అన్వేషించండి

Brahmamudi Serial Today August 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కళ్యాణ్ ఆటో బోనీ చేసిన కావ్య – శ్రుతికి లైన్ వేస్తున్న రాహుల్

Brahmamudi Today Episode: కొత్తగా ఆటో తీసుకున్న కళ్యాణ్ మొదటి బోణీ మంచి చేత్తో జరగాలని కోరుకోగా కావ్య వచ్చి బోణీ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  ఎంత చెప్పినా కావ్య వినకపోవడంతో రాజ్‌ కోపంగా కావ్యను పక్కకు తీసుకెళ్లి కుటుంబాన్ని ముక్కలు చేద్దామనుకుంటున్నావా? అని తిడతాడు. నీవల్ల నా కుంటుంబ సభ్యులను దూరం చేసుకోలేను అంటాడు. దీంతో కావ్య కోపంగా నన్ను వేరుగా కుటుంబాన్ని వేరుగా చూడొద్దని నేను కుటుంబంలో మెంబర్‌ నే అని అంటుంది కావ్య. ఇంట్లో మనిషివే అనుకున్నప్పుడు కొన్ని చూసి చూడనట్లు వదిలేయాలి అని రాజ్‌ చెప్పగానే

కావ్య:  వాళ్లు ఎలాంటి వాళ్లో మీకు అర్థం కావట్లేదు.  

రాజ్‌: నువ్వు రాకముందు కూడా వాళ్లు ఉన్నారు. ఏం జరిగింది.

కావ్య: ఏం జరిగిందో మర్చిపోయారా. మీరు చేసుకోవాల్సిన స్వప్న అక్కను రాహుల్ లేపుకెళ్లిపోయాడు. అసలు మీ ముఖాన్నే జీవితంలో చూడొద్దనుకున్నా నాకు ముసుగు వేసి మీతో పెళ్లి జరిపించారు. వీళ్ల కుట్రల వల్ల కవిగారి కాపురం ముక్కలైపోయింది.

రాజ్: అదంతా గతం ఇప్పుడు పరిస్థితి వేరు. ఇంట్లో ఏం జరిగినా తాతయ్య ఆరోగ్యానికి ప్రమాదం. అన్నింటిని సరిద్దిదుకునే మా అమ్మ ఈ చీలికను భరించలేదు.

కావ్య: మీకు రాహుల్ క్యారెక్టర్, మీ అత్త క్యారెక్టర్ ఏంటో తెలియదా..?  

రాజ్‌: ఓకే అదంతా వదిలిసేయ్. ఇంకోసారి ఇది రిపీట్ కావొద్దు.

కావ్య: అది వాళ్లకు చెప్పండి. నాకు కాదు.

రాజ్: వాళ్ల సంగతి వదిలేయ్. నేను నీకు చెబుతాను. ఇంట్లోవాళ్లు ఒకటిగా కలిసి ఉండాలని తాతయ్య ఆశయం. ఇప్పటికే కల్యాణ్ వెళ్లిపోయాడు. ఇక ఎవరైనా వెళ్లిపోతే తాతయ్య తట్టుకోలేరు.

  అంటూ రాజ్‌ కోపంగా వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. తర్వాత కావ్య రూంలోకి వెళ్లి ఆలోచిస్తుంది. ఇంతలో స్వప్న వచ్చి సారీ చెప్తుంది. నా వల్లే నీకు అవమానం జరిగిందని నేనే తొందరపడ్డానని అంటుంది. నువ్వేం కాదక్కా రాహుల్‌, రుద్రాని ఇద్దరు కలిసే ప్లాన్‌ ప్రకారం నన్ను ఇరికించారు అంటుంది కావ్య. అది సరే కానీ నువ్వు  హాస్పిటల్‌కు చెకప్‌కు వెళ్లాలి కదా వెళ్దాం పద అని ఇద్దరు వెళ్లిపోతారు. తర్వాత శ్రుతికి కావ్య ఫోన్‌ చేసి రాహుల్‌ ను కనిపెడుతూ ఉండమని చెప్తుంది. శ్రుతి సరే అంటుంది. మరోవైపు రాహుల్‌ ఎవరితోనో ఫోన్‌ లో  దొంగ బంగారం గురించి మాట్లాడుతుంటాడు. శ్రుతి వింటుంది. శ్రుతి తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోమ్మంటాడు రాహుల్‌. శ్రుతి వెళ్లిపోతుంది. మరోవైపు హాస్పిటల్‌‌ కు వెళ్లిన స్వప్న, కావ్య కారులో వస్తుంటారు.

కావ్య: అక్కా నీకు బీపీ ఎక్కువగా ఉందని.. పుట్టబోయే బిడ్డ ప్రసవానికి కూడా కష్టంగా అవుతుందని డాక్టర్ చెప్పేసరికి నాకు బాధగా ఉంది. నువ్వు నీ అత్త, భర్తపై కోపంతో ఉండకు.

స్వప్న: ఏం చేయమంటావే వాళ్లు చేసే పనులకు ఈ మాత్రం నోరు తెరవకపోతే అనామికలాగా అనామకులుగా మిగిలిపోతాం. నేను అత్తకు మొగుడు మొగుడికి యముడు టైపు.

  అని ఇద్దరు మాట్లాడుకుంటుండగానే కారు ఆగిపోతుంది. డ్రైవర్ దిగి కారు చెక్ చేసి.. మెకానిక్‌ను పిలవాలని.. మీరు క్యాబ్‌ లో వెళ్లండని చెప్తాడు. దీంతో ఇద్దరు కలిసి ఆటోలో వెళ్దామని అనుకుంటారు. అక్కడే కొద్దిదూరంలో కళ్యాణ్‌ ఆటో పార్క్‌ చేసుకుని మొదటి బేరం మంచి చేతితో అయ్యేలా చూడు స్వామి అంటూ దేవుణ్ని ప్రార్థిస్తాడు. అయితే స్వప్న, కావ్య కూడా కళ్యాణ్‌ ఆటో వైపే వస్తుంటారు. ఆటో వెనకాల రేపటి కోసం అని రాసి ఉండటాన్ని చూసి

కావ్య:  ఇవాళ సంపాదించేది రేపటికోసమే

స్వప్న: వీడెవడో మన కవిలాగే ఉన్నాడే పదా

అయితే ఆటో అద్దంలో కావ్య, స్వప్న రావడం చూసి కళ్యాణ్‌ కంగారుపడతాడు. ముఖం కనిపించకుండా కర్చీప్‌ కట్టుకుని క్యాప్‌ పెట్టుకుంటాడు. కావ్య, స్వప్నలు దగ్గరకు వచ్చి ఆటో మాట్లాడుకుని వెళ్తారు. ఆటోలో కావ్య, స్వప్నలు కళ్యాణ్‌ను గుర్తు చేసుకుంటుంటే కళ్యాణ్‌ ఎమోషనల్‌ అవుతాడు. నా మొదటి సంపాదన నీ చేతుల మీదుగా రావాలని ఆ దేవుడే నిర్ణయించాడు వదిన. అని మనసులో అనుకుంటాడు కళ్యాణ్‌. ఆటో ఆపిన తర్వాత కావ్య డబ్బులిస్తుంటే కళ్యాణ్‌ కర్చీప్‌ కిందపడేలా చేసి కావ్య కాళ్లకు మొక్కుతాడు. కావ్య మాత్రం మేము ఇక్కడికే రావాలని నీకెలా తెలుసు అని అడుగుతుంది. దీంతో కళ్యాణ్‌ కర్చీప్‌ తీయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
Adilabad News: అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
Cryptocurrency: 2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
Youtuber Beast: వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!
వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!
Vijay Deverakonda Rashmika: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బయల్దేరిన రష్మిక, విజయ్... పెళ్ళికి ముందు ఇదే లాస్ట్ ట్రిప్పా?
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బయల్దేరిన రష్మిక, విజయ్... పెళ్ళికి ముందు ఇదే లాస్ట్ ట్రిప్పా?
Embed widget