Jagadhatri Serial Today November 14th Episode: జగద్ధాత్రి సీరియల్: ద్ధాత్రి ఇంట్లో ఏం జరుగుతోంది? బంగారం మిస్సింగ్, సీక్రెట్స్ వెనక రహస్యమేంటి?
Jagadhatri Serial Today Episode November 14th నిషిక సిరికి ఖరీదైన బహుమతి చూసి కౌషికి, జగద్ధాత్రిలు నిషికి అంత డబ్బు ఎక్కడిది అని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి కేథార్‌తో ఇంట్లో ఏదో జరుగుతుందని అంటుంది. దానికి కేథార్ కూడా అవును ద్ధాత్రి ఏదో జరుగుతుంది.. వచ్చిన ఫోన్ కూడా సిరి లిఫ్ట్ చేసి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోవడం వల్ల స్పామ్ కాల్‌లా మాట్లాడారు అని అంటాడు. మొత్తానికి జగద్ధాత్రి, కేథార్‌లకు అనుమానం బాగా పెరుగుతుంది.
జగద్ధాత్రి తండ్రి సిరి గురించి ఆలోచించి ఈ సమస్య నుంచి నిన్ను ఎలా గట్టెక్కించాలో అర్థం కావడం లేదమ్మా అని అనుకుంటాడు. అప్పుడే క్యాటరింగ్ మేనేజర్ వంట వాళ్లకి ఫుల్ అమౌంట్ ఇవ్వలేదు అని వాళ్లు వేరే చోటుకి వెళ్లిపోయారు అని అంటాడు. వచ్చాక మొత్తం డబ్బు ఇస్తా అన్నాను కదా అని అంటారు. జగద్ధాత్రి వచ్చి ఏమైంది అని అంటే జగద్ధాత్రి తండ్రి కవర్ చేయాలని చూస్తే సతీశ్ మాత్రం డబ్బు ఇవ్వలేదు అని కేటరింగ్ క్యాన్సిల్ అయిందని చెప్తాడు. జగద్ధాత్రి షాక్ అయిపోతుంది. ఏం జరిగిందో చెప్పమని జగద్ధాత్రి అంటే అడ్వాన్స్ ఇచ్చాను.. ఇంటికి వస్తే ఇస్తాను అంటే వాళ్లు రాలేదు అని అంటారు.
కౌషికి కూడా అక్కడికి వచ్చి క్యాటరింగ్ వాళ్లు కూడా హ్యాండ్ ఇచ్చారా అని అంటుంది. ఇక కౌషికి మీరేం టెన్షన్ పడొద్దు నేను, జగద్ధాత్రి వంట చేస్తాం.. మన ఇంట్లో ఫంక్షన్‌కి మనమే చేసుకుంటే అదో సంతోషం కదా అని అంటుంది. జగద్ధాత్రి, కౌషికి, కేథార్, వైజయంతి, రేఖ తలో పని చేస్తూ ఉంటారు. కేథార్ వంటలు చేస్తాడు. జగద్ధాత్రి తండ్రి డల్‌గా ఉండటం చూస్తుంది. విషయం ఏంటో అడుగు అని కేథార్ చెప్పడంతో జగద్ధాత్రి వెళ్తుంది. నాన్న నీకు ఏ కష్టం వచ్చినా ఈ కూతురు ఉందని మర్చిపోవద్దు ఏం ఉన్నా నాకు చెప్పు అని అంటుంది. ఏంలేదమ్మా పూజ త్వరగా అవుతుందో లేదో అని టెన్షన్‌గా ఉంది అంటారు.
నిషి పంతులుతో మాట్లాడుతుంది. నిషి దగ్గరకు తండ్రి వచ్చి నీతో చిన్న పని ఉందమ్మా అని నిషిని తీసుకెళ్తారు. సిరి, రేఖ దూరం నుంచి చూసి టెన్షన్ పడుతూ ఉంటారు. నిషితో తన తండ్రి ఓ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకున్నా ఆ డబ్బు మీకు రావాలి కదా అందుకే మీ సంతకం కావాలి అని అంటారు. ఓస్ ఇంతేనా అని నిషి సంతోషంగా సంతకం పెట్టేస్తుంది. జగద్ధాత్రితో కూడా సంతకం పెట్టించాలి అని అనుకుంటారు.
పూజ మొదలవుతుంది. యువరాజ్ గదిలోనే ఉండిపోతాడు. సిరి అత్తామామలు యువరాజ్ రాలేదు కదా అని అంటాడు. ఇక్కడికి రాడులే అని సుధాకర్ అంటాడు. ఇక జగద్ధాత్రి తండ్రి, చెల్లి, పిన్ని అందరూ టెన్షన్‌గా ఉండటం గమనిస్తుంది. వీళ్లలో వీళ్లే నలిగిపోతున్నారు. అంతగా ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటుంది. సిరి కూడా సమస్య నుంచి తనని కాపాడమని దేవుణ్ని వేడుకుంటుంది. ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లు ఒకరికి ఒకరు తోరణాలు కట్టుకుంటారు. నిషి గదిలోకి వెళ్లి భర్తకి తోరణం కడుతుంది. యువరాజ్ నిషితో ఇలా వేరేగా ఉండటానికి నన్ను ఎందుకు రమ్మనాలి అని అంటాడు. నువ్వు లేని చోటు నేను ఎలా ఉంటాను యువరాజ్ నక్లెస్ ఇచ్చేస్తా బిల్డప్‌గా వెళ్లిపోదాం అని అంటుంది. ఇక కట్టేసి నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని నిషి అంటే ఆ వచ్చేస్తావ్ మాకు తెలీదు మరి అని యువరాజ్ అంటాడు.
పూజ పూర్తయిపోయిన తర్వాత అందరూ మాట్లాడుకుంటారు. రేఖ మెడలో నెక్లెస్ చూసి వైజయంతి చూసి వదినా నెక్లెస్ చాలా బాగుంది ఏ షాప్‌లో కొన్నావ్ బాగుంది అని చూసి ఇది బంగారం కాదు రోల్డ్ గోల్డ్ అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. మొత్తం రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరుగుతున్నావేంటి అని అడుగుతుంది. సిరి అత్త ఏంటి ఇలా రోల్డ్ గోల్డ్ వేసుకొని ఇంత బిల్డప్‌గా తిరుగుతున్నావ్ అని అంటుంది. రోల్డ్ గోల్డ్ వేసుకోవాల్సిన ఖర్మా మాకేంటి.. అమ్మా ఇంట్లో దాదాపు వెయ్యి తులాల బంగారం ఉంటే నువ్వు రోల్డ్ గోల్డ్ ఎందుకు వేసుకున్నావ్ అని అడుతుంది.
సిరి, రేఖ, జగద్ధాత్రి తండ్రి అందరూ కంగారు పడారు. అందరూ బంగారం గురించి రెట్టించి అడుగుతారు. మళ్లీ జగద్ధాత్రి అందరినీ అనుమానంగా చూస్తుంది. జగద్ధాత్రి, కేథార్ ఏదో పెద్ద విషయమే జరిగింది అని అనుకుంటారు. జగద్ధాత్రి కవర్ చేయడానికి దొంగల భయం కదా అందుకే లాకర్‌లో పెట్టుంటారు అని అంటుంది. బ్యాంక్‌లో తీయడానికి వెళ్లా మేనేజర్ లేడు అని తీసుకురాలేదు అని అంటారు.
కౌషికి కూడా అందర్ని పరిశీలించి జగద్ధాత్రిని పిలిచి ఏదో జరిగింది చెప్పలేకపోతున్నారు.. మనమే తెలుసుకోవాలి అని అంటుంది. జగద్ధాత్రి కేథార్ దగ్గరకు వెళ్లి మనం అప్పుడే వెళ్లడం లేదు.. ఏంటో తెలుసుకొని వెళ్దాం అని అంటుంది. ఇక నిషి భర్త దగ్గరకు వచ్చి అందరి ముందు నెక్లెస్ ఇస్తా అది ఇచ్చాక మన ఇగో సెట్ అయితే వెళ్దాం అని అంటుంది. జగద్ధాత్రి సిరికి నెక్లెస్ ఇస్తుంది. ఇక నిషి కూడా సిరికి పెద్ద నగ గిఫ్ట్‌గా ఇస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. కౌషికి నిషిని పక్కకి పిలుస్తుంది. జగద్ధాత్రి కూడా వెళ్తుంది. అందరూ నిషి పెద్ద గిఫ్ట్ ఇచ్చిందని అనుకుంటారు.
కౌషికి నిషికతో అంత ఖరీదైన గిఫ్ట్ కొనే అంత డబ్బు నీకు ఎక్కడిది.. అప్పు చేశావా అని అంటుంది. నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు.. నా పుట్టింట్లో అడిగి తీసుకున్నా అంటుంది. నిజం చెప్పు నిషి మీ వాళ్లకే డబ్బు లేదు అన్నట్లు ఉంది అని కౌషికి అంటుంది. నా పుట్టింటిని ఒక్క మాట అన్నా బాగోదు అని నిషి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















