అన్వేషించండి

Jagadhatri Serial Today  September 19th: ‘జగధాత్రి’ సీరియల్‌: కౌషికి వాళ్ల నాన్న గురించి ఆరా తీసిన ధాత్రి – సుధ ముందు కౌషికిని అవమానించిన నిషిక

Jagadhatri Today Episode: ధాత్రి వాళ్ల అమ్మ కావ్య మరణానికి కౌషికి వాళ్ల నాన్నకు ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలో ధాత్రి, కేదార్‌ ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode:  మా అమ్మ చావుకు పెద్దమామయ్య కు ఏదైనా లింక్‌ ఉంటుందా? అని అనుమానిస్తుంది ధాత్రి. కేదార్‌ అలా జరిగి ఉండదు అంటాడు. అసలు కారణం తెలుసుకోవాలి. అని ఇద్దరూ డిసైడ్‌ అవుతారు. తమ ఇన్వెస్టిగేషన్‌ పెద్దనాన్న దగ్గర నుంచే మొదలు పెడదాం అనుకుని ఇప్పుడు వెళ్దాం పద అని వెళ్లిపోతారు. మరోవైపు వంటలు చేసిన నిషిక, కాచి ముక్కుతూ మూలుగుతూ వస్తారు. కౌషికిని బతిమాలుతారు. దీంతో కౌషికి, షర్మిల గారిని నా కోసం వదిలేయండి అని చెప్పగానే ఇంకోసారి ఎక్కడైనా తప్పు చేస్తే నేనే మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పి జగధాత్రి వాళ్ల పని అయ్యాక నేనే పంపిస్తాను అంటూ లోపలికి వెళ్లిపోతుంది. మరోవైపు వైజయంతి నిషిక వాళ్ల కోసం ఎదురు చూస్తుంది. సుధాకర్‌ చిన్నగా వస్తాడు.

సుధాకర్‌: మళ్లీ ఏం చేశావు. కాళ్లు కాలిన పిల్లిలా అలా తిరుగుతున్నావు.

వైజయంతి:  నేను కాదు పిల్లి నువ్వే బల్లి, నల్లి. అయినా ఇంట్లో ఉండేదాన్ని , నాలుగు గోడల మధ్య ఉండేదాన్ని. నేనేం చేస్తాను.

సుధాకర్‌: నువ్వు ఇంత ఓవర్‌ గా మాట్లాడుతూ.. ఓవరాక్షన్‌ చేస్తున్నావంటే కచ్చితంగా ఏదో చేసే ఉంటావు. నా నెత్తి మీదకు రాళ్లు తీసుకొచ్చే ఉంటావు. నేను అన్నదే నిజం అవ్వాలి నీకు ఉంది చెప్తాను.

వైజయంతి: అదిగో కారు వచ్చుండాది. కౌషికి వాళ్లు వచ్చారు. కలిసి వస్తున్నారేంది..? దొరికిపోయారా ఏంటి?

సుధాకర్‌: ఏంటీ..

వైజయంతి: ఏం లేదు. కలిసి వస్తున్నారు అని చెప్తున్నాను. ఇగో అల్లుడు ఏమైంది.

బూచి: మాట్లాడించకండి అత్తయ్యా..

వైజయంతి: పొద్దున్న వెళ్లినప్పుడు సెగ గడ్డ లేదు కదా? మూడు గంటల్లో ఎట్టా వచ్చింది.

 అని అడగ్గానే కౌషికి జరిగింది మొత్తం చెప్తుంది. దీంతో సుధాకర్‌ ఎందుకు కౌషికికి తెలియకుండా వెనకే వెళ్లారు అంటూ ప్రశ్నించడంతో నిషిక, దివ్యాంక వీడియో షూట్‌ చేయమంటే వెళ్లాము అని చెప్తుంది. దీంతో సుధాకర్‌ కోపంగా తిడుతాడు. దీంతో వైజయంతి చాలు ఇక వదిలేయండి అని చెప్పగానే కౌషికి తిడుతుంది. ఇంతలో ఎవరి రూముల్లోకి వాళ్లు వెళ్లిపోతారు. తర్వాత కౌషికిని వాళ్ల నాన్న గురించి అడుగుతుంది ధాత్రి. ఆయన దేవనాగరి లిపిలో ప్రొఫెసర్‌ అని చెప్పి కౌషికి ఎమోషన్‌ అవుతుంది.

కేదార్‌: అక్కా, నాన్నా చెప్పినదాన్ని గురించి ఆలోచిస్తే పెద్దనాన్న చాలా మంచివారని తెలుస్తుంది. మరి ఆయనకు మీనన్‌కు సంబంధం ఏంటి? ఆయనకు మీ అమ్మ చావుకు సంబంధం ఏంటి?

ధాత్రి: ఇరవై ఏళ్ల ముందు ఏం జరిగిందో తెలియదు కానీ కథ పెద్దమామయ్య గారితో మొదలై ఉండాలి. లేదా కథ ఆయన వల్లే మారి ఉండాలి. మనకు దొరికి పత్రాల మీద ఉన్న లిపి దేవనాగరి లిపి అయితే కచ్చితంగా పెద్దమామయ్య గారికి మా అమ్మ చావుకు సంబంధం ఉన్నట్లే కేదార్‌.

అని చెప్పగానే కేదార్‌ ఆలోచనలో పడిపోతాడు. తర్వాత పక్కింటావిడ వచ్చి రేపు నా కోడలు సీమంతం  ఉంది అందరూ రావాలని పిలుస్తూ.. కౌషికిని నువ్వు కూడా కడుపుతో ఉన్నావు కదా నీ సీమంతం ఎప్పుడు అని అడుగుతుంది. దీంతో అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. ఆవిడ వెళ్లిపోయాక. ధాత్రి, కేదార్‌ ఇద్దరూ కలిసి కౌషికికి సీమంతం చేయాలని డిసైడ్‌ అవుతారు. నిషిక, వైజయంతి వద్దని గొడవ చేస్తారు. దీంతో కౌషికి కూడా ఇంట్లో ఏ సీమంతం జరగడానికి వీల్లేదని చెప్పి వెళ్లిపోతుంది. కౌషికి వెనకే వెల్లిన ధాత్రి, కేదార్‌ కౌషికిని సీమంతానికి ఒప్పిస్తారు. సుధాకర్‌ కూడా సీమంతం చేసుకోమని చెప్తాడు. దీంతో సరే అని కౌషికి వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఇంట్లో సీమంతానికి ఏర్పా్ట్లు చేస్తుంటే నిషిక, వైజయంతి అడ్డుకుంటారు. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

ALSO READ: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఐఏఎస్, ఐపీఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు - డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, షర్మిలకు భద్రతపైనా కీలక వ్యాఖ్యలు
ఐఏఎస్, ఐపీఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు - డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, షర్మిలకు భద్రతపైనా కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
NBK Allu Arjun: ‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బన్నీకి బాలయ్య సర్‌ప్రైజ్, అస్సలు ఊహించలేదట!అమ్మో! ఇళ్ల పక్కనే పెద్దపులి! గజగజ వణికిపోతున్న జనంనడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: ఐఏఎస్, ఐపీఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు - డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, షర్మిలకు భద్రతపైనా కీలక వ్యాఖ్యలు
ఐఏఎస్, ఐపీఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు - డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, షర్మిలకు భద్రతపైనా కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
NBK Allu Arjun: ‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
Group 3 Hall Tickets: తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
Kiara Advani: 'గేమ్ చేంజర్' టీజర్ లాంచ్‌లో కియారా - అరెరే ఏముందిరా!?
'గేమ్ చేంజర్' టీజర్ లాంచ్‌లో కియారా - అరెరే ఏముందిరా!?
Crime News: తెలంగాణలో తీవ్ర విషాదాలు - చెరువులో దూకి ఇద్దరు పిల్లలు సహా తండ్రి ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం
తెలంగాణలో తీవ్ర విషాదాలు - చెరువులో దూకి ఇద్దరు పిల్లలు సహా తండ్రి ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం
Pushpa 2: ‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
Embed widget