Karthika deepam and Brahmamudi Serials Story: 'కార్తీకదీపం'లో మోనిత..'బ్రహ్మముడి'లో యామిని సేమ్ టు సేమ్ - పెళ్లైన మగాళ్లంటే ఈ పిచ్చి ఎందుకో మరి!
Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ లో యామిని అనే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె గురించి ఇచ్చిన ఇంట్రడక్షన్ చూస్తే సేమ్ టు సేమ్ కార్తీకదీపం సీరియల్ లో మోనితలా ఉంది.. ఎందుకంటే..

Karthika deepam and Brahmamudi Serials Story
తెలుగు సీరియల్స్ అన్నిటిదీ ఇదే స్టోరీనా?
పెళ్లైన మగాడంటే పడి చచ్చిపోయే కథలే ఎందుకు?
స్మాల్ స్క్రీన్ బాహుబలి అయిన కార్తీక దీపం నుంచి ప్రస్తుతం టాప్ 5 లో ఉన్న బ్రహ్మముడి వరకూ అన్ని కథలూ ఇంతేనా?
పెళ్లైన మగాళ్లపై అంత మోజు ఎందుకు...పైగా వాళ్ల వైవాహిక జీవితాన్ని చిదిమేసి ఆ వ్యక్తి లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకోవడం ఏంటి?
అందమైన ఆ మేకప్ వెనుక ఇంత రాక్షసత్వం దాగి ఉంటుందా?...సీరియల్స్ లో విలన్ అంటే వేరే ఆడదాని భర్తను కోరుకున్న అమ్మాయే అవుతుందా?
Also Read: మోనితను మించిన సైకో యామిని.. రాజ్ జీవితంలో కొత్త సునామి - బ్రహ్మముడి మార్చి 4 ఎపిసోడ్ హైలెట్స్!
కార్తీకదీపం కథ ఇదే
కార్తీకదీపం సీరియల్ తో డాక్టర్ బాబుతో కలసి చదువుకుంటుంది మోనిత. ప్రేమిస్తుంది..పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. అప్పటికే హిమ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న డాక్టర్ బాబు మోనితను స్నేహితురాలిగా మాత్రమే చూస్తాడు. కానీ తనకు కార్తీక్ దక్కలేదన్న కోపంతో హిమకు యాక్సిడెంట్ చేయిస్తుంది..ఆ యాక్సిడెంట్ కారణంగా నీకు భవిష్యత్ లో పిల్లలు పుట్టరు అని డాక్టర్లతో కార్తీక్ కి అబద్ధం చెప్పిస్తుంది. అదే మాయలో ఉండిపోతాడు కార్తీక్. ఇక ఎప్పటికైనా నావాడే అని మోనిత ఫిక్సైపోతుంది..ఇంతలో అనుకోని పరిస్థితుల్లో దీప మెడలో తాళి కడతాడు కార్తీక్. అప్పటి నుంచి దాదాపు ఆరేళ్ల పాటూ సాగిన సీరియల్ లో కార్తీక్ దీపను విడిదీసి ఆ స్థానంలో తాను వెళ్లాలనే ఉద్దేశంతో ఎన్నో కుట్రలు చేస్తుంది మోనిత. డాక్టర్ బాబు దీప కలవాలి అంటూ నిజంగా చాలామంది అభిమానులు పూజలు చేశారు. బ్యానర్లు కట్టారు, సోషల్ మీడియాలో మోనితపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. ఓవరాల్ గా ఆ సీరియల్ సూపర్ డూపర్ హిట్.... అందుకే ఇప్పుడు కార్తీకదీపం నవవసంతం పేరుతో మళ్లీ వచ్చారు దీప- కార్తీక్...
బ్రహ్మముడి కూడా ఇప్పుడు సేమ్ టు సేమ్ స్టోరీ నడుస్తోంది
అనామిక అనే ఓ అరాచక క్యారెక్టర్ ని అప్పట్లో పరిచయం చేశారు. కవి కళ్యాణ్ కవితల్ని ప్రేమిస్తూ తానెవరో చెప్పకుండా వెంటపడే అమ్మాయిలా చూపించారు. యండమూరి వీరేంద్రనాథ్ వెన్నెల్లో ఆడపిల్ల నవల రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. తీరా పెళ్లయ్యాక చూస్తే అనామిక తనలో రాక్షసత్వం చూపించింది. మొగుడితో విడిపోయింది..మరొకడితో చేరి తన పథకం నెరవేరకపోవడంతో వాడిని చంపేసి జైలుకెళ్లి కూర్చుంది. దుగ్గిరాల వారింటి వారసులు , కోడళ్లు ఓ దగ్గర చేరారు ...రుద్రాణికి చెక్ పెడితే చాలు సీరియల్ ముగింపు అనుకున్నారంతా. ఇలాంటి టైమ్ లో యామిని అనే కొత్త క్యారెక్టర్ ని తీసుకొచ్చారు...
చిన్నప్పుడు కుక్కపిల్ల తన మాట వినలేదని చంపేసింది..తాను అనుకున్నది సాధించలేకపోతే అంత పట్టుదల, రాక్షసత్వం ఉందని ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ చెప్పాడు. రాజ్ ని ప్రేమించి తను రిజెక్ట్ చేశాడని పిచ్చిదైపోయిన యామిని మత్తుపదార్థాలకు బానిసై ఫారెన్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చింది. అంతా మెరుగైందని తల్లిదండ్రులు సంతోషించారు. కానీ కావ్యను రాజ్ జీవితం నుంచి తప్పించి తాను ఆ ప్లేస్ లోకి వెళ్లాలి అనుకుంటున్నా అని టార్గెట్ ఫిక్స్ చేసింది. అప్పుడే రాజ్ తో ఆట మొదలెట్టేసింది.
దుగ్గిరాల కుటుంబంలో వచ్చిన సమస్యలన్నింటికీ తీర్చుకుంటూ పోతున్న కావ్య జీవితం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఇంతలో యామిని ఎంట్రీ ఇవ్వడంతో కథ కీలక మలుపుతిరిగింది. ఇంతకీ రాజ్-యామిని ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి? ఆమె కారణంగా కావ్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతోంది? ఇంకా ఎన్నో ప్రశ్నలు..
ఈ రెండు సీరియల్స్ మాత్రమే కాదు.. ప్రతి సీరియల్ లోనూ ఇదే తంతు. పెళ్లైన మగాడి జీవితంలోంచి భార్యను దూరం చేయాలి ఆ ప్లేస్ లోకి తాము వెళ్లాలనే ఉద్దేశంతో ఎన్నో కుట్రలు..
దురదృష్టవశాత్తూ ఇలాంటి సీరియల్స్ లో ఎక్కువ ఆదరణ దక్కుతోంది...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

