Jagadhatri Serial Today September 2nd: ‘జగధాత్రి’ సీరియల్: ఇంట్లో వాళ్లతో చెడుగుడు ఆడుకున్న బూచి – బూచి డ్రగ్స్ తీసుకున్నాడని తెలుసుకున్న ధాత్రి
Jagadhatri Today Episode: డ్రగ్స్ తీసుకున్న బూచి ఇంట్లోకి వచ్చి అందరినీ కొట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఫన్నీగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: టోని వెళ్లిపోతుంటే ధాత్రి, మీ చిన్నప్పటి ఫోటోలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గానే యువరాజ్ అలాంటివేం లేవని చెప్పి టోనిని పంపిచేస్తాడు. హమ్మయ్యా ఏ ప్రాబ్లమ్ లేకుండా టోనీని పంపిచేశాను అనుకుంటాడు. మరోవైపు బూచి మత్తుతో ఇంట్లోకి వస్తాడు. యువరాజ్‌ను పిచ్చకొట్టుడు కొడతాడు. వైజయంతిని తిడతాడు. ఇంతలో సుధాకర్ వచ్చి అల్లుడు మంచి మర్యాద లేకుండా ఏంటిది అనగానే ఈ ఇంట్లో మాట్లాడే అర్హత లేనోడివి నువ్వొక్కడివే అంటాడు. నీకు అన్ని తెలిసినా తెలియనట్లు నటిస్తున్నావు అంటాడు. కమలాకర్ అడ్డొస్తే కమలాకర్ ను కూడా కొడతాడు. అడ్డొచ్చిన వాళ్లందరి మీదకు కళ్లు తాగిన కోతిలాగా ఎగురుతుంటాడు. ఇంతలో కౌషికి వచ్చి తిట్టగానే కౌషికిని తిడతాడు. ధాత్రి అన్నయ్యా అని పిలవగానే ఎవడ్రా ఇక్కడ బూతులు మాట్లాడుతుంది అని ధాత్రి దగ్గరకు వెళ్తాడు.
ధాత్రి: అన్నయ్యా నువ్వు ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా లేవు కదా? ఉన్నట్టుంది ఏమైంది నీకు. ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు.
బూచి: చూడు సిస్టరూ.. నీకు ఏ ముహూర్తంలో జగధాత్రి అని పేరు పెట్టారో తెలియదు కానీ నువ్వు ఆ జగధాత్రి కన్నా పవర్ ఫుల్ అమ్మా..
కేదార్: బావ ఏమైంది నీకు నిన్ను ఎప్పుడూ ఇలా చూడలేదు. మందు కొట్టి వచ్చావా?
బూచి: కేదార్ బామ్మర్ది.. నీ ఐడెంటిలాగే నీకు డైలాగ్ కూడా లేదు బామ్మర్ది. మన డైలాగ్ రైటర్ కి నేను చెప్తానులే అయినా నిన్ను చూస్తుంటే జాలేస్తుంది బామ్మర్ది. తండ్రి ఎవరో తెలిసినా చెప్పుకోలేని పిరికోడివి..
కేదార్: బావా నీకు మందు ఎక్కువైంది.
బూచి: నాకు మందు ఎక్కువ అవడం ఏంట్రా.. ఎవరో మిస్ అయ్యారే… ఆ ఈ ఇంటి కోడలు.. రామ్మా మహాలక్ష్మీ..నువ్వు వస్తావా.. నన్నే రమ్మంటావా?
నిషిక: ఆ.. నేనే వస్తాను..
బూచి: అమ్మా మహాతల్లి నువ్వొచ్చాకే కదే నాకు దరిద్రం పట్టుకుంది. ఏంటే నీ ప్లాను. బహిరంగం బహిర్ముఖమా? నీ ప్లాన్ వల్ల నా ఫోటోకు దండ పడేలా ఉంది.
అని కాచి ఎక్కడుంది అని అడగ్గానే బాత్రూంలో ఉందని వైజయంతి చెప్పగానే ధాత్రి పక్కనే ఉన్న సాధు కూతురిని చూసి కాచి అనుకుని మీదకు వెళ్తుంటాడు. ఇంతలో కాచి వచ్చి బూచిని లోపలికి తీసుకెళ్తుంది. తర్వాత డాక్టర్ వచ్చి బూచిని టెస్ట్ చేసి ఇంజక్షన్ ఇస్తాడు. బూచికి డ్రగ్స్ వాడే అలవాటు ఏమైనా ఉందా? అని ఆయన డ్రగ్స్ తీసుకున్నాడని డాక్టర్ చెప్తాడు. యువరాజ్ టెన్షన్ పడుతుంటాడు. ఇదంతా టోనీ వల్లే జరిగిందని మనసులో తిట్టుకుంటూ ఇప్పుడు అవసరమా? ఈ విషయం బయటకు వెళితే మన ఇంటి పరువు పోతుంది అంటాడు. ఇంతలో కాచి కూడా ఆయనకు అలాంటి అలవాట్లు లేవని చెప్తుంది. దీంతో కౌషికి కూడా కాచిని సపోర్టు చేస్తుంది. తర్వాత ధాత్రి, కేదార్ బయటకు వెళ్లి డాక్టర్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తారు.
ధాత్రి: బూచి అన్నయ్య బయటకు వెళ్లేటప్పుడు ఎంతో నార్మల్ గా ఉన్నాడు. కానీ లోపలికి వచ్చేటప్పుడు మాత్రం చాలా తేడాగా వచ్చాడు. సో ఏదైనా జరిగి ఉంటే ఇక్కడే జరిగి ఉండాలి.
కేదార్: అవును ధాత్రి. అది కూడా కేవలం 15 నిమిషాల్లోనే జరిగి ఉండాలి.
ధాత్రి: అవును ఒక్కసారి మనం ఈ చుట్టు పక్కల వెతుకుదాం. నేను ఇటు వైపు చూస్తాను. నువ్వు అటువైపు చూడు
అని ఇద్దరూ కలిసి వెతుకుతుంటారు. ఇంతలో ధాత్రికి యువరాజ్ పై నుంచి విసిరిన డ్రగ్స్ పేపర్ కనిపిస్తుంది. అది తీసుకుని చూస్తారు. ఇది డ్రగ్స్ లాగే ఉన్నాయని అనుకుంటారు. యువరాజ్ ఇంతకు తెగిస్తాడని అనుకోలేదని వెంటనే టీమ్ ను అలర్ట్ చేస్తామని కేదార్ చెప్తాడు. తర్వాత బూచి ని ధాత్రి మధ్యాహ్నం ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోమని అడుగుతుంది. ఇంతలో యువరాజ్ జిమ్ బిజినెస్ చేద్దామనుకుంటున్నానని 20 కోట్లు పెట్టుబడి అవసరం అని అడగ్గానే ధాత్రి, కేదార్ జిమ్ బిజినెస్ కు 20 కోట్ల పెట్టుబడి అవసరమా? అని అడగ్గానే ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.