Karthika deepam 2 Serial Today August 19th: ‘కార్తీకదీపం 2’ సీరియల్: పారిజాతానికి వార్నింగ్ ఇచ్చిన జ్యోష్ణ – దీపకు ఏదైనా సాయం చేస్తామన్న సుమిత్ర
Karthika deepam 2 Today Episode: దాసును మరోసారి ఇంటికి రానివ్వొద్దని పారిజాతానికి జ్యోష్ణ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Karthika deepam 2 Serial Today Episode: శౌర్య భయంతో ఏడుస్తూ దీపను ఘట్టిగా పట్టుకుంటుంది. బూచోడు వచ్చాడని భయపడుతుంది. బూచోడి దగ్గరకు నేను వెళ్లను అంటుంది. మళ్ళీ తీసుకెళ్లడానికి వస్తాడా? అంటుంది. ఎవరూ రారు కోర్టు విడాకులు ఇచ్చింది. మీ నాన్న మన జోలికి వస్తే పోలీసులు పట్టుకుపోతారని చెప్తుంది. తర్వాత కార్తీక్ ఫోన్ చేసి శౌర్య గురంచి అడుగుతాడు. ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేస్తాడు.
దీప: కోర్టులో జరిగిన దాని గురించి మీ నాన్న ఏమైనా అన్నారా?
కార్తీక్: అదేం లేదు.. కానీ జ్యోష్ణ ఏదైనా గొడవ చేసిందా?
అని అడగ్గానే దీప పలకకుండా ఉండిపోతుంది. తర్వాత ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. మరోవైపు పారిజాతం దాసు గురించి ఆలోచిస్తుంది. జ్యోష్ణకు బుద్ధి చెప్పి ఎలాగైనా సారి చెప్పించాలని అనుకుంటుంది. అప్పుడే ఎదురుగా జ్యోష్ణ ఉంటుంది.
జ్యోష్ణ: తాతకు నువ్వు రెండో భార్య అని తెలుసు.. మరి దాసు ఎక్కడ నుంచి వచ్చాడు.
పారిజాతం: ఇది మీ తాతయ్యకే కాదు నాకు రెండో పెళ్లి. మీ తాతయ్యను పెళ్లి చేసుకోవడానికి ముందే నాకు దాసు కొడుకు. మీ నాన్న చెప్పాడు కదా బాబాయ్ అవుతాడని ఇంకోసారి కనిపిస్తే అలాగే పిలువు.
జ్యోష్ణ: నువ్వే చెప్పావ్ కదా మనిషిని బట్టి విలువ ఇవ్వాలని. రెస్టారెంట్ లో నేను కొట్టింది నీ కొడుకునే అని నీకు తెలుసు నాకు అక్కడే ఎందుకు చెప్పలేదు.
అంటూ ఇద్దరూ దాసు గురించి మాట్లాడుకుంటారు. ఆ మనిషికి విలువ లేదు కాబట్టే కుటుంబం మొత్తం ఆయన్ని దూరం పెట్టిందని జ్యోష్ణ అంటుంది. దీంతో నువ్వు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు వాడు ఎవడో తెలుసాక? అంటూ ఏదో చెప్పబోతూ ఆగిపోతుంది పారిజాతం. కుటుంబమే దూరం పెట్టిన ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం తనకు లేదంటుంది జ్యోష్ణ.
పారిజాతం: నువ్వు కొట్టింది నా కొడుకును అని తెలిసిన తర్వాత సారి చెప్తావ్ అనుకున్నానున.
జ్యోష్ణ: నేనేం తప్పు చేయలేదు వయసులో పెద్దవాడిని కొట్టానని కొద్దిగా గిల్టీగా ఉండేది. కానీ అతను ఎలాంటి వాడో తాత చెప్పిన తర్వాత అసలు ఫీల్ అవడం లేదు. నువ్వు కూడా అతని గురించి ఆలోచించకు.
పారిజాతం: జ్యోష్ణ నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. వాడు వీడు అంటావేంటి?
జ్యోష్ణ: నేను ఇలా మాట్లాడటానికి కారణం నువ్వే. అలాంటి వాళ్ళకు విలువ ఇవ్వకూడదని చెప్పింది నువ్వే. ఇప్పుడు నువ్వే ఇవ్వమని అంటున్నావు.
అంటూ జ్యోష్ణ కోపంగా పారిజాతాన్ని తిట్టి ఇంకెప్పుడు అతన్ని ఇంటికి రానివ్వకు అని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో పెంచిన పాము కాటేసినట్టు నా పెంపకమే నాకు శత్రువు అయ్యింది అనుకుంటుంది పారిజాతం. మీ ఇద్దరినీ దగ్గర చేసి నీ ద్వారా దాసును ఇంటికి తీసుకు రావాలని కానీ అదంతా నాశనం చేశావు. నిన్ను ఎంత ప్రమాదకరంగా పెంచానో నాకు ఇప్పుడు అర్థం అవుతుందని బాధపడుతుంది పారిజాతం. మరోవైపు దీపతో దశరథ, సుమిత్ర మాట్లాడతారు.
సుమిత్ర: మా ఇంటికి వచ్చినప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూనే ఉన్నావు. ఇప్పుడు నీ జీవితం, నీ కూతురు జీవితం నీ చేతుల్లోనే ఉంది.
దశరథ: ఇప్పుడు నీకేం సాయం కావాలో చెప్పు దీప చేస్తాం. నువ్వు సొంతంగా వ్యాపారం పెట్టుకుంటానంటే చెప్పు సాయం చేస్తాం. లేదంటే మా రెస్టారెంట్ లో పని చేస్తావా? నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు..?
సుమిత్ర: ఇదే మీ అమ్మానాన్న అడిగితే ఇలాగే ఆలోచిస్తావా దీప.
అని దశరథ, సుమిత్ర, దీపను అడుగుతుంటే ఇంతలో జ్యోష్ణ వస్తుంది. దీపను వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: హీరో ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేం: సీఎం రేవంత్ రెడ్డి