అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today September 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పంచె చూసి షాక్ అయిన రామ్మూర్తి – నేనే రామ్మూర్తి కూతురిని అన్న అరుంధతి

Nindu Noorella Saavasam Today Episode: రామ్మూర్తి కూతురిని నేనే ఎందుకు కాకూడదని ఆరు, గుప్తను అడగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌, రాథోడ్‌ కారులో వెళ్తుంటారు. మిస్సమ్మ గురించి రాథోడ్‌ బాధపడతాడు. అరుంధతి ఆశ్శీసులతోనే మీ ఇద్దరి పెళ్లి జరిగిందేమో అనిపిస్తుంది అంటాడు రాథోడ్‌. అసలు మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. కానీ మీకు అనుకోకుండా పెళ్లి అయిపోయింది. అంటేనే అర్థం చేసుకోవాలి సార్‌ అంటూ రాథోడ్‌ ఎమోషనల్‌ అవుతాడు. మరోవైపు రామ్మూర్తి , మంగళ వస్తారు. మిస్సమ్మ టీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇంతలో మంగళ కంగారుగా టీ తీసుకోబోయి రామ్మూర్తి మీద పోస్తుంది. దీంతో రామ్మూర్తి పంచె పాడవుతుంది. మిస్సమ్మ లోపలికి వెళ్లి ఇంకో పంచె తీసుకొస్తానని కప్‌ బోర్డు ఓపెన్‌ చేస్తుంది. కప్‌బోర్డులో నుంచి అమర్‌ దాచిన ఆరు చిన్నపటి పంచె మిస్సమ్మ చేతుల్లో పడుతుంది.

మిస్సమ్మ: పట్టు పంచె..  ఈయన ఎప్పుడూ ఇలాంటివి కట్టలేదే..

 అనుకుని పంచె కోసం వెతుకుతుంది మిస్సమ్మ.  

నిర్మల: మిస్సమ్మ ఏంటండి ఇంకా రాలేదు..

శివరాం: పంచె కనిపించలేదేమో.. బావగారు ఉండండి నా పంచె తీసుకుని వస్తాను.

రామ్మూర్తి: అయ్యోయ్యో పర్వాలేదు బాబుగారు.

శివరాం: ఏంటి బావగారు మీ కూతురినే మా ఇంటికి పంపారు. మీకు పంచె ఇవ్వలేనా?

 అంటూ లోపలికి వెళ్లగానే మిస్సమ్మ పంచె తీసుకుని వస్తుంది. దూరం నుంచే ఆ పంచె చూసిన మనోహరి షాక్‌ అవుతుంది. ఇప్పుడు ఈ ముసలోడు చూస్తే ఎలా అని భయపడుతుంది. ఇంతలో శివరాం. పంచె తీసుకుని వస్తాడు. మిస్సమ్మ కూడా పంచె తీసుకుని వచ్చి ఇవ్వబోతుంది. ఆ పంచెను చూసిన రామ్మూర్తి ఆరును గుర్తు చేసుకుని షాక్‌ అవుతాడు. పిచ్చి పట్టినవాడిలా నా బిడ్డ అంటూ తిరుగుతాడు.

మిస్సమ్మ: నాన్నా ఏమైంది నాన్నా… ఎందుకిలా అయిపోయారు.

రామ్మూర్తి: అమ్మా ఈ పంచె నీకు ఎక్కడి అమ్మా..

మిస్సమ్మ: ఆయన కప్‌ బోర్డులో ఉంది నాన్నా.. నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఆయనదేమో అని తీసుకొచ్చాను.

రామ్మూర్తి: బాబు గారు ఎప్పుడొస్తారమ్మా..

మిస్సమ్మ: లేటు అవుతుందని చెప్పారు నాన్నా.. ఏమైంది..?

రామ్మూర్తి: ఏం లేదు అమ్మా… ఏం లేదు..

మిస్సమ్మ: సరే నాన్నా మీరు ఈ పంచె రూముకు వెళ్లి మార్చుకుని రండి

 అని చెప్పి పట్టు పంచె తీసుకుని పైకి వెళ్లిపోతుంది. మనోహరి షాకింగ్‌‌ గా చూస్తుండి పోతుంది. తర్వాత బయట రామ్మూర్తి అటూ ఇటూ తిరుగుతుంటూ.. అమర్‌ కోసం ఎదురుచూస్తుంటాడు.

ఆరు: గుప్త గారు ఆయన ఇందాకటి నుంచి ఎందు అటూ ఇటూ తిరుగుతున్నారు.

గుప్త: బాలికా ఆయన అటు నుంచి ఇటే కాదు ఇటు నుంచి అటు కూడా తిరుగుతున్నాడు.

ఆరు: గుప్త గారు హస్యమా…?

గుప్త: నువ్వు పెట్టే చిత్రహింసలకు మాకు హాస్యము ఒక్కటే తక్కువయ్యింది.

ఆరు: అది కాదు గుప్త గారు ఆయనకు వచ్చిన కష్టం ఏంటో తెలుసుకుని వెంటనే తీర్చేయాలని ఉంది.

గుప్త: ముందు నీకున్న కష్టాల గురించి ఆటోచించు.

ఆరు: సమాధానం లేని ప్రశ్నల వెంట పడి ఏం ఉపయోగం లేండి గుప్త గారు. ఆయనకు నిజం తెలిసి కూడా చెప్పడం లేదంటే ఇంకెవరు నా జన్మరహస్యం చెప్తారు.   

 అనగానే ఆరు రామ్మూర్తినే చూస్తుంది. ఇంతకుముందు రామ్మూర్తి బాధపడిన విషయం గుర్తు చేసుకుంటుంది ఆరు. నేనే ఆ రామ్మూర్తి కూతురు ఎందుకు కాకూడదు. భాగుమతి నా సొంత చెల్లెలు ఎందుకు కాకూడదు. నా స్థానంలోకి నా రక్తమే వచ్చి నా ప్రయాణాన్ని నా చెల్లెలే కంటిన్యూ చేస్తుంది. అబ్బా చెప్పడానికి ఎంత సంతోషంగా ఉంది అని ఆరు చెప్పగానే గుప్త షాక్‌ అవుతాడు. వెంటనే ఆరు మాటలను వెటకారంగా మార్చేస్తాడు. ఇంతలో బయట రామ్మూర్తి, అమర్‌ కోసం తిరగడం పై నుంచి మనోహరి, మంగళ చూస్తుంటారు. ముసలోడికి నిజం తెలిసిపోయిందా? అని ఆలోచిస్తుంటారు. ఇంతలో మిస్సమ్మ వస్తుంది. ఇంతదూరం వచ్చిన వారు లోపలికి రాకుండా పోతారా? మీరు లోపలికి రండి అని పిలుస్తుంది. అల్లుడు గారు వచ్చాకా నేను వస్తాను నువ్వు వెళ్లి తల్లి అని రామ్మూర్తి చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కళ్యాణ్ ఆటో బోనీ చేసిన కావ్య – శ్రుతికి లైన్ వేస్తున్న రాహుల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Pawan Kalyan: ఐఏఎస్, ఐపీఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు - డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, షర్మిలకు భద్రతపైనా కీలక వ్యాఖ్యలు
ఐఏఎస్, ఐపీఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు - డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, షర్మిలకు భద్రతపైనా కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బన్నీకి బాలయ్య సర్‌ప్రైజ్, అస్సలు ఊహించలేదట!అమ్మో! ఇళ్ల పక్కనే పెద్దపులి! గజగజ వణికిపోతున్న జనంనడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Pawan Kalyan: ఐఏఎస్, ఐపీఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు - డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, షర్మిలకు భద్రతపైనా కీలక వ్యాఖ్యలు
ఐఏఎస్, ఐపీఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు - డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, షర్మిలకు భద్రతపైనా కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
NBK Allu Arjun: ‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
Crime News: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు - ఇద్దరి ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు - ఇద్దరి ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
Kiara Advani: 'గేమ్ చేంజర్' టీజర్ లాంచ్‌లో కియారా - అరెరే ఏముందిరా!?
'గేమ్ చేంజర్' టీజర్ లాంచ్‌లో కియారా - అరెరే ఏముందిరా!?
Tiger Tension: మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం - ఈ గ్రామాలకు అటవీ అధికారుల అలర్ట్
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం - ఈ గ్రామాలకు అటవీ అధికారుల అలర్ట్
Embed widget