Jagadhatri Serial January 16th - 'జగద్ధాత్రి' సీరియల్: బాధతో కన్నీళ్లు పెట్టుకున్న కౌషికి, దివ్యాంకకి గుణపాఠం చెప్పిన ధాత్రి!
Jagadhatri serial Today Episode: నా కుటుంబం జోలికి కౌషికి వదిన జోలికి వచ్చావంటే ఊరుకునేది లేదు అంటూ ధాత్రి దివ్యాంకకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం తో కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి.
Jagadhatri serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో దివ్యాంక ని ఎత్తుకొని వస్తున్న సురేష్ ని చూసి కన్నీరు పెట్టుకుంటుంది కౌషికి. అది చూసి ఆనంద పడుతుంది వైజయంతి. ఆ దివ్యాంకకి బుద్ధి లేకపోతే సురేష్ కైనా ఉండాలి కదా అని కౌషికి మరింత బాధపడేలాగా మాట్లాడుతుంది.
సుధాకర్: అతనితో మనకు ఏ సంబంధం లేదు కదా వాళ్ళు ఎలా పోతే మనకెందుకు వదిలేయండి అంటాడు.
ధాత్రి : మీరు చెప్పండి వదిన, అతనికి మీకు ఎలాంటి సంబంధం లేదా అని అడుగుతుంది.
కౌషికి: లేదు అని చెప్తుంది.
ధాత్రి: మరి ఎందుకు ఆ కన్నీరు అని అడుగుతుంది.
ఇంతలో నిషిక వచ్చి దివ్యాంక కాలుజారి పడిపోతే అన్నయ్య ఎత్తుకొని తీసుకొస్తున్నారు అంటుంది.
కౌషికి : అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, వరసలు కలిపి పిలవద్దు అని హెచ్చరిస్తుంది.
ఇంతలో సురేష్ కౌషికిని చూసి దివ్యాంకని కిందకి దించుతాడు.
దివ్యాంక : నీ మాజీ భార్యకి భయపడి నన్ను దించేసావా నీలాంటి మంచి భర్తని వదులుకున్నందుకు తను బాధపడాలి అంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ లోనే కాదు పర్సనల్ లైఫ్ కి కూడా కొంచెం స్పేస్ ఇవ్వు అని సలహా ఇస్తుంది.
కౌషికి : పక్క వాళ్లకి సలహా ఇచ్చే అంత పొజిషన్లో నువ్వు ఏమీ లేవు అంటుంది.
అయినా నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ కోసం నువ్వు ఎందుకు ఆరాటపడుతున్నావు పద వెళ్దాం అని దివ్యాంక అనడంతో అక్కడినుంచి వెళ్ళిపోతారు సురేష్ వాళ్ళు.
నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోదాం పదండి అంటున్న కౌషికి ని
రెచ్చగొట్టి ప్రోగ్రాంలో కూర్చునే లాగా చేస్తుంది నిషిక.
ఇదంతా చూస్తున్న ధాత్రి దివ్యాంక మరీ ఓవర్ చేస్తుంది తనకి సరైన గుణపాఠం చెప్పాలి అని భర్తతో చెప్తుంది.
కేదార్: ఏం చేయబోతున్నావు అని అడుగుతాడు.
ధాత్రి: నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్లి లోపల దివ్యాంక గురించి మాట్లాడుకుంటున్నారు. నిజమో కాదో తెలియదు కానీ ఆమెకి పెద్ద యాక్సిడెంట్ అయింది అంట రెండు కాళ్లు పోయాయంట అని చెప్తుంది.
మీడియా వాళ్ళు దానిని టీవీలలో ప్రచారం చేస్తారు. అది చూసిన దివ్యాంక కోపంతో రగిలిపోతుంది.
నిషిక : మీరు ఇక్కడే ఉన్నారు కదా మీకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని అడుగుతుంది.
దివ్యాంక : నేనేదో కౌషికి ని ఏడిపించడం కోసం సురేష్ ని ఎత్తుకోమంటే వీళ్ళు ఎవరో దానిని న్యూస్ చేసి పడేశారు. ఎవరో కావాలనే చేశారు అంటుంది.
అక్కడ ఫంక్షన్ నిర్వహిస్తున్న వాళ్ళు బొకే తీసుకొని వచ్చి మీకు యాక్సిడెంట్ అయింది అంట కదా ఇలాంటి పరిస్థితులలో కూడా ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు మీరు నిజంగా గ్రేట్ అని అంటారు.
ప్లాన్ వర్క్ అవుట్ అయినందుకు సంతోషిస్తారు ధాత్రి దంపతులు.
ధాత్రి: దివ్యాంకా వాళ్ల దగ్గరికి వెళ్లి ఇప్పుడు కాలు బాగోకపోతే మా అన్నయ్య ఎత్తుకున్నారు రేపటి నుంచి ఎవరు ఎత్తుకుంటారు అని వెటకారంగా మాట్లాడుతుంది.
కోపంతో రెచ్చిపోయిన దివ్యాంక అటు ఇటు తిరిగి నా కాళ్ళు బాగానే ఉన్నాయి, నాకేమీ జరగలేదు అని చెప్తుంది.
ఇదంతా చూస్తున్న సురేష్ దివ్యాంక ఇదంతా కావాలనే చేసింది అని గ్రహిస్తాడు.నేను ఇదంతా కావాలని చేశాను అని కౌషికి అపార్థం చేసుకుంటుందేమో అని అనుకుంటాడు.
షో నిర్వాహకులు ఇంత త్వరగా రికవరీ అయినందుకు దివ్యాంకని మెచ్చుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
నిషిక: దివ్యాంక కి ఫోన్ చేసి చేసింది చాలు ఇంకా సీన్చేయకు అని హెచ్చరిస్తుంది.
దివ్యాంక : ఇదంతా ఎవరో ప్లాన్ ప్రకారం చేస్తున్నారు అంటుంది.
నిషిక: ఇంకా అర్థం కాలేదా.. జగద్ధాత్రియే ఇదంతా చేస్తుంది అంటుంది.
కోపంతో రెచ్చిపోయిన దివ్యాంక ధాత్రిపై విరుచుకుపడుతుంది.
ధాత్రి: మా వదిన జోలికి నా ఫ్యామిలీ జోలికి వచ్చావంటే ఊరుకునేది లేదు. ఇప్పుడు చూసావుగా ఏం జరిగిందో అంటూ ఆమెకి వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.