప: ఆయనేం ఉపన్యాసాలు ఇవ్వడం లేదు. మీ మంచి తనం గురించి చెప్తున్నాడు. మీరు శౌర్యనే కాదు అలాంటి చాలా మందిని చదివిస్తున్నారని అర్థమైంది.
కార్తీక్: వాళ్లు చెప్పుకోవాల్సింది నా గురించి కాదు దీప నీ గురించి నేను ఇవన్నీ చేయడానికి కారణం నువ్వే దీప. మీ నాన్న గారు చనిపోయిన తర్వాత నువ్వు ఎంత ఇబ్బందిలో ఉన్నావో నాకు నువ్వు మల్లేశ్‌తో మాట్లాడిన తర్వాత తెలిసింది. మీ నాన్నకి ఓ పాలసీ ఉండి ఉంటే మీకు ఇబ్బంది ఉండేదికాదు. అందుకే అప్పుడే అనుకున్నా ఎంప్లాయిస్‌కి ఆ ప్లాబ్లమ్ రాకూడదు అని ఇంక ఏ కుటుంబం ఆర్థికంగా రోడ్డు పడకూడదు అని పాలసీ చేశా. డబ్బులేకుండా తెలివైన వాళ్లు ఆగిపోకూడదని కనీసం కొందరికైనా సాయం చేయాలని ఇలా చేస్తున్నా.
దీప: గొప్పవాళ్లు ఎప్పుడూ వాళ్ల గొప్పతనం ఒప్పుకోరు
కార్తీక్: అవును దీప అది నిన్ను చూస్తే అర్థమవుతుంది.
జ్యోత్స్న హోటల్‌కి వస్తుంది. బోర్డు మీద ఉప్మా బిర్యానీ చూసి మేనేజర్‌ని అడుగుతుంది. కార్తీక్ సార్ రాయమన్నారని దీప మేడం వచ్చి వండుతున్నారని చెప్తాడు. మేనేజర్ దీపని పదే పదే మేడం అనడంతో జ్యోత్స్న కోపంతో మేనేజర్ చెంప వాయిస్తుంది. దీప కోసం జ్యోత్స్న వెళ్తుండగా దీపే జ్యోత్స్నకి ఎదురు పడుతుంది. ఇంతలో కార్తీక్ కూడా అక్కడికి వస్తాడు.
జ్యోత్స్న: దీపని రెస్టారెంట్‌కి ఎందుకు తీసుకొచ్చావ్
కార్తీక్: నీ పర్మిషన్ తీసుకోవాలా.
జ్యోత్స్న: నేను మరదలిగా అడగడం లేదు.
కార్తీక్: అలా అయితే నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
జ్యోత్స్న: నువ్వు సీఈవో అయితే నేను ఓనర్ కూతురిని.
కార్తీక్: నేనేమీ నీ కింద పని చేయడం లేదు. నేను ఓనర్‌తో పార్టనర్‌నే.
జ్యోత్స్న: అలాంటి ఐటెమ్ మన మెనూలో పెట్టాల్సిన అవసరం ఏముంది.
ఇంతలో శివనారాయణ వచ్చి పేపర్ కార్తీక్ ముఖాన విసిరి మా పరువు తీస్తున్నావ్ ఏంటి అని అడుగుతాడు. నా భార్యతో నేను ఫొటో వేయించుకుంటే మీకు ప్రాబ్లమ్ ఏంటి అని కార్తీక్ అడుగుతాడు. నీ పేరు పక్కన జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ అని ఎందుకు వేయించుకున్నావ్ అని అడుగుతాడు. అది నా పోస్ట్ అని కార్తీక్ అంటాడు దానికి నా కోడలి పేరు ఎందుకు వేయించావ్ అంటాడు. కార్తీక్, శివనారాయణ మధ్య గొడవ జరుగుతుంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరుగుతుంది. కార్తీక్‌ని శ్రీధర్‌తో తాత పోల్చితే కార్తీక్ తన తండ్రితో తనని పోల్చుకోవద్దని అంటాడు. దీప మాట్లాడితే నువ్వు మాట్లాడకు నీకు నాకు ఏం సంబంధంలేదు నిన్ను చూస్తుంటే నాకు కంపరంగా ఉందని అంటాడు.
శివనారాయణ: ముందు నా ఇంట్లో చేరావు తర్వాత నా కూతురి ఇంట్లో ఇప్పుడు నా రెస్టారింట్లో చేరావు
జ్యోత్స్న: చేరడమే కాదు తాత వంట కూడా చేస్తుంది.
శివనారాయణ: ఈ అవతార మూర్తి పక్కన ఉంటే ఈ అమ్మగారు ఎన్ని వేషాలు అయినా వేస్తుంది. అది వంట చేసింది నువ్వు నా పరువు మంట కలిపావ్.
కార్తీక్: నీకు అంతగా బాధ ఉంటే నేను నీకు ఏం కాను అని పేపర్‌లో ప్రకటించు
శివనారాయణ: దీప మెడలో తాళి కట్టినప్పుడు లేని ప్రేమలు అభిమానాలు ఇప్పుడెందుకు వచ్చాయ్. మీ నాన్న పేరు ఎందుకు వేయలేదు ఎందుకంటే అతని పేరు వేస్తే పరువు తక్కువ కాబట్టి అందుకే విలువైన నా మనవరాలు, కోడలి పేరు రాసుకున్నావ్
కార్తీక్: ఎవరి పేరు పక్కన చేరితే నాకు విలువ రాదు.
శివనారాయణ: విలువలేని మనిషిని పెళ్లి చేసుకున్నప్పుడే నీ విలువ పోయింది.
శివనారాయణ తనకి క్షమాపణ చెప్పమని అందుకు పేపర్‌లో శివనారాయణ కుటుంబానికి నాకు ఏం సంబంధం లేదు పొరపాటున వాళ్ల పేరు నేను వాడుకున్నాను అని పేపర్లో ప్రకటన వేయమని అంటాడు. నువ్వు నీ మనవరాలు కలిసి మీ పరువు తీసుకుంటున్నారు అని వయసులో పెద్దవాడు అయినా నాకు ఉన్న బుద్ధి నీకు లేదు అని కార్తీక్ అంటే శివనారాయణ కొట్టడానికి చేయి ఎత్తుతాడు దాంతో దీప తన చేయి అడ్డు పెడుతుంది. మా తాత మీదే చేయి ఎత్తుతావా అని దీపని జ్యోత్స్న అంటే దానికి దీప కార్తీక్ బాబు ఒంటి మీద చేయి పడటానికి వీల్లేదు అది ఎవరి చేయి అయినా సరే అని దీప అంటుంది. నా కార్తీక్ బాబుని ఎవరు తక్కువ చేసినా ఊరుకోను అని దీప అంటుంది. దాంతో జ్యోత్స్న నా కార్తీక్ బాబునా అంటే మా బావ నీకు మొగుడు అయిపోయాడా అంటే అవును అంటుంది. దాంతో శివనారాయణ దీపని ఉద్దేశించి అందితే జుట్టు అందకపోతే కాళ్లుపట్టుకునే వాళ్లు ఇలాగే మాట్లాడుతారు అని అంటుంది.
ఒక ఆడది తలచుకుంటే ఎంతకైనా తెగించగలదు అని నువ్వు నిరూపించావని శివనారాయణ అంటే దానికి కార్తీక్ నా భార్యని ఎవరు ఏమన్నా ఊరుకోనని కార్తీక్ అంటాడు. దీప వెళ్లిపోతానని అంటే కార్తీక్ దీపతో నువ్వు ఎవరి కోసం వెళ్లిపోవద్దు అంటే శివనారాయణ మీరు అవసరం లేదు మేమే పోతాం అంటాడు. మన రెస్టారెంట్ తాత మనం పోవడం ఎందుకని జ్యోత్స్న అంటే మన రెస్టారెంట్‌లోనే మన పరువు మనం తీసుకోద్దని అంటాడు. ఇక ఎవరైనా మీ తాత ఎవరు అని అడిగితే నాకు తాత లేడు చచ్చాడని చెప్పు అని కార్తీక్‌తో శివనారాయణ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: పాపని తాకగానే నయనిలా మారిపోయిన త్రినేత్రి.. విక్రాంత్‌లో కొత్త అనుమానాలు.. చనిపోయిన డాక్టర్!