Nindu Noorella Saavasam December 11th Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: అంజలిని ఫెయిల్ చేసేందుకు ప్రిన్సిపల్ ప్లాన్, మిస్సమ్మ తండ్రిని చూసేస్తుందా?
Nindu Noorella Saavasam Today Episode: అంజు తన స్కూల్లో చదవుకూడదని కన్నింగ్ మెంటాలిటీ చూపిస్తుంది ప్రిన్సిపల్. దాంతో అంజు ఆ స్కూల్లో చదువుతుందో లేదో అనే ఉత్కంఠ ఏర్పడుతుంది.
Nindu Noorella Saavasam Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో వాళ్లు ఒకరికొకరు బంధువులని తెలిస్తే అందరూ కలిసిపోతారు.. బంగ్లాలలో ఉంటారు. మనం మాత్రం ఈ కొంపలోనే ఉండిపోవాలి అని ఫ్రస్టేట్ అవుతాడు కాళీ.
మంగళ: ఇక మన పని మొదలు పెట్టాల్సిందే, వాళ్లు వాళ్లు కలిసే సమయానికి అడ్డుగా నేనుంటాను అంటుంది.
మరోవైపు ఎంట్రెన్స్ ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసి తీసుకు వస్తారు సార్.
ప్రిన్సిపల్: అదేంటి సెకండ్ క్లాస్ సిలబస్ తో ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేశారు.
సార్: తను థర్డ్ క్లాస్ ఎంట్రన్స్ కి కదా మేడం ఎగ్జామ్ రాస్తుంది, అప్పుడు మనం సెకండ్ క్లాస్ సిలబసే కదా ఇవ్వాలి, లేదంటే ఎగ్జామ్ పాస్ అవ్వలేదు.
ప్రిన్సిపల్ : తను ఎగ్జామ్ పాస్ అవ్వకూడదు, ఈ అమ్మాయికి థర్డ్ క్లాస్ సిలబస్ నుంచి ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేయండి. వాళ్లు వచ్చేస్తూ ఉంటారు త్వరగా ప్రిపేర్ చేయండి అని చెప్పి సార్ ని అక్కడి నుంచి పంపించేస్తుంది. నేనుండగా ఈ స్కూల్లో నిన్ను జాయిన్ అవ్వనివ్వను అని అనుకుంటుంది.
అంతలోనే అమర్ వాళ్ళు స్కూల్ లోకి ఎంటర్ అవుతారు. అమర్ ని చూసిన రామ్మూర్తి అంజలి పాప కూడా వచ్చి ఉంటుంది వెళ్లి పలకరించాలి అనుకొని కారు వెనక వెళ్ళబోతాడు. అప్పుడే సూపర్వైజర్ గేటు దగ్గర ఉండకుండా ఎక్కడికి వస్తున్నావు అంటూ రామ్మూర్తిని మందలించడంతో అక్కడే ఆగిపోతాడు. గేటు వేయకుండా ఆలోచిస్తున్న రామ్మూర్తిని ఇంకా వచ్చే వాళ్ళు ఎవరున్నారు త్వరగా గేటు వెయ్యు అని మందలిస్తాడు సూపర్వైజర్.
రామ్మూర్తి: ఎవరూ రావడం లేదు కానీ కావలసిన వాళ్లు ఎవరో వస్తారు అనిపిస్తుంది అనుకుంటూ డోర్ వేసేస్తుంటే అప్పుడే పరిగెత్తుకుంటూ డోర్ లోపలికి వచ్చేస్తుంది అరుంధతి.
మరోవైపు ఒంట్లో బాగోలేని పిల్లని ఎగ్జామ్ రాయించటానికి తీసుకు వెళ్ళటమేంటి వద్దని చెప్పకపోయారా అని భర్తని అడుగుతుంది అమర్ తల్లి.
అమర్ తండ్రి : వాడు అంజుకి తండ్రి, ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా ఉంటాడు. అయినా అక్కడ మిస్సమ్మ, మనోహరి కూడా ఉన్నారు కదా ఏం భయం లేదు.
నీల: మనోహరి అమ్మగారు పక్కనుంటేనే పాపకి ప్రమాదం.. పొద్దున ఎలా మాట్లాడిందో చూసాను కదా అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత
మిస్సమ్మ: ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అందరిని ఆగమని తను వినాయకుడిని ప్రార్థించడానికి వెళ్తుంది.
అంతలో అరుంధతి అంజు దగ్గరికి వచ్చి ఎందుకిలా చేశావు, ఇంకెప్పుడు ఇలా చేయకు. ఈ స్కూల్ కాకపోతే ఇంకొక స్కూల్లో జాయిన్ అవ్వచ్చు, అయినా అందరికీ చదువు రావాలని ఏమి లేదు. ఎగ్జామ్ తర్వాత రాయచ్చు ఇప్పుడు వెళ్లి రెస్ట్ తీసుకో అంటుంది.
అప్పుడే అమ్ము వాళ్ళు అక్కడికి వస్తారు. చెల్లెలి దగ్గరికి వచ్చి ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నావు, ఎగ్జామ్స్ సంగతి తర్వాత చూసుకోవచ్చు ముందు వెళ్లి రెస్ట్ తీసుకో అని సర్ది చెప్తారు.
ఇంతలో అక్కడ సూపర్వైజర్ లేకపోవడం గమనించిన రామ్మూర్తి అంజు దగ్గరికి గబగబా వస్తాడు. అంజుకి ధైర్యం చెప్పి ఆమెకి పూజ చేసి తీసుకువచ్చిన బొట్టు పెడతాడు.
ఇంతలో సూపర్వైజర్ వచ్చి మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ కసురుకుంటాడు. అమర్ కలుగజేసుకొని నేనే పిలిచాను అంటాడు.
సూపర్వైజర్: లేదండి, వాచ్మెన్ గేటు దగ్గర లేకపోతే ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చేస్తారు.
రామ్మూర్తి: వెళ్ళిపోతాను సార్ అంటూ అంజుకి ధైర్యం చెప్పి వెళ్ళిపోతూ ఉంటే అట్నుంచి పూజ ముగించుకొని మిస్సమ్మ వస్తూ ఉంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.