Lakshimi Raave Maa Intiki Serial Today February 27th:పూజ జరిగే సమయానికి ఇంట్లో ప్రత్యక్షమైన మధుసూదన్... మ్యాడీని చూసి షాక్ తిన్న ప్రియంవద, సింధూజాక్షి
Lakshimi Raave Maa Intiki Serial Today Episode February 27 th: పూజ జరిగే సమయానికి ఇంట్లో ప్రత్యక్షమైన మధుసూదన్... మ్యాడీని చూసి షాక్ తిన్న ప్రియంవద, సింధూజాక్షి

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: పదహారు రోజుల పండుగ కోసం ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఇల్లాంతా పూజ సందడి నెలకొంటుంది. కానీ మ్యాడీ ఇంకా ఇంటికి రాకపోవడంతో హైమావతి, అరవింత్ చాలా కంగారుపడిపోతుంటారు. కనీసం ఫోన్ కూడా లిప్ట్ చేయడం లేదని..ఇప్పుడు నాన్నకు ఏం సమాధాం చెప్పాలి బాధపడుతుంటారు. ఇంతలో సింధూజాక్షి, గోపీ రావడంతో అందరూ ఆనందంగా వారిని లోపలికి తీసుకువని వచ్చేందుకు వెళ్తారు. వాళ్లిద్దరూ లోపలికి వస్తుండగా...నారాయణ వచ్చి గుమ్మంలోనే ఆగమని చెబుతాడు. శ్రీలక్ష్మీని హారతి ఇచ్చి వాళ్లను లోపలికి తీసుకురమ్మని చెప్పడంతో లక్ష్మీ వెళ్లి హారతి పళ్లెంతో వచ్చి వారికి హారితి ఇస్తుంది. ఆ తర్వాత లోపలికి వచ్చిన సింధూజాక్షి కనీసం వాళ్ల అమ్మానాన్నలతో మాట్లాడను కూడా మాట్లాడదు. అందరూ ఉన్నారు సరే మధుసూదన్ ఎక్కడా అని సూర్యనారాయణ అడుగుతాడు. ఎవరూ సమాధానం చెప్పకపోయేసరికి అందరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అర్థరాత్రుల వరకు తిరిగి వచ్చి ఇప్పటికీ ఇంకా లేవలేదా అని అతని గదిలోకి వెళ్లబోతుండగా....శ్రీలక్ష్మీ అసలు విషయం చెబుతుంది. నిన్న పార్టీకి వెళ్లిన మధుసూదన్ రాత్రి ఇంటికి రాలేదని చెబుతుంది. దీంతో సూర్యనారాయణ కోపం కట్టలు తెంచుకుంటుంది. నేను వెళ్లి తీసుకుని వస్తానని సూర్యనారాయణ బయలుదేరతాడు. ఇప్పుడు నాన్న వెళితే ఖచ్చితంగా మ్యాడీని ఇంటికి తీసుకొస్తాడని...అప్పుడు ఈ పూజ జరుగుతుందని ప్రియంవద భావిస్తుంది. ఏదో ఒకటి చెప్పి నాన్నను బయటకు వెళ్లకుండా ఆపాలని అనుకుంటుంది. రాత్రి మ్యాడీ నాకు ఫోన్ చేసి వస్తానన్నాడని...రాత్రిపూట వద్దులే ఉదయమే రమ్మని నేనే చెప్పానని అంటుంది.ఈపాటికి బయలుదేరి వస్తుంటాడులే అని చెప్పడంతో సూర్యనారాయణ ఆగిపోతాడు.
గోపీని తీసుకుని శ్రీలక్ష్మీ తన గదికి వెళ్తుంది. ఊరిలో విశేషాలు అడిగి తెలుసుకుంటుంది. వదిన ఎలా ఉంటుందని అడగ్గా....నాతో చాలా బాగా ఉంటోందని అబద్ధం చెబుతాడు. తన ప్రేమను అర్థం చేసుకుని సంతోషంగా ఉందని చెబుతాడు. నీతో మ్యాడీ ఎలా ఉంటున్నాడని అడగగ్గా...చాలా బాగా చూసుకుంటున్నాడని రోజూ తనే నన్ను కాలేజీకి తీసుకెళ్తున్నాడని, నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడంటూ శ్రీలక్ష్మీ కూడా అబద్ధం చెబుతుంది. అటు సింధూ తన రూమ్‌కు వెళ్లిన తర్వాత మ్యాడీ నిజంగానే వస్తున్నాడా అని ప్రియంవదను అడగ్గా...రావడం లేదని, నాన్న వెళ్తే వాడిని తీసుకొస్తారనే అబద్ధం చెప్పానని చెబుతుంది. అయితే ఇవాళ పూజలేనట్లేనని సంబరపడిపోతుంది. 6 నెలల్లో గోపీ విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడని....ఇప్పుడు వచ్చింది కూడా పూజ కోసం కాదని విడాకులకు అప్లై చేయడానికేనని చెబుతుంది. మ్యాడీకి ఫోన్ చేసి ఇంటికి రావొద్దని చెబుతుంది.
పూజకు సమయం అవ్వడంతో సింధూ, గోపి రెడీ అయ్యి కిందకు వస్తారు. మ్యాడీ ఇంకా రాకపోయేసరికి వాడికి అసలు ఈ పూజ ఇష్టం లేదనుకుంటా అందుకే ఇంటికి రాలేదని సింధూ అంటుంది. దానికి ప్రియంవద కూడా మాట కలుపుతుంది. ఉదయం వరకు వస్తానని చెప్పినవాడు కాస్తా...ఇప్పుడు ఫోన్ తీయం లేదంటే వాడికి ఈ పూజ ఇష్టం లేదని నాకు కూడా అనిపిస్తుందని అంటాడు. దీంతో సూర్యనారాయణ అవమానంగా భావిస్తాడు. అందరి ముందు తన పరువు తీశాడని కొడుకు, కోడలిపై మండిపడతాడు. ఇంతలో మ్యాడీ ఇంటికి వచ్చి....మీ మనవడు ఎప్పటికీ అలాంటి పని చేయడని చెప్పడంతో సింధూజాక్షితోపాటు ప్రియంవద షాకుకు గురవుతారు. మ్యాడీ రావడంతో శ్రీలక్ష్మీఆనందపడుతుంది.























