Jagadhatri Serial Today September 14th: ‘జగధాత్రి’ సీరియల్: సూర్యకు వార్నింగ్ ఇచ్చిన యువరాజ్ – మాధురికి ధైర్యానిచ్చిన ధాత్రి, కేదార్
Jagadhatri Today Episode: మాధురి క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడిన సూర్యకు యువరాజ్ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Jagadhatri Serial Today September 14th: ‘జగధాత్రి’ సీరియల్: సూర్యకు వార్నింగ్ ఇచ్చిన యువరాజ్ – మాధురికి ధైర్యానిచ్చిన ధాత్రి, కేదార్ Jagadhatri serial today episode September 14th written update Jagadhatri Serial Today September 14th: ‘జగధాత్రి’ సీరియల్: సూర్యకు వార్నింగ్ ఇచ్చిన యువరాజ్ – మాధురికి ధైర్యానిచ్చిన ధాత్రి, కేదార్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/14/e0078e5035d824f2a61700669cfb7d1d1726277955027879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jagadhatri Serial Today Episode: మాధురి మంచిదేనని నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పమని నిషిక అడుగుతుంది. దీంతో సూర్య మాధురి మంచిదేనని నాకు నమ్మకం కలగాలి అలా ఎవరితోనైనా చెప్పించాలి అంటాడు. దీంతో కమలాకర్ నువ్వు అంటునదేంటో మాకు అర్థం కావడం లేదు అంటాడు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది. మాధురికి టెస్ట్ చేయించండి అంటాడు. దీంతో కేదార్ కోపంగా వెళ్లి సూర్య కాలర్ పట్టుకుని కొట్టబోతాడు. అందరూ వచ్చి విడిపిస్తారు.
యువరాజ్: చూడు సూర్య అన్నది నువ్వు కాబట్టి వాడు చేసిన పని నేను చేయడానికి ఆలోచిస్తున్నాను. నువ్వు మర్యాదగా మాధురికి క్షమాపణ చెప్పు.
సూర్య: తప్పు నీ చెల్లి చేస్తే.. క్షమాపణ నన్ను చెప్పమంటున్నావా?
సత్యప్రసాద్: ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి
అని మనసులో అనుకుంటూ.. వెళ్లి సూర్యను కొట్టి ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అంటాడు. ఇంతలో అందరూ సూర్యను తిడతారు. నువ్వు అడిగిన అన్ని రుజువులు చూపించగలను కానీ నీకు అనుమానం వచ్చిన ప్రతిసారి మేము రుజులు చూపించగలమా? అంటూ సుధాకర్ ఇక ఇక్కడితో సంబంధం కాన్సిల్ చేసుకుందాం అంటాడు. దీంతో సత్యప్రసాద్ బయపడుతూ మాధురికి సారీ చెప్పమంటాడు. సూర్య సారీ చెప్పగానే పైకి వెళ్లిపోతుంది. ఇంతలో సూర్య తరపున ప్రసాద్ సారీ చెప్తాడు. షాపింగ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోతారు. ఏడుస్తూ కూర్చున్న మాధురి దగ్గరకు ధాత్రి, కేదార్ వెళ్తారు.
ధాత్రి: మధు ఊరుకో ఎందుకు ఏడుస్తున్నావు.
మధు: నాక ఈ పెళ్లి వద్దు వదిన. నాకు సూర్య ప్రవర్తన అసలు నచ్చలేదు. ఈ విషయం మా అమ్మా అన్నయ్యకు చెప్పినా వాళ్లు అర్థం చేసుకోరు.
కేదార్: ముందు ఆ ఏడ్వడం ఆపు. ఫ్లీజ్ మధు ప్లీజ్
ధాత్రి: చూడు మధు ఎవరు ఎన్ని చెప్పినా నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదు.
అంటూ బాధలో ఉన్న మాధురిని ఓదారుస్తారు. నువ్వు అనుకుంటేనే నీ పెళ్లి జరుగుతుంది. నీకు నా మీద, కేదార్ మీద నమ్మకం ఉంది కదా? అంటూ వాళ్ల సంగతి ఏంటో చూసి తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అంటూ భరోసా ఇవ్వడంతో మాధురి ఎమోషనల్ గా ఫీలవుతుంది. మరోవైపు నిషిక ఆ జగధాత్రే కావాలని సూర్యకు మాధురి గతం గురించి చెప్పిందేమో అంటుంది.
కాచి: అవును పెద్దమ్మ వాళ్లు మొదటి నుంచి ఈ సంబంధం చెడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంచేసినా ఉపయోగం లేదని తాంబూలాల రోజు ఎంత గొడవ చేశారో గుర్తు ఉంది కదా?
వైజయంతి: అవునమ్మీ ఆఖరికి ఆ ఇద్దరు ఇంత నీచానికి దిగజారుతారని అసలు అనుకోలేదు.
అనగానే నిషిక ఇంకా ఎక్కువ అబద్దాలు చెప్పి రెచ్చగొడుతుంది. ఇంతలో బూచి వచ్చి నాకెందుకో ఇది ధాత్రి వాళ్లు చేసి ఉండరని నాకు అనిపిస్తుంది అంటూ ఎందుకంటే ఇంట్లో ఇలాంటి నీచమైన పనులు చేసేది మనమే కదా? అంటాడు. దీంతో అందరూ బూచిని కొడతారు. తర్వాత కౌషికి.. షర్మిల ఠాగూర్ ఇంటర్వూకి వెళ్తుంటే.. నిషిక, వైజయంతి, కాచి, బూచి వచ్చి తమను తీసుకెళ్లమని అడుగుతారు. కుదరదని నిన్ను ధాత్రి, కేదార్ వస్తామన్నారు. వాళ్లనే తీసుకెళ్తున్నాను అని చెప్పి ముగ్గురు కలిసి వెళ్తారు.
తర్వాత దివ్యాంకకు ఫోన్ చేసిన నిషికకు ఆ ఇంటర్వూ వీడియో నాకు ఎలాగైనా ఇవ్వాలని 50 లక్షలు కాదు.. కోటి రూపాయలు ఇస్తానని ఆఫర్ ఇవ్వడంతో అందరూ ప్లాన్ చేసి వైజయంతి హారతి తీసుకుని వెళ్లి కౌసికి వాళ్లకు దిష్టి తీస్తుంది. వారి వెనకాలే కాచి, బూచి, నిషిక వెళ్లి కారు డిక్కీలో కూర్చుంటారు. ఇంతలో కారేసుకుని నిషిక వాళ్లు షర్మిల ఠాగూరు దగ్గరకు వెళ్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ చిన్న పని చేస్తే చాలు కర్పూరంతో అదృష్ణ దేవతను మీ ఇంట్లోకి ఇలా ఆహ్వానించవచ్చట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)