అన్వేషించండి

Karthika deepam 2 Serial Today August 30th: ‘కార్తీకదీపం 2’ సీరియల్: కాశీని అవమానించిన జ్యోత్స్న – శౌర్య కు జబ్బుందని దీపకు చెప్పిన అనసూయ

Karthika deepam 2 Today Episode: రాఖీ కట్టించుకున్న కాశీని, జ్యోత్స్న అవమానించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Karthika deepam 2 Serial Today Episode: కాశీకి రాఖీ కట్టిన తర్వాత దీప..  స్వప్న, కాశీ ల ప్రేమ గురించి ఆలోచిస్తూ..  కార్తీక్ బాబు చాలా పెద్ద సమస్యలో పడ్డారని మనసులో అనుకుంటుంది దీప. తర్వాత అక్కడి నుంచి దాసు, కాశీ వెళ్లిపోతారు. మరోవైపు దాసు, కాశీ ఇంటికి రావడంతో పారిజాతం హ్యాపీగా ఫీలవుతుంది. ఇంట్లో అందరినీ పరిచయం చేస్తుంది. కార్తీక్‌ దాసును చూసి మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. దీంతో దాసు, పారిజాతం పిన్ని కొడుకు అని కాంచన చెప్తుంది. కాశీ తన మనవడని పారిజాతం చెప్పడంతో కార్తీక్‌, స్వప్న కాశీల ప్రేమను గుర్తు చేసుకుని షాక్‌ అవుతాడు.

కార్తీక్‌: నువ్వు హాస్పిటల్ కి వచ్చినప్పుడు కాశీ దాసు మావయ్య కొడుకు అని ఎందుకు చెప్పలేదు.

పారిజాతం: అప్పుడు నువ్వు జ్యోత్స్న మీద కోపంగా ఉన్నావని చెప్పలేదు.

కార్తీక్‌: ఇప్పుడు స్వప్నతో కాశీ పెళ్లి ఎలా జరుగుతుంది. పెళ్లి చేయాలంటే స్వప్న తండ్రి ఎవరో అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నాన్న గురించి అమ్మకు తెలిస్తే ఏంటి పరిస్థితి. (అని మనసులో అనుకుంటాడు.)

   ఇంతలో శివనారాయణ వస్తే కాశీని ఆశీర్వాదం తీసుకోమంటుంది పారిజాతం. అయితే ఇలాంటి ఏమీ వద్దని.. రాఖీ కట్టించుకుని వెళ్ళమని సీరియస్ గా చెప్తాడు. ఇక రాఖీ కట్టేందుకు జ్యోత్స్న కాశీకి బొట్టు పెడుతుంది. దీంతో  నేను చేసిన తప్పును నా చేతులతోనే సరిదిద్దుకుంటున్నానని పారిజాతం అంటుంది. ఇక అపార్థాలు అన్నీ తొలగిపోయినట్టేనని కాంచన అంటుంది. కాశీ చేతికి రాఖీ ఉండటం చూసి జ్యోత్స్న  ఫీలవుతుంది. ఎవరు కట్టారని అడుగుతుంది. దీపక్క కట్టిందని కాశీ చెప్పేసరికి జ్యోత్స్న  సీరియస్‌ అవుతుంది. అయితే నేను ఈరోజు బతికి ఉన్నాను అంటే అది దీపక్క వల్లే కదా అంటాడు కాశీ. కానీ ముందు దీప కట్టిన రాఖీ తీసేయమని జ్యోత్స్న సీరియస్‌గా చెప్తుంది. అయితే అలా తీయడం మంచిది కాదని కాంచన చెప్పేసరికి జ్యోత్స్న, కార్తీక్‌ ను చూసి కూల్‌ అయినట్లు నటిస్తుంది. మనసు చంపుకుని రాఖీ కడుతుంది. తర్వాత కాంచన కూడా తన అన్న దశరథకు రాఖీ కడుతుంది.

కాశీ: రాఖీ కడితే ఏదైనా ఇవ్వాలి కద అక్క నా దగ్గర ఈ ఐదొందలు ఉన్నాయి తీసుకో

జ్యోత్స్న: నీకు నేను రాఖీ కట్టడమే చాలా ఎక్కువ, నీ స్థాయి వేరు నా స్థాయి వేరు. నాకు గిఫ్ట్ ఇచ్చే రేంజ్ నీది కాదు.

  కాంచన దాసుకు కూడా రాఖీ కడుతుంది.

దాసు: మీరంతా మంచి వాళ్ళు కానీ నా కూతురే ఏ మంచితనం లేకుండా పెరిగింది.

 అంటూ అందరితో బాధపడుతుంటాడు మరోవైపు కాశీ, స్వప్న ల గురించి దీప ఆలోచిస్తుంది. ఇంతలో  అనసూయ వచ్చి ఇంటి కాగితాలు దీప చేతిలో పెడుతుంది. వాటితో పాటు కొంత డబ్బు కూడా ఇస్తుంది.

దీప: ఏంటత్తయ్యా ఇవి.. నాకెందుకు ఇస్తున్నారు.

అనసూయ: అప్పులు తీరుస్తానని నీ దగ్గర తీసుకున్న డబ్బులు ఇవి. ఏ సంబంధం లేని కార్తీక్ బాబు నా కొడుకు చేసిన అప్పులన్నీ తీర్చాడు.

దీప: ఎందుకు అత్తయ్య నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుతున్నారు.

అనసూయ: అదేం లేదు దీప ఇక నువ్వు నీ కూతురు గురించి ఆలోచించు అసలే దాని ఆరోగ్యం కూడా సరిగా లేదు.

 అంటూ అనసూయ నోరు జారడంతో దీప షాక్‌ అవుతుంది. నా కూతురి గురించి ఏదైనా నిజం దాస్తున్నావా అని అనసూయను అడుగుతుంది దీప. దీంతో తేరుకున్న అనసూయ అదేం లేదని మనలాంటి వారికి కష్టాలు ఎప్పుడొస్తాయో తెలియదని అందుకే ఈ ఆస్థి నీ దగ్గరే పెట్టుకోమని.. మన లాగే శౌర్య కష్టపడకూడదని చెప్తుంది అనసూయ. అనసూయ మాటలకు దీప ఎమోషనల్‌‌ గా ఫీలవుతుంది. మరోవైపు ఫంక్షన్ ఉందని అబద్ధం చెప్పి స్వప్నను కావేరీ అందంగా రెడీ చేస్తుంది. శ్రీధర్‌ అబ్బాయిని తీసుకుని వచ్చి పరిచయం చేసి ఇతనే నీకు కాబోయే భర్త అనేసరికి స్వప్న షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును తమ లోకానికి వెళ్దామన్న గుప్త – రామ్మూర్తికి అబద్దం చెప్పిన వార్డెన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Embed widget