అన్వేషించండి

Jagadhatri Serial Today March 2nd: ‘జగధాత్రి’ సీరియల్‌: దివ్యాంకను అరెస్ట్ చేసిన పోలీసులు - కౌషికికి పెన్ డ్రైవ్ ఇచ్చిన ధాత్రి

Jagadhatri Today Episode: పెన్ డ్రైవ్ కేసులో దివ్యాంకను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: దివ్యాంక, సురేష్‌ రింగ్స్‌ మార్చుకుంటుంటే కౌషికి నావల్ల కాదు నేను వెళ్లిపోతున్నాను అంటూ వెళ్లిపోతుంటే ఇంతలో పోలీసులు వచ్చి ఎంగేజ్‌మెంట్‌ ఆపుతారు. మీరు పెన్‌డ్రైవ్‌ ఇచ్చి కోటి రూపాయలు ఇంటికి తీసుకొచ్చారని మాకు ఇన్‌ఫర్మేషన్‌ ఉంది. అనడంతో దివ్యాంక, కౌషికి, నిషిక, యువరాజ్‌ షాక్‌ అవుతారు. తర్వాత నా దగ్గర ఏ పెన్‌డ్రైవ్‌ లేదు. నేను దేన్ని అమ్ముకోలేదు. నేను నిజాన్ని చెప్పేదాన్నే కానీ అమ్ముకునే దాన్ని కాదు అంటుంది దివ్యాంక.  యువరాజ్‌, నిషిక కూడా ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారు సార్‌ దివ్యాంక అలాంటి కాదు అని చెప్తారు.

ధాత్రి: నిజం నిప్పు లాంటిది ఎవరు దాచాలని చూసిన దాగదు. అది సార్‌ మాటర్‌ మా దివ్యాంక నికార్సైన మనిషి. నిజాయితీకి నిలువెత్తు రూపం అలాంటి మనిషి మీద ఇలాంటి నింద వేయడానిక మీకు మనసు ఎలా వచ్చింది సార్‌. అయినా ఈ ఇంట్లో మూల మూల వెతకండి ఇక్కడ ఏం దొరకదు

దివ్యాంక: ఏయ్‌ జగధాత్రి నా ఇంట్లో వెతకమని చెప్పడానికి నువ్వెవరు?

ధాత్రి: పోలీసులను వాళ్ల డ్యూటీ వాళ్లను చేయనివ్వకపోతే అది కూడా ఒక నేరమేనట. మనకి ఈ కేసులు అవసరమా చెప్పు. అది  సార్‌ మా దివ్యాంక పర్మిషన్‌ ఇచ్చారు మీరు వెళ్లి వెతకండి.

దివ్యాంక: ఒక్క నిమిషం ఇన్‌స్పెక్టర్‌ నా ఇల్లు వెతకటానికి సెర్చ్‌ వారంట్‌ ఉందా?

అనగానే ఆ ఇన్‌స్పెక్టర్‌ సెర్చ్‌ వారంట్‌ చూపిస్తాడు. పోలీసులు ఇంట్లో సోదాలు చేసి దివ్యాంక దాచిపెట్టిన డబ్బులు ఉన్న బ్యాగ్‌ తీసుకొస్తారు.  ఆ డబ్బులు బిజినెస్‌ పర్పస్‌ తీసుకొచ్చానని చెప్ప్తుంది. అయితే  ఈ వాయిస్‌ మీదే కదా అని ఇన్‌స్పెక్టర్‌ వినిపించడంతో అది నా వాయిస్‌ కాదు అంటుంది దివ్యాంక.

ధాత్రి: తప్పు చేసి నేను కాదు అంటే ఎలా దివ్యాంక. అక్కడున్నది నీ వాయిస్‌ అని మా అందరికీ కూడా బాగా అర్తం అయ్యింది. ఇంకా ఎందుకు చెప్పు తప్పును ఒప్పేసుకో..

కౌషికి: తప్పుల మీద తప్పులు చేశావు దివ్యాంక. నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. నీ పాపం పండింది దివ్యాంక నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు.

దివ్యాంక: జగధాత్రి నువ్వే కదా ఇదంతా చేసింది.

ధాత్రి: నువ్వు తప్పు చేశావు నేను పట్టించాను. అంతే దివ్యాంక.

అంటూ ధాత్రి పోలీసులకు ఫోన్‌ చేసి ఇన్ఫర్మేషన్‌ ఇచ్చిన విషయం గుర్తు చేసుకుంటుంది.  పోలీసులు దివ్యాంకను తీసుకెళ్తారు. దివ్యాంక ఎలాంటిదో సురేష్‌కు చెప్తుంది ధాత్రి. అలాగే పెన్‌ డ్రైవ్‌ కౌషికికి ఇస్తుంది ధాత్రి. దీంతో కౌషికి హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత నిషిక, వైజయంతి, యువరాజ్‌ గార్డెన్‌ లో కూర్చుని ఉంటారు.

వైజయంతి: అయినా అమ్మి ఆ దివ్యాంక ఏందో పెద్ద తెలివైంది అని కష్టపడి పెన్‌ డ్రైవ్‌ కొట్టేసి ఇస్తే.. ఇట్టా పోలీసులకు దొరికిపోయిందేంటి?

నిషిక: దివ్యాంక తెలివి తక్కువగా దొరికిపోలేదు అత్తయ్యా.. ఆ జగధాత్రి తెలివి వల్ల దొరికిపోయింది. నాకు తెలిసి ఇదంతా ఆ జగధాత్రి పనే అయ్యుంటుంది.

  అంటూ మాట్లాడుకుంటుంటారు. ఎలాగైనా ధాత్రిని ఇంట్లో నుంచి పంపించేయాలని ప్లాన్‌ చేస్తారు. లేదంటే మనం అనునకున్నది ఏదీ జరగదు అని ప్లాన్‌ చేస్తారు. మరోవైపు కౌషికి ధాత్రికి థాంక్స్‌ చెప్తుంది. నువ్వు మా ఇంటి కోడలు అయ్యుంటే ఎంత బాగుండు అంటుంది. దీంతో సురేష్‌తో ఒక్కసారి మాట్లాడండి అంటుంది ధాత్రి. దీంతో నాకు ఆ మనిషితో కలిసి బతకడం ఇష్టం లేదు అని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత మినిస్టర్‌ మర్డర్‌ కేసు విషయంలో కేదార్‌, ధాత్రి ఇద్దరూ కలిసి రాఘవ దగ్గరకు వస్తారు. మినిస్టర్‌ గారిని చంపింది ఎవరో తెలిసిందా? అని అడుగుతాడు. అయితే రాఘవకు తెలియకుండానే రాఘవను ఇంటరాగేషన్‌ చేస్తారు ధాత్రి, కేదార్‌. దీంతో రాఘవ బయపడుతుంటాడు ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌  అయిపోతుంది.

Also Read: ఏమిటో ఏమిటో... ఈ మెలోడీ ఇంత బావుందేమిటో, మళ్లీ మళ్లీ వినేలా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Heavy Rains In Karimnagar And Medak: భారీ వర్షాలకు నీట మునిగిన ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలు- విద్యాసంస్థలకు గురువారం హాలిడే
భారీ వర్షాలకు నీట మునిగిన ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలు- విద్యాసంస్థలకు గురువారం హాలిడే
Kamareddy Real Heroes: ప్రజల ప్రాణాలకు వీళ్ల ప్రాణాలు అడ్డేస్తున్నారు - వరదల్ని ఎదిరిస్తున్న కామారెడ్డి రియల్ హీరోలు
ప్రజల ప్రాణాలకు వీళ్ల ప్రాణాలు అడ్డేస్తున్నారు - వరదల్ని ఎదిరిస్తున్న కామారెడ్డి రియల్ హీరోలు - వీడియో
Hyderabad Rain Alert: హైదరాబాద్‌లోనూ ఆగకుండా దంచి కొడుతున్న వర్షం - వచ్చే 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో అలజడే
హైదరాబాద్‌లోనూ ఆగకుండా దంచి కొడుతున్న వర్షం - వచ్చే 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో అలజడే
Dog Bite Risks : కుక్క కరిస్తే ఎన్ని గంటల్లోపు ఇంజెక్షన్ వేయించుకోవాలి? లేకుంటే రేబిస్​తో పాటు ఆ వ్యాధులు తప్పవు
కుక్క కరిస్తే ఎన్ని గంటల్లోపు ఇంజెక్షన్ వేయించుకోవాలి? లేకుంటే రేబిస్​తో పాటు ఆ వ్యాధులు తప్పవు
Advertisement

వీడియోలు

Indian Army Rescue Operation in Punjab | ఉత్తర భారత్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు
Mohammad Siraj about Bumrah Bowling | బుమ్రా లేనప్పుడే వికెట్స్ తీస్తానంటున్న సిరాజ్
Shubman Gill Injury Before Asia Cup 2025 | గాయంతో బాధపడుతున్న శుబ్మన్ గిల్
Sanju Samson in KCL | KCL లో అదరగొడుతున్న సంజూ శాంసన్
Vinayaka Chavithi 2025 Bala Gangadhar Tilak Ganesh Festivals History | చవితి ఉత్సవాలను ప్రారంభించిన వ్యక్తి తిలక్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heavy Rains In Karimnagar And Medak: భారీ వర్షాలకు నీట మునిగిన ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలు- విద్యాసంస్థలకు గురువారం హాలిడే
భారీ వర్షాలకు నీట మునిగిన ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలు- విద్యాసంస్థలకు గురువారం హాలిడే
Kamareddy Real Heroes: ప్రజల ప్రాణాలకు వీళ్ల ప్రాణాలు అడ్డేస్తున్నారు - వరదల్ని ఎదిరిస్తున్న కామారెడ్డి రియల్ హీరోలు
ప్రజల ప్రాణాలకు వీళ్ల ప్రాణాలు అడ్డేస్తున్నారు - వరదల్ని ఎదిరిస్తున్న కామారెడ్డి రియల్ హీరోలు - వీడియో
Hyderabad Rain Alert: హైదరాబాద్‌లోనూ ఆగకుండా దంచి కొడుతున్న వర్షం - వచ్చే 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో అలజడే
హైదరాబాద్‌లోనూ ఆగకుండా దంచి కొడుతున్న వర్షం - వచ్చే 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో అలజడే
Dog Bite Risks : కుక్క కరిస్తే ఎన్ని గంటల్లోపు ఇంజెక్షన్ వేయించుకోవాలి? లేకుంటే రేబిస్​తో పాటు ఆ వ్యాధులు తప్పవు
కుక్క కరిస్తే ఎన్ని గంటల్లోపు ఇంజెక్షన్ వేయించుకోవాలి? లేకుంటే రేబిస్​తో పాటు ఆ వ్యాధులు తప్పవు
TVK president Vijay: విజయ్ దాడి చేశాడని ఫిర్యాదు చేసిన ఫ్యాన్ - కేసు పెట్టిన పోలీసులు
విజయ్ దాడి చేశాడని ఫిర్యాదు చేసిన ఫ్యాన్ - కేసు పెట్టిన పోలీసులు
Who is the Amul baby : అమూల్ బేబీ ఎవరో బయటపెట్టిన కంపెనీ - ఆ బేబీతో శశిథరూర్‌కు ఉన్న రిలేషన్ ఏమిటి ?
అమూల్ బేబీ ఎవరో బయటపెట్టిన కంపెనీ - ఆ బేబీతో శశిథరూర్‌కు ఉన్న రిలేషన్ ఏమిటి ?
Priyanka Mohan: 'సువ్వి సువ్వి'తో ప్రియాంక రోల్ ఏమిటో తెలిసిందిగా... 'ఓజీ'లో పవన్ గ్యాంగ్‌స్టర్ అయితే హీరోయిన్?
'సువ్వి సువ్వి'తో ప్రియాంక రోల్ ఏమిటో తెలిసిందిగా... 'ఓజీ'లో పవన్ గ్యాంగ్‌స్టర్ అయితే హీరోయిన్?
Digital e-Passport : ఈ-పాస్ పోర్ట్: విదేశాలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్! కొత్త ఫీచర్లు, సులభ దరఖాస్తు విధానం!
ఈ-పాస్ పోర్ట్: విదేశాలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్! కొత్త ఫీచర్లు, సులభ దరఖాస్తు విధానం!
Embed widget