Jagadhatri Serial July 3rd: జగద్ధాత్రి సీరియల్: బారసాలలో చిట్టీల గొడవ.. పసికందుని తీసుకొని వెళ్లిపోయిన ఆదిలక్ష్మీ!
Jagadhatri Today Episodeనిషిక చిట్టీలు మార్చడం ఆ విషయం తెలిసి జగద్ధాత్రి తెలివిగా ప్లాన్ తిప్పి కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode తాయారు తనకు బందోబస్తుగా జేడీ కేడీలే కావాలని అంటుంది. వాళ్లకి వేరే కేసులు ఉన్నాయని సాధు సార్ చెప్తే దానికి తాయారు నేను ఒక్కసారే చెప్తా ఇంకోసారి చెప్పను అంటుంది. దాంతో సాధు ఒప్పుకుంటారు. తాయారు మీనన్‌కి కాల్ చేసి బసిరెడ్డిని అరెస్ట్ చేయించా.. జేడీ కేడీలు బందోబస్తుకి వస్తారని చెప్తుంది. జేడీ సంగతి చూసిన తర్వాత బసిరెడ్డి సంగతి చూడాలి 25ఏళ్ల క్రితం జరిగిన కావ్య కేసు గురించి మాట్లాడాడని చెప్తుంది.
జగద్ధాత్రి, కేథార్ ఇంటికి రాగానే కౌషికి ఎదురెళ్లి ఇంట్లో ఫంక్షన్ కదా ఎక్కడికి వెళ్లిపోయారు అని అడుగుతుంది. దాంతో ఇద్దరూ ఫ్రెండ్ ఎమర్జెన్సీ అంటే వెళ్లామని అంటారు. నిషిక అత్తతో వాళ్లకి వదిన అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే కోపం వస్తుందని అంటుంది. అత్త కోడలితో సైలెంట్‌గా ఉండి ఆదిలక్ష్మీ వస్తే దాన్ని రెచ్చగొడితే సరిపోతుందని అనుకుంటారు. సురేశ్, ఆదిలక్ష్మీ వచ్చేస్తారు. తల్లితో సురేశ్ కౌషికి ఏం బాధ పెట్టొద్దు అని అంటాడు. కౌషికి నన్ను జైలుకి పంపించినా నేను ఏం అనొద్దా అంటుంది. మన వల్ల కౌషికి చాలా ఇబ్బంది పడింది ఏం అనొద్దు అంటాడు. వాళ్లు మర్యాద ఇస్తే నేను ఏం అనను అంటుంది.
సురేశ్, అత్తని చూసి కౌషికి చాలా సంతోషపడుతుంది. సురేశ్ దగ్గరకు మూగ కూతురు వెళ్లి హగ్ చేసుకుంటుంది. కౌషికి ఆశీర్వాదం అడిగితే ఆదిలక్ష్మీ ఏం అనదు దాంతో సురేశ్ చెప్పడంతో ఆశీర్వదిస్తుంది. ఇక సురేశ్‌ని కేథార్ హగ్ చేసుకొని చాలా రోజులకు వచ్చావ్ బావ అంటాడు. ఆదిలక్ష్మీకి అందరూ మర్యాదలు చేస్తే ముందు నా మనవడిని చూసి తర్వాత మర్యాదలు తీసుకుంటా అంటుంది. కౌషికి కొడుకుని తీసుకురావడానికి వెళ్తే వెనకాలే సురేశ్ వెళ్లి కొడుకుని ఎత్తుకొని కౌషికి సారీ చెప్తాడు. కౌషికి కన్నీరు పెట్టుకుంటుంది. కౌషికి కొడుకుని తీసుకొచ్చి అత్తకి ఇస్తుంది. నిన్ను చూస్తాను అనుకోలేదురా కానీ ఇంత త్వరగా చూస్తాను అనుకోలేదు అంటుంది. నిషిక అత్తతో ఆదిలక్ష్మీ ఏదో చేస్తారు అన్నారు తనేంటి ఇంత మంచిగా ఉందని అని నిషిక అంటే దానికి అత్త ఆవిడ సంగతి నీకు తెలీదు ఉన్నంత వరకు బాగేనే ఉంటుంది. తర్వాతే మారిపోతుందని అంటుంది.
ఆదిలక్ష్మీ సురేశ్తో చూడరా అచ్చం మీ నాన్నలా ఉన్నాడు. ఏమయ్యా పరందామయ్య మళ్లీ నీ కుటుంబంతో ఉండాలి అని వచ్చావా అని అంటుంది. జగద్ధాత్రి, కౌషికిలతో పాటు అందరూ ఆదిలక్ష్మీ తన భర్త పేరు చెప్పగానే షాక్ అవుతారు. ఆదిలక్ష్మీ అందరితో ఏంటి అందరూ నన్నే చూస్తున్నారు అని అడుగుతుంది. దాంతో కౌషికి చెప్పబోతే జగద్ధాత్రి ఆపి వదిన బాబుకి వాళ్ల నాన్న పేరు పెట్టాలని అనుకున్నారని అంటుంది. ఆదిలక్ష్మీ షాక్ అవుతుంది. మేం కూడా సురేశ్‌కి రెండో బిడ్డ పుడితే మా ఆయన పేరు పెట్టాలని అనుకున్నాం అని అంటుంది ఆది లక్ష్మీ. అర్థం చేసుకోమని అందరూ అంటే వీడు నా మనవడు నాకు కూడా హక్కు ఉంది అని అంటుంది. దాంతో కౌషికి హక్కు ఉంది అనే రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఒప్పుకోండి అంటుంది. సురేశ్ కూడా ఒప్పుకోమని అంటాడు. అన్నీ తన ఇష్టప్రకారమే జరిగితే మనం ఎందుకు ఇక్కడ అని బాబుని ఇచ్చేసి వెళ్లిపోతుంటే జగద్ధాత్రి ఆపుతుంది.
జగద్ధాత్రి మాట్లాడుకుందామని అంటే హక్కు అన్న మీరు బాధ్యతగా ఉండాలి కదా అని యువరాజ్ అంటాడు. ఆదిలక్ష్మీ గొడవ పడుతుంటే జగద్ధాత్రి ఆపి వాళ్లతో రెండు పేర్లు చిట్టీలు వేద్దాం ఏం పేరు వస్తే అది పెడదాం అని అంటుంది. అందరూ ఒప్పుకుంటారు. నిషిక అత్త భర్తలను బయటకు తీసుకెళ్లి మనం కౌషికి వదిన నాన్న పేరు రెండు చిట్టీల్లో రాసి ఆదిలక్ష్మీ గొడవ పెట్టేలా చేద్దామని అంటుంది. గొడవ ఎందుకు అవుతుంది అని అత్త అడిగితే దానికి యువరాజ్ రెండు చిట్టీల్లో పెద్దనాన్న పేరే ఉందని ఆదిలక్ష్మీకి తెలిస్తే గొడవ అవుతుందని అనుకుంటారు. గొడవ పెట్టి విడాకులు తీసుకునేలా చేస్తే మనవడిని ఆ ఆదిలక్ష్మీ తీసుకుంటుందని అనుకుంటారు.
కేథార్, జగద్ధాత్రి కేథార్ పేర్లు రాస్తారు. ఆదిలక్ష్మీకి అక్క మీద కోపం రాలేదని అనుకుంటారు. బూచి వచ్చి ప్లేట్ తెమ్మన్నారు అని అడిగితే కేథార్, జగద్ధాత్రి చిట్టీలు బూచికి ఇచ్చి వెళ్లిపోతారు. బూచిని మాయ చేసి నిషిక, యువరాజ్‌లు చిట్టీలు మార్చేస్తారు. బూచి చిట్టీలను తీసుకొచ్చి అందరి దగ్గర పెడతాడు. జగద్ధాత్రి వాటిని దేవుడి దగ్గర పెడతాను అని చెప్పి తీసుకెళ్లి తెస్తుంది. చిట్టీని కౌషికి పిన్ని తీస్తుంది. ఆదిలక్ష్మీ చిట్టీలో తన భర్త పేరు రావాలి కౌషికి మీద గెలవాలి అనుకుంటుంది. చిట్టీలో మధుకర్ అని కౌషికి తండ్రి పేరు వస్తుంది. దాంతో అందరూ ఆ పేరే పెట్టాలని అనుకుంటారు. ఆదిలక్ష్మీ సరే అంటుంది.
కౌషికి అత్త చిరాకు చూసి నా కొడుకు ఫంక్షన్ చక్కగా చేయాలి అనుకున్నా మీరు మనస్ఫూర్తిగా చేయాలి అని అంటుంది. దాంతో ఆదిలక్ష్మీ నా భర్త పేరు లేదని కొంచెం బాధ పడ్డానని అంటుంది. ఇక నిషిక రెండో చిటీలో ఏం ఉందో చూడండి లేదంటే తర్వాత రెండు చిట్టీల్లో మీరు ఒకే పేరు రాసుకున్నారని నింద వేస్తారు అంటుంది. దాంతో జగద్ధాత్రి రెండో చిట్టీ తీసి చూస్తుంది. అందులో రెండో పేరు కూడా మధుకర్ అని ఉంటుంది. జగద్ధాత్రి షాక్ అయిపోతుంది. ఏమైందని అందరూ అడుగుతారు. నిషిక చూసి రెండో చిట్టీలో కూడా మధుకర్ పేరు ఉంటుందని అంటుంది. ఆదిలక్ష్మీ జగద్ధాత్రి, కేథార్‌లను తిడుతుంది. మీ అక్క నన్ను మోసం చేయమని అంటే ఇలా చేశావ్ అంతేనా అంటుంది. కౌషికిని మోసం చేశావని నానా మాటలు అంటుంది. సురేశ్ నచ్చచెప్పాలని ప్రయత్నిస్తే ఆదిలక్ష్మీ ఒప్పుకోదు. నా మనవడి బారసాల ఈ ఇంట్లో జరగడానికి వీల్లేదు. అసలు నా మనవడు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని బాబుని తీసుకొని వెళ్లిపోతుంది.
కౌషికి కింద పడి ఏడుస్తుంది. తీరా చూస్తే ఇదంతా నిషిక కల. జగద్ధాత్రి రెండో చిట్టీ యువరాజ్‌కి తీయమని అంటుంది. అందులో పరందామయ్య అని అంటుంది. అత్తా కోడలు షాక్ అయిపోతారు. ఫ్లాష్ బ్యాక్‌లో నిషిక ప్లాన్ జగద్ధాత్రి వినేస్తుంది. వాళ్లు చిట్టీలు మార్చడం చూసేస్తుంది. దేవుడి దగ్గరకు తీసుకెళ్లినప్పుడు జగద్ధాత్రి చిట్టీలు మార్చేస్తుంది. ఇక బారసాల మొదలపెడదామని కౌషికి అంటుంది. జగద్ధాత్రి నిషిక దగ్గరకు వెళ్లి స్లిప్‌లు మార్చడం నీకు వచ్చు అనుకున్నావా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్ ప్రోమో: విరూపాక్షి గ్యాంగ్ గెలిచిందోచ్.. ఈ సారి తల్లిదండ్రుల చేతుల మీదగా 'రూపాకల్యాణం'





















