Sreeleela: తమిళ తెరకు శ్రీలీల - వరుస విజయాలతో జోరు మీదున్న హీరోతో ఛాన్స్ కొట్టేసిందిగా!
Sreeleela Tamil Movie: కథానాయికగా స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న అతికొద్ది మంది తెలుగు అమ్మాయిలలో శ్రీ లీల ఒకరు. ఇప్పుడు ఆమె తమిళ సినిమాలో అడుగు పెట్టడానికి రెడీ అయ్యారని తెలిసింది.
శ్రీ లీల... స్టార్ హీరోయిన్. అతి చిన్న వయసులో స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్, ఆ మాటకు వస్తే తెలుగు అమ్మాయి కూడా ఈ అందాల భామ అని చెప్పాలి. 'పెళ్లి సందD'తో శ్రీ లీల తెలుగు చిత్రసీమలో కథానాయికగా అడుగు పెట్టారు. అయితే... అప్పటికే ఆవిడ కన్నడలో సినిమాలు చేశారు. 'పెళ్లి సందD' తర్వాత శ్రీ లీల వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస సినిమాలు చేశారు. ఇప్పుడు ఆవిడకు హిందీ, తమిళ సినిమా అవకాశాలు వస్తున్నాయి. త్వరలో తమిళ తెరకు శ్రీ లీల పరిచయం కానున్నారని సమాచారం.
శివ కార్తికేయన్ సినిమాతో తమిళ తెరకు శ్రీ లీల!
తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్. 'రెమో', 'వరుణ్ డాక్టర్', 'డాన్' సినిమాలతో తెలుగులోనూ ఆయన విజయాలు అందుకున్నారు. 'జాతి రత్నాలు' ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో 'ప్రిన్స్' సినిమా చేశారు. ఇప్పుడు ఆయనకు జంటగా తమిళ చలన చిత్ర పరిశ్రమకు శ్రీ లీల పరిచయం అవుతున్నారని సమాచారం.
శివ కార్తికేయన్ కథానాయకుడిగా జాతీయ పురస్కార గ్రహీత, 'ఆకాశం నీ హద్దురా' ఫేమ్ సుధా కొంగర ఓ సినిమా చేస్తున్నారు. 'పురాణనూరు' అనేది ఆ మూవీ టైటిల్. ప్రస్తుతం తమిళంలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమాల్లో ఇదొకటి. ఇందులో హీరోయిన్ రోల్ శ్రీ లీల చెంతకు వచ్చిందని, ఇదే ఆమె తొలి తమిళ సినిమా అని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇటీవల హీరో హీరోయిన్లపై ఫోటో షూట్ కూడా చేశారట. త్వరలో ఆ విషయం వెల్లడించే అవకాశం ఉంది.
సిద్ధార్థ్ మల్హోత్రాతో హిందీ సినిమా 'మిట్టి'లో!
హిందీ సినిమా ఇండస్ట్రీకి కూడా శ్రీ లీల ఇంట్రడ్యూస్ కానున్నారు. బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలలో ఒకరైన సిద్ధార్థ్ మల్హోత్రాతో నటించే అవకాశం ఆమెకు వచ్చిందని సమాచారం. బల్విందర్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మిట్టి' సినిమాలో హీరోయిన్ రోల్ శ్రీ లీలకు ఆఫర్ చేశారు. ఆ సంగతి కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు.
Also Read: మాన్‌స్టర్ కాదు... రాజశేఖర్ - పవన్ సాధినేని సినిమాకు 1990 సూపర్ హిట్ టైటిల్
ఇప్పుడు తెలుగులో శ్రీ లీల చేస్తున్న సినిమాలు!
ప్రస్తుతం శ్రీ లీల చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. 'ధమాకా' విజయం తర్వాత మాస్ మహారాజా రవితేజతో మరోసారి ఆవిడ నటిస్తున్నారు. అదీ రవితేజ 75వ సినిమాలో. 'సామజవరగమన' రచయిత భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా చిత్రీకరణలో సైతం ఆవిడ పాల్గొన్నారు. నితిన్ సరసన శ్రీ లీల నటించిన 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆశించిన విజయం సాధించలేదు. ఆ లోటు 'రాబిన్ హుడ్'తో పూడ్చాలని, విజయం అందుకోవాలని శ్రీ లీల చూస్తున్నారు. 'భీష్మ' విజయం తర్వాత నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో తొలుత రష్మికను హీరోయిన్ అనుకున్నా... వేరే సినిమాల వల్ల ఆమె తప్పుకొన్నారు. ఆ తర్వాత శ్రీ లీల వచ్చి చేరారు.
Also Read: కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ... ఆహా కాదండోయ్, మరో వేదికలో నిహారిక నిర్మించిన సినిమా