అన్వేషించండి

Karthika deepam 2 Serial Today August 27th: ‘కార్తీకదీపం 2’ సీరియల్: తనను కాపాడిన అమ్మాయిని గుర్తు చేసుకున్న కార్తీక్ – అనసూయను తనతో పాటు ఉండమన్న దీప

Karthika deepam 2 Today Episode: ఎక్కడో పని చేసుకుంటున్న అనసూయను తనతో పాటు రమ్మని ఇక నుంచి అందరం కలిసే ఉందామని దీప చెపప్డంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Karthika deepam 2 Serial Today Episode:  కార్తీక్‌ చైన్‌ చూస్తుంటాడు. ఇంతలో కాంచన వచ్చి ఈ చైన్‌ ఏంటి? ఎవరా? అమ్మాయి. ఏదైనా లవ్ స్టోరీ ఉందా అని అడుగుతుంది. అయితే అలాంటిదేం లేదని నేను చిన్నప్పుడు కోనేరులో పడిపోతే కాపాడిన అమ్మాయిది ఈ చైన్‌ అంటాడు కార్తీక్‌.

కాంచన: మరి దాన్ని అంతలా ఎందుకు చూస్తున్నావు. అంత జాగ్రత్తగా ఎందుకు  దాచుకున్నావు.

కార్తీక్‌: అదా  ఈ చైన్‌ నా ప్రాణాలు కాపాడిన అమ్మాయిది. తన రుణం తీర్చుకోవాలని నాకు తను సాయం చేసినట్లే నేను తనకు చేయాలని గుర్తుగా దాచుకున్నాను.

కాంచన: నువ్వేం అంతలా ఆలోచించకు చిన్న వయసులో అంత సాయం చేసిందంటే ఆ అమ్మాయిది ఎంతో మంచి మనసు అయ్యుంటుంది.  అంత మంచి మనసున్న అమ్మాయి జీవితం కూడా బాగానే ఉంటుంది.

కార్తీక్‌: ఏమో ఎవరి జీవితం ఎలా ఉంటుందో మనకేం తెలుసు అమ్మా..?  ఆ అమ్మాయి కూడా దీప లాగే కష్టాల్లో  ఉందేమో..?

 అని ఇద్దరూ మాట్లాడుకుంటారు. మరోవైపు బయటకు వెళ్లిన దీపకు అనసూయ  పని చేస్తూ.. కనిపిస్తుంది.  దగ్గరు వెళ్లి అనసూయను  నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని దీప అడుగుతుంది. అయితే జరిగిన విషయం మొత్తం చెప్తుంది అనసూయ. దీంతో దీప తన వెంట రమ్మని అనసూయను అడుగుతుంది. పని అయిపోయాక వస్తానని అనసూయ చెప్తుంది. మరోవైపు నర్సింహ చేతిలో ఒక లిస్టు పెడుతుంది శోభ.

శోభ: ఆ చీటిలో ఉన్న డబ్బులు మీరు నాకు కట్టాలి.

నర్సింహ: ఏంటిది..? ఏం లిస్టు..

శోభ: ఇన్నాళ్లు మీ అమ్మని మేపిన ఖర్చు. నిన్ను మేపిన ఖర్చు.. కోర్టుకు అయిన ఖర్చు. అంతా కలిపి 5 లక్షలు అయ్యింది. ముందు డబ్బులు కట్టండి.   

నర్సింహ: ఖర్చు పెట్టిన డబ్బు మళ్లీ తిరిగొస్తుందా? ఎక్కడైనా..?

  అని నర్సింహ అనగానే అతని జేబులోని కారు తాళాలు తీసుకుని.. మా పైసలు మాకు ఇచ్చే వరకు నీకు కారు లేదు.. బైకు లేదు అని వార్నింగ్‌ ఇస్తుంది శోభ.  మరోవైపు స్వప్నకు లైఫ్‌ గురించి చెప్తాడు కార్తీక్‌. ప్రేమ, పెళ్లి కన్నా ముందు లైఫ్‌లో స్థిరపడు అంటాడు. మీ ప్రేమకు మీ ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారా? అని అడిగితే అమ్మ ఒప్పుకుంటుంది కానీ నాన్న ఒప్పుకుంటాడో లేదోననే భయం ఉందంటుంది. స్వప్న తర్వాత కార్తీక్‌, దీపలకు థాంక్స్‌ చెప్తుంది. ఎందుకు అని కార్తీక్‌ అడిగితే కాశీని దీప కాపాడిందని.. నువ్వేమో హాస్పిటల్‌ బిల్‌ కట్టావని థాంక్స్‌ చెప్పాను అంటుంది స్వప్న. మరోవైపు ఇంటికి వచ్చిన  అనసూయను చూసిన శౌర్య భయపడుతుంది. కంగారుగా దీప దగ్గరకు వెళ్తుంది.

దీప: అమ్మా శౌర్య ఎందుకు భయపడుతున్నావు..

శౌర్య: అమ్మా మళ్లీ బూచోడు వచ్చాడమ్మా..

దీప: బూచోడు కాదమ్మా.. ఆమె మీ నాన్నమ్మ..

శౌర్య: నాన్నమ్మ బూచోడిని కూడా తీసుకొస్తుంది కదా అమ్మా..

అనసూయ: అమ్మా శౌర్య అలాంటిదేం లేదమ్మా.. నేను ఒక్కదాన్నే వచ్చాను చూడు..

 అనగానే శౌర్య నవ్వుకుంటూ అనసూయ దగ్గరకు వెళ్తుంది. తర్వాత దీప, సుమిత్ర దగ్గరకు వెళ్లి అనసూయని తనతో పాటు ఇంట్లో ఉండటానికి పర్మిషన్‌ ఇవ్వమని అడుగుతుంది. దీంత ఆ మనిషి ఎవరో తెలియక ముందే ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నాను.. ఇప్పుడు ఎందుకు వద్దంటాను అంటుంది సుమిత్ర. అనసూయ దగ్గరుకు వెళ్లి జరిగింది మర్చిపోయి ఇకనుంచైనా హాయిగా ఉండండని చెప్తుంది. ఇక అనసూయలో వచ్చిన మార్పు చూసి దీప హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: తమిళ తెరకు శ్రీలీల - వరుస విజయాలతో జోరు మీదున్న హీరోతో ఛాన్స్ కొట్టేసిందిగా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Embed widget