అన్వేషించండి

Jagadhatri Serial January 18th: 'జగద్ధాత్రి' సీరియల్: సుధాకర్‌కి వార్నింగ్ ఇచ్చిన సూరి మామ.. మీనన్ చెరలో గవర్నర్! 

Jagadhatri serial Today Episode: గవర్నర్ ని బంధించిన మీనన్ తన డిమాండ్లను తీర్చమంటూ హెచ్చరికలు జారీ చేస్తాడు. దాంతో ధాత్రి వాళ్ళు ఈ కేసు ఎలా డీల్ చేస్తారు అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.

Jagadhatri serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో కీర్తి స్టేజ్ పై డాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ధాత్రి అనుకోకుండా తమ వెనుక సీట్లో ఉన్న సూరి మామని గుర్తిస్తుంది. వెంటనే కేదార్ కి చెప్తుంది. ఇద్దరు కలిసి సూరి మామ దగ్గరికి వెళ్తారు. సూరి మామ వాళ్ళిద్దరి దగ్గర నుంచి తప్పించుకోవాలని చూస్తాడు.

కేదార్: ఆ రోజు లాగా తప్పించుకోవాలని చూడొద్దు మామ. నేను సుహాసిని కొడుకుని అవునో కాదో అనే అనుమానం నీకు వచ్చి ఉంటుంది అందుకే వెళ్ళిపోయి ఉంటావు. నీ చెల్లెలు మీద నీకున్న బాధ్యతకి నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు.

ధాత్రి: సుధాకర్ గారు కేదార్ ని కొడుకుగా ఒప్పుకోవటం లేదు, సాక్షాధారాలు తీసుకొని రమ్మంటున్నారు మీరే సాయం చేయాలి అని అంటుంది.

కేదార్: తన పర్సులోని ఫోటో చూపించి ఇదిగో మా అమ్మ అని చెప్తాడు.

అది చూసి ఆనందపడతాడు సూరి మామ. నువ్వు మా సుహాసిని కొడుకువా.. కళ్ళముందే ఉన్నా గుర్తించలేకపోయాను క్షమించు అంటాడు.

సూరి మామ : ఆ సదాకర్ ఒక గుంట నక్క మాయమాటలతో నన్ను నా చెల్లెల్ని నమ్మించాడు. అతడిని నమ్మి నా చెల్లెల్ని వాడి చేతిలో పెట్టాను. ఆ తరువాత ఇంట్లో వాళ్ళు బాధపడతారని వేరే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు మీ అమ్మని మోసం చేశాడు అని చెప్తాడు.

అదే సమయంలో సుధాకర్ కి ఫోన్ రావడంతో డిస్టబెన్స్ గా ఉందని పక్కకు వచ్చి మాట్లాడుతాడు. అతడిని చూసి గుర్తుపట్టాడు సూరి మామ. అతను సుధాకర్ ఏ కదా అని కేదార్ వాళ్ళతోని అంటాడు వాళ్లు అవును అనటంతో సుధాకర్ దగ్గరికి వెళ్తాడు సూరి మామ.

సుధాకర్: సూరి నువ్వా అని కంగారుగా అడుగుతాడు.

సూరి మామ: పర్వాలేదే పాత బంధాలు పాత మనుషులు బాగానే గుర్తుంచుకున్నావు అంటాడు. ఇంట్లో వాళ్ల కోసం చేసుకుంటున్నాను అని చెప్పి పెళ్లి చేసుకొని నా చెల్లెల్ని మోసం చేశావు, ఇప్పుడు సాక్షాధారాలు తీసుకురమ్మని నీ కొడుకుని ఇబ్బంది పెడుతున్నావంట సాక్షాధారాలు లేవనే ధైర్యంతోనే ఇలా మాట్లాడుతున్నావు కదా నా దగ్గర సాక్షాదారాలు ఉన్నాయి అంటాడు.

సుధాకర్: కంగారు పడిపోతూ ఎవరు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అంటూ మాట మార్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

సూరి మామ: కోపంగా మళ్లీ ధాత్రి వాళ్ళ దగ్గరికి వచ్చి వాడు ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో, ఆధారాలు లేవనే ధైర్యంతో అలా మాట్లాడుతున్నట్టున్నాడు నేను ఊరు వెళ్తున్నాను ఎల్లుండి నా దగ్గరికి రండి నేను మీకు సాక్ష్యాలు ఇస్తాను వాడి పరువు బజారున పడేయాలి అంటాడు.

కేదార్: ఆయనని కష్టపెట్టి నేను ఏం సుఖపడతాను ఆయన పరువు బజారున పటేయటం నా ఉద్దేశ్యం కాదు నన్ను కొడుగ్గా అంగీకరించి నేనున్నానని ధైర్యం చెప్తే చాలు అని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తారు కేదార్ దంపతులు.

ఆ తర్వాత ప్రోగ్రాం ముగియడంతో గవర్నర్ అక్కడి నుంచి బయలుదేరుతాడు. అప్పటికే మీనన్ ముసుగులు ధరించి అక్కడ ఉన్న పోలీసులని మట్టుపెట్టి లోపలికి వచ్చి గవర్నర్ కి గన్ గురిపెడతాడు.

మీనన్ : నా పేరు మీనన్ నాకు కావలసింది గవర్నర్ మాత్రమే మీరు ఎవరో నాకు తెలియదు. నా డిమాండ్లన్నీ తీరేవరకు కామ్ గా కూర్చోండి లేదంటే మీ ప్రాణాలు పోతాయి అలాగే గవర్నర్ గారికి బుల్లెట్ల సన్మానం జరుగుతుంది అని హెచ్చరిస్తాడు.

ధాత్రి : సార్ చెప్పిన పెద్ద తలకాయ గవర్నర్ గారే మీనన్ కి మనం ఎవరో తెలియదు కాబట్టి మనం చేసే అటాక్ సర్ప్రైజింగ్ ఉంటుంది అని చెప్పి అక్కడ ఉన్న ఆడియన్స్ కంగారు పడుతున్న సమయంలో మెల్లగా వెనక డోర్నుంచి వచ్చేస్తారు.

ఆపై మీనన్ పోలీసులకి ఫోన్ చేసి తన డిమాండ్లన్నీ చెప్తాడు. ఇంతలో ధాత్రి వాళ్ళ చీఫ్ పోలీసులకి ఫోన్ చేసి మా టీం బయలుదేరింది కంగారు పడొద్దు అని చెప్తారు.

బయటికి వచ్చిన కేదార్ మన దగ్గర వెపన్స్ లేవు వాడి చుట్టూ చాలా మంది మనుషులు వెపన్స్ తో ఉన్నారు ఎలా అటాక్ చేస్తాం అంటాడు.

ధాత్రి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అంటుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Also Readఅరెరే వేరే కథతో ప్రభాస్ 'రాజ్ సాబ్' సినిమా తీస్తున్నా - ఫన్నీగా స్పందించిన మారుతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Embed widget