Karthika deepam 2 Serial Today May 25th : ‘కార్తీకదీపం 2’ సీరియల్: తండ్రికి పిండం పెట్టిన దీప – బతికున్న వాళ్లకు పిండం పెడితే కాకులు రావన్న సన్యాసి
Karthika deepam 2 Today Episode : దీప తండ్రి బతికే ఉన్నాడన్న విషయం తెలియడంతో దీప షాక్ గురవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Karthika deepam 2 Serial Today Episode: దీప, కార్తీక్ ఇద్దరూ మొగుడు పెళ్లాలలాగా పోలీస్ స్టేషన్‌కు వచ్చారని నరసింహ, పారజాతంతో అంటూ ఫీలవుతుంటాడు. ఇంతలో శోభ కల్పించుకుని నేను ముందే చెప్పాను అయినా మీరిద్దరూ వినలేదని కోప్పడుతుంది. అది చేసే పనులకు నువ్వు ఆడదానిలా చేతులకు గాజులు వేసుకోవాలని శోభ అనడంతో నరసింహ కోపంగా శోభను కొట్టబోతే నువ్వు నన్ను తప్పితే ఎవర్ని కొడతావు అంటూ తిడుతుంది. దీంతో నరసింహ కోపంతో రగిలిపోతుంటాడు. ఇవాళ నిన్ను ఈడ్చుకుపోయారు. రేపు నన్ను కూడా ఈడ్చుకుపోతారు. ఇప్పుడు నన్ను మా అమ్మ తప్ప ఎవ్వరూ కాపాడలేరు. అంటూ లోపలికి వెళ్లిపోతుంది. నరసింహ మాత్రం అది నన్ను వదిలేసినా.. నేను దాన్ని వదిలేయను. దాని పేరు చెబితే నేను వణికిపోవడం కాదు. నా పేరు చెప్తేనే అది గజగజ వణికేలా చేస్తానని నరసింహ అంటాడు. మరోవైపు దీప వాళ్ల నాన్న ఫోటో చూస్తూ.. శౌర్యతో ఇవాళ తాతయ్య సంవత్సరీకం నేను గుడికి వెళ్లి వస్తాను అని చెప్పి గుడికి వెళ్తుంది దీప. శౌర్య సుమిత్ర వాళ్ల ఇంటికి వెళ్తుంది. అక్కడ బంటును చూస్తుంది.
శౌర్య: నువ్వు ఎక్కడికో వెల్లిపోయావు అన్నారు. మళ్లీ ఎప్పుడొచ్చావు.
బంటు: అదంతా తర్వాత చెప్తాను కానీ అమ్మగారు ఎక్కడైనా కనిపించారా?
శౌర్య: ఏ అమ్మగారు.
బంటు: పారిజాతం అమ్మగారు.
శౌర్య: జో గ్రానీయా.. లోపల గదిలో ఉంటుంది బంటు.
బంటు: నేను చూసే వచ్చాను లోపల లేదు.
అనగానే శౌర్య నేను చూపిస్తాను కదా పద అంటూ గదిలోకి వెళ్తుంది. అక్కడ పారిజాతం తెల్లచీర కట్టుకుని ముఖానికి నల్లటి ఫేస్ ఫ్యాక్ వేసకుని ఉంటుంది. దీంతో శౌర్య భయంగా దెయ్యం అనుకుంటూ బయటకు వెళ్లిపోతుంది. బంటు కూడా లోపలికి వచ్చి నిజంగానే దెయ్యం అనుకుని భయపడిపోతాడు. తర్వాత పారిజాతం అని తెలిసి బంటు కూల్ అవుతాడు.
బంటు: నేను కూడా మిమ్మల్ని చూసి భయపడ్డాను అమ్మగారు.
పారిజాతం: నువ్వేంట్రా సన్నాసి నేను కూడా అద్దంలో చూసుకుని భయపడ్డాను.
బంటు: అమ్మగారు ఆ స్టేషన్ గొడవ ఏమైనా తెలిసిందా?
పారిజాతం: ప్రస్తుతానికి ఏమీ తెలియలేదురా? అక్కడ ఏం జరుగుతుందోననే టెన్షన్‌లో ఇదిగో ఇలా తయారయ్యాను.
బంటు: కార్తీక్ బాబే కేసు పెట్టారంటే అర్థం ఏంటమ్మా?
అంటూ బంటు అడగ్గానే వాణ్ని దీపకు దూరం చేయాలని పారిజాతం చెప్తుంది. దీంతో వాణ్ని దీపకు దూరం చేయాలంటే దీపకు కార్తీక్ బాబు దగ్గరవుతారనేగా? అంటూ డౌట్ క్రియేట్ చేస్తాడు బంటు. దీంతో పారిజాతం షాక్ అవుతుంది. మరోవైపు నరసింహ రెడీ అవుతుంటాడు. అనసూయ వస్తుంది.
అనసూయ: ఏంట్రా ఎక్కడికో రెడీ అవుతున్నావు.. ఆ దెబ్బలు ఇంకా తగ్గనేలేదు.
శోభ: ఏంటత్తయ్యా టాక్సీ మీరు నడుపుతారా?
నరసింహ: ఏంటే మా అమ్మను పట్టుకుని అంత మాట మాట్లాడుతున్నావు.
శోభ: టాక్సీని నమ్ముకుని మూడు చీటీలు వేశాను. ఇంట్లోనే కూర్చుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. ఆ దీప ఏమైనా తెచ్చి ఇస్తుంది.
అనగానే అనసూయ ఇక ఆ దీప పేరు ఎత్తకే అంటుంది. ఇంతలో పక్కింటి చిలకమ్మ వచ్చి జాగ్రత్తగా ఉండమని అసలే నువ్వు రెండో భార్యవి.. పైగా నువ్వింకా పెళ్లి చేసుకోలేదని మన బస్తీలో అనుకుంటున్నారు. మొదటి పెళ్లాం కేసు పెట్టిందటగా అనగానే శోభ కోపంతో రగిలిపోతుంది. నరసింహను తిట్టి వెళ్లిపోతుంది. మరోవైపు దీప గుడికి వెళ్లి తన తండ్రి సంవత్సరీకం పూజ చేయిస్తుంది. కాకుల కోసం ఎదురుచూస్తుంటే అక్కడే ఉన్న ఒక సన్యాసి చూసి బతికున్నవాళ్లకు పిండం పెడితే కాకులు ఎలా ముడతాయమ్మా అంటాడు. దీంతో దీప షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: అలాంటివి ‘ఆదిత్య 369’లో వాడాం - హీరోగా కాకుండా అది అవ్వాలనుకున్నా: బాలకృష్ణ