అన్వేషించండి

Balakrishna: అలాంటివి ‘ఆదిత్య 369’లో వాడాం - హీరోగా కాకుండా అది అవ్వాలనుకున్నా: బాలకృష్ణ

Satyabhama Trailer Launch Event: కాజల్ అగర్వాల్ కెరీర్‌లో తెరకెక్కిన మొదటి లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ అయిన ‘సత్యభామ’ను సపోర్ట్ చేయడానికి బాలకృష్ణ ముందుకొచ్చారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

Balakrishna At Satyabhama Trailer Launch Event: కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ చేస్తున్న చిత్రమే ‘సత్యభామ’. కాజల్ అగర్వాల్ తన కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసినా అందులో చాలావరకు కమర్షియల్ హీరోయిన్‌గానే కనిపించింది. కానీ మొదటిసారి ఒక లేడీ ఓరియెంట్ చిత్రంతో, అది కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో యాక్షన్ చూపించడానికి వచ్చేస్తోంది. మేలో విడుదల కావాల్సిన ఈ చిత్రం.. ఇప్పుడు జూన్‌కు పోస్ట్‌పోన్ అయ్యింది. అయినా కూడా ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు ‘సత్యభామ’ టీమ్. తాజాగా గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. దానికి చీఫ్ గెస్టులుగా అనిల్ రావిపూడి, బాలకృష్ణ వచ్చారు.

ప్రచారం ముగిసింది..

బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జోడీగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందుకే తన తరువాతి సినిమా అయిన ‘సత్యభామ’ను సపోర్ట్ చేయడానికి అనిల్ రావిపూడి, బాలకృష్ణ ముందుకొచ్చారు. ముందుగా ‘సత్యభామ’ ట్రైలర్ ఈవెంట్‌కు వచ్చిన అందరికీ విషెస్ చెప్తూ తన స్పీచ్‌ను మొదలుపెట్టారు బాలయ్య. ‘‘మొన్నే ఎలక్షన్స్ ప్రచారం అయిపోయింది. షూటింగ్ మొదలుపెట్టేద్దాం అని మంచి ఊపులో వచ్చాను. కానీ ఇప్పటివరకు షూటింగ్ మొదలుపెట్టలేదు. 45, 50 రోజులు ఏం మిస్ అయ్యానో అది ఈ ఫంక్షన్ ద్వారా తీర్చుకుంటున్నాను. కెమెరాను చాలా మిస్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చారు బాలకృష్ణ. ‘సత్యభామ’ సినిమాకు పనిచేసిన అందరికీ తన ఆశీస్సులు తెలిపారు. 

ఉగాది పచ్చడి..

‘‘కొన్ని పేర్లు తలచుకోగానే మనలో ఒక వైబ్రేషన్ వస్తుంది. అలాంటి వాటిలో సత్యభామ పేరు కూడా ఒకటి. కిలికించితనాలు అని కొన్ని పదాలు ఉంటాయి. మేము ఆదిత్య 369లో అలాంటి పదాలు వాడాం’’ అంటూ ఆ సినిమాలోని ‘జానవులే’ పాటను ఆలపించారు బాలయ్య. తాను ఎప్పుడూ శ్రీకృష్ణుడు.. పారిజాతాన్ని హరించడానికి వెళ్లినప్పుడు వచ్చే పద్యాన్ని స్మరిస్తూ ఉంటానని బయటపెట్టారు. ‘‘మహిళా సాధికారితకు కూడా పేరు సత్యభామే. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు ఉండొచ్చు. కానీ ఆయనను తన చెప్పుచేతల్లో పెట్టుకున్న భార్య సత్యభామ’’ అని అన్నారు. ఇక ‘సత్యభామ’ సినిమాలో కాజల్ చేసిన ఫైట్స్, యాక్షన్‌ను ప్రశంసించారు. ఆర్టిస్టులు అనేవాళ్లు ప్రయోగాలు చేస్తుండాలి అన్నారు. అన్నింటిని రంగరించి ఉగాది పచ్చడిలాగా ‘సత్యభామ’ను తెరకెక్కించారని మేకర్స్‌ను ప్రశంసించారు. 

16 ఏళ్లు పూర్తి..

మూవీ కెమెరామ్యాన్‌ను ప్రశంసిస్తూ.. తాను కూడా మొదట్లో కెమెరామ్యాన్ అవ్వాలి అనుకున్న విషయాన్ని బయటపెట్టారు బాలకృష్ణ. ‘‘అన్ని క్రాఫ్ట్స్ మీద ఒక అవగాహన ఉండాలి అనుకునేవాడిని’’ అన్నారు. ఇక కాజల్ ఇండస్ట్రీకి వచ్చిన 16 ఏళ్లలో ఎన్నో పాత్రలు చేసిందని తెలిపారు. ఒక బిడ్డను కూడా కని తిరిగి ఇండస్ట్రీకి రావడం చాలా గొప్ప విషయమని అన్నారు. ‘‘హీరోయిన్‌గా చేసినవారు తల్లి పాత్రలో, అక్క పాత్రలో చేస్తే అదే ముద్రపడిపోతుంది అంటారు. దాన్ని బ్రేక్ చేసినవాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు. వాళ్లలో కాజల్ ఒకరు. ఆమె డెడికేషన్ ముందు తరాలకు ఆదర్శం. ఆమె ఒక ఫైర్‌బ్రాండ్’’ అని తెలిపారు బాలయ్య. తన తండ్రి ఎన్‌టీఆర్ గురించి, ఆయన సినిమాల గురించి గర్వంగా చెప్పుకొచ్చారు. చివరిగా జూన్ 7న విడుదలయ్యే ‘సత్యభామ’ను థియేటర్లలో చూడమని ప్రేక్షకులను కోరారు బాలకృష్ణ.

Also Read: సత్యభామ ట్రైలర్‌ వచ్చేసింది - యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టిన కాజల్‌ అగర్వాల్

టాప్ హెడ్ లైన్స్

Garividi Lakshmi Review - 'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
Sunday OTT Movies : సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
AK47 Second Single: అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget