అన్వేషించండి

Jagadhatri Serial Today Feb 20th: జగధాత్రి అనుమానమే నిజమైందా...? చనిపోయాడనుకున్న మీనన్ బ్రతికే ఉన్నాడా...?

Jagadhatri Serial Today Episode February 20th: జగధాత్రి అనుమానమే నిజమైందా...? చనిపోయాడనుకున్న మీనన్ బ్రతికే ఉన్నాడా...?

Jagadhatri Serial Today Episode :మీనన్‌ కాల్పుల్లో గాయపడిన జేడీకి ఆస్పత్రిలో చికిత్స జరుగుతుంది.ఆమె చేతిలో నుంచి బుల్లెట్ బయటకు తీసి కట్టుగడతారు.అప్పుడే అక్కడికి వచ్చిన సాధు....జేడీకి ధైర్యం చెబుతాడు.ఇంతలో డాక్టర్ వచ్చి ఆపరేషన్ పూర్తయ్యిందని చెప్పడంతో సాధూతోపాటు జేడీకూడా లోపలికి వెళ్లి జగధాత్రిని పలకరిస్తారు.ఇప్పుడు ఎలా ఉందని అడిగితే బాగానే ఉందని చెబుతుంది. మీనన్‌ చనిపోయాడని...ఇక మనకు ఎలాంటి భయం అవసరం లేదని చెబుతాడు సాధుసార్‌...మీనన్ చనిపోయాడంటే ఇంకా నమ్మబుద్ధి కావడం లేదని జేడీ అంటుంది. మా కళ్లతో మేం చూశామని...ఇప్పుడు అంత్యక్రియలు కూడా చేస్తున్నారని చెబుతాడు. 25 ఏళ్ల క్రితం వాడిని మీ అమ్మ రోడ్డుపై ఉరికించి కొట్టిందని...ఆమె చనిపోయిన తర్వాత వాడిని టచ్‌చేసే పోలీసు లేకుండా పోయాడని...మళ్లీ ఇన్నాళ్లు ఆమె కూతురిగా నువ్వు వాడిని మట్టుబెట్టావని సాధుసార్‌ అంటాడు. మీ అమ్మ ఏ లోకంలో ఉన్నా  ఇది చూసి చాలా సంతోషిస్తుందని అంటాడు. దురదృష్టవశాత్తు మన డిపార్ట్‌మెంట్‌లో కూడా ఇద్దరు చనిపోయారని చెబుతాడు.ఇప్పుడు నేను అక్కడేకి అంత్యక్రియలు కోసం వెళ్తున్నానని అంటాడు. నేను కూడా  వస్తానని జేడీఅంటే...రెస్ట్‌ తీసుకోమని చెబుతాడు. లేదు నేను వస్తానని ఆమె అంటుంది. సరే నువ్వు రెడీ అవ్వు ప్రెస్‌మీట్‌కి రావాలని చెప్పి బయటకు వెళ్లిపోతాడు. 
                   జేడీ,కేడీఇద్దరే ఆరూమ్‌లో ఉండి మాట్లాడుకుంటుండగా....కౌషికి, సురేష్‌ జేడీని చూడటానికి ఆస్పత్రికి వస్తారు. వాళ్లు రావడం కొద్దిదూరంలోనే చూసిన జేడీ...వదిన వస్తోందని చెప్పడంతో కేధార్ వెంటనే రెండు మాస్కులు తీసుకొచ్చి జేడీకి  ఒకటి ఇచ్చి తాను  ఒకటి పెట్టుకుంటాడు.  ఇంతలో లోపలికి వచ్చిన కౌషికి జేడీకి కృతజ్ఞతలు చెబుతుంది. తాను ఆపదలోఉన్న ప్రతిసారీ నువ్వు దేవతలా ఉంచి ఆదుకుంటున్నావని అంటుంది. నీకు ఏం కావాలో చెప్పు అని అంటుంది. నాకు  ఏం వద్దని జేడీ బదులిస్తుంది. నువ్వు అలాంటిదానివి కాదని తెలిసినా...నా సంతృప్తి కోసమైనా ఏదో ఒకటి కోరుకోమని చెబుతుంది. నిజంగా నాకు అవసరం వచ్చినప్పుడు నేనే అడుగుతానని జేడీ చెప్పడంతో...కౌషికి ఆమె చేతిలో చేయి వేసి హామీ ఇస్తుంది. నువ్వు ఎలాంటి పరిస్థితులో ఏదీ అడిగినా ఇవ్వడానికి నేను రెడీ అని హామీ ఇస్తుంది. పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పి  కౌషికి, సురేష్ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
                             మీనన్ చనిపోయాడని ఇక అతని ఫైల్‌ క్లోజ్ అయిపోయినట్లేనని జేడీ ప్రెస్‌మీట్‌లో చెప్పి....చనిపోయిన పోలీసుల అంత్యక్రియలు చూడటానికి వెళ్తుంది.అక్కడ ఇద్దరి పోలీసులతోపాటు మీనన్ అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేస్తారు. పోలీసులిద్దిరికీ నివాళులు అర్పించిన అనంతరం మీనన్‌ మృతదేహం వద్దకు వెళ్లి జేడీ పరిశీలిస్తుంది. కేదార్‌కు అనుమానం వచ్చి ఏమైందని అంటాడు. మీనన్ చనిపోయాడంటే  ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదని  అంటుంది. నీ చేతులతో నువ్వు కదా కాల్చి చంపావని జేడీ  అన్నా కూడా....25 ఏళ్లుగా ఎన్నో తిప్పలు పెట్టిన మీనన్‌ ఇలా  ఒక్క బుల్లెట్‌కే పోతాడంటే మాత్రం అస్సలు ఊహించలేకపోతున్నానని అంటుంది.నాకే ఈ నిజం జీర్ణించుకోవడానికి సమయం పడుతుందనుకుంటా అని అక్కడి నుంచి వెళ్లిపోతారు. అటు యువరాజు మాత్రం మీనన్ చనిపోయాడంటే  అస్సలు నమ్మడు.  దీని వెనక ఏదో కుట్ర ఉందని అనుకుంటాడు. మీనన్ ఇంత ఈజీగా చనిపోయేరకం కాదని అనుకుంటాడు. అతను అనుకున్నట్లు మీనన్ చనిపోడు. మూడు శవాలు కాలుతుంటే వాటి మధ్యలో నుంచి మీనన్ నవ్వుకుంటూ వస్తాడు.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తండ్రి కారు వెనుక పరుగులు పెట్టిన క్రిష్! లక్ష్మీ ఆచూకీ దొరుకుతుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తండ్రి కారు వెనుక పరుగులు పెట్టిన క్రిష్! లక్ష్మీ ఆచూకీ దొరుకుతుందా!
Godavari Serial Today July 16th: 'గోదావరి' సీరియల్: మురళీ కాలు కాల్చేసిన నందు! సొంత తల్లి, వదినల మీద విరుచుకుపడ్డ శాంతి!
'గోదావరి' సీరియల్: మురళీ కాలు కాల్చేసిన నందు! సొంత తల్లి, వదినల మీద విరుచుకుపడ్డ శాంతి!
Prabhakar Podakandla: దూరదర్శన్‌తో కెరీర్ స్టార్ట్.. బుల్లితెర మెగాస్టార్ స్థాయికి.. యాక్టర్, ప్రొడ్యూసర్ ప్రభాకర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
దూరదర్శన్‌తో కెరీర్ స్టార్ట్.. బుల్లితెర మెగాస్టార్ స్థాయికి.. యాక్టర్, ప్రొడ్యూసర్ ప్రభాకర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today July 16th: నిండు మనసులు: గుడిలో ఇందిర కుట్ర! ఢీ అంటే ఢీ అనుకున్న రెండు ఫ్యామిలీలు!
నిండు మనసులు: గుడిలో ఇందిర కుట్ర! ఢీ అంటే ఢీ అనుకున్న రెండు ఫ్యామిలీలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget