అన్వేషించండి

Rajasekhar - Magaadu Movie: మాన్‌స్ట‌ర్‌ కాదు... రాజశేఖర్ - పవన్ సాధినేని సినిమాకు 1990 సూపర్ హిట్ టైటిల్

Pavan Sadineni Upcoming Movies: యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'మాన్‌స్ట‌ర్‌' టైటిల్ ఖరారు చేసినట్టు వినిపించింది. కానీ, ఇప్పుడు ఆ టైటిల్ మార్చినట్టు టాక్.

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) కథానాయకుడిగా యువ దర్శకుడు పవన్ సాధినేని (Pavan Sadineni) ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇది అనౌన్స్ చేసి చాలా రోజులు అయ్యింది. కానీ, ఇద్దరికీ ఉన్న కమిట్‌మెంట్స్ వల్ల ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. త్వరలో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ మారిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

'మాన్‌స్ట‌ర్‌' కాదు... 1990 సూపర్ హిట్ సినిమా టైటిల్!
రాజశేఖర్, పవన్ సాధినేని సినిమాకు 'మాన్‌స్ట‌ర్‌' ఖరారు చేసినట్టు ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఆ టైటిల్ పరిశీలనలో ఉందని యూనిట్ సభ్యుల నుంచి సైతం వినిపించింది. కానీ, ఇప్పుడు టైటిల్ మారిందని టాక్.

రాజశేఖర్ సూపర్ హిట్ సినిమాల్లో 'మగాడు' ఒకటి. ఆయనకు యాంగ్రీ స్టార్ ఇమేజ్ తీసుకు వచ్చిన సినిమా అది. 1990లో విడుదల అయ్యింది. ఆ 'మగాడు' టైటిల్ తాజా సినిమాకు ఖరారు చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also Read: కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ... ఆహా కాదండోయ్, మరో వేదికలో నిహారిక నిర్మించిన సినిమా


రాజశేఖర్ సినిమాలో రాజ్ తరుణ్ కీలక పాత్ర!?
రాజశేఖర్ సోలో హీరోగా తెరకెక్కిన 'పిఎస్వి గరుడ వేగ', 'కల్కి' సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అయితే, ఆ తర్వాత నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్'లో కీలక పాత్ర చేశారు. యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మరో యంగ్ హీరో కూడా ఉన్నారని తెలిసింది. రాజశేఖర్, పవన్ సాధినేని 'మగాడు' సినిమాలో యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓ రోల్ చేస్తున్నారని టాక్. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని, రాజ్ తరుణ్ జంటగా 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ చేసిన సంగతి వీక్షకులకు తెలిసిన విషయమే.

Also Readభయపడకు, నేనున్నాను... మహేష్ వాయిస్ ఓవర్‌తో 'ముఫాసా' తెలుగు ట్రైలర్ వచ్చేసిందోచ్!

ఓటీటీలకు ఆదరణ పెరిగిన తర్వాత దర్శకుడిగా పవన్ సాధినేనిలో కొత్త కోణం ప్రేక్షకులకు తెలిసింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న 'సేనాపతి' సినిమా గానీ, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో 'దయా' వెబ్ సిరీస్ గానీ, షో రన్నర్‌గా చేసిన జీ 5 వెబ్ సిరీస్ 'పరువు' గానీ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల పొగడ్తలు లభించాయి.

పాన్ ఇండియా ప్రేక్షకులకు సుపరిచితుడైన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా 'ఆకాశంలో ఒక తార' చేసే అవకాశం అందుకున్నారు. ఆ సినిమాను 'కల్కి 2898 ఏడీ'తో పాన్ ఇండియా విజయం అందుకున్న వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. 'ఆకాశంలో ఒక తార' కంటే ముందు రాజశేఖర్ 'మగాడు' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి  కావొచ్చిందని, ఈ ఏడాది డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి మల్కాపురం శివకుమార్ నిర్మాత.

Also Readమైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో మహేష్ - రాజమౌళి సినిమా... ఇది మామూలు ప్లాన్ కాదయ్యా!

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget