Jagadhatri Serial Today June 3rd: ‘జగధాత్రి’ సీరియల్: సూరిని చంపేసిన యువరాజ్ – ధాత్రి, కేదార్లను ఇంటికి తీసుకొచ్చిన కౌషికి
Jagadhatri Today Episode: సాక్ష్యాలు తీసుకుని వచ్చిన సూరిని యువరాజ్ కత్తితో పొడిచి చంపేసి సాక్యాలు లేకుండా చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Jagadhatri Serial Today Episode : సూరి మామ వచ్చి నాన్నను బెదిరించి వెళ్లాడని యువరాజ్, వైజయంతికి చెప్తాడు. దీంతో నేను మరోలా అనుకున్నానని వైజయంతి సారీ చెప్తుంది. దీంతో కాచి వాళ్ల నాన్న సూరిని అడ్డగించమని యువరాజ్ కు చెప్పగానే సరేనని యువరాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు కారులో వెళ్తున్న కేదార్, ధాత్రిని వాళ్ల నాన్న మీరు ఈ పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆ ఇంటికే వెళ్లడం ఏంటి అని అడుగుతాడు. దీంతో ధాత్రి ఏదో చెప్పబోతుంటే కారుకు ఎదురుగా కౌషికి వచ్చి నిలబడి ఉంటుంది. కౌషికిని చూసిన ధాత్రి, కేదార్ కారు దిగి కౌషికి దగ్గరకు వెళ్తారు.
కేదార్: అక్కా నువ్వేంటి ఇక్కడ?
ధాత్రి: ఏంటి వదిన అలా ఉన్నారు ఏమైనా జరిగిందా? మన వాళ్లకు ఏం కాలేదు కదా?
కౌషికి: గంట ముందు కుటుంబం అంతా కట్టకట్టుకుని కక్ష్య పెంచుకుని నిన్ను అవమానించి కట్టుబట్టలతో బయటకు పంపించేసినా కూడా నా బాధను చూడగానే ఇంట్లో వాళ్లకు ఏం కాలేదు కదా అని అడిగే నీ సంస్కారం ముందు నేను చాలా చిన్నగా కనిపిస్తున్నాను ధాత్రి.
ధాత్రి: ఒక్కమాట అన్నారని మన వాళ్ల మీద కక్ష్య పెంచుకుంటామా? అయినా నన్ను ఏమైనా అనగలిగే హక్కు కుటుంబానికి తప్పా ఎవరికి ఉంటుంది.
కేదార్: అసలు ఏమైంది అక్కా మళ్లీ ఎందుకు వచ్చావు.
కౌషికి: మీకు మనఃస్ఫూర్తిగా క్షమాపణ చెప్పి మిమ్మల్ని మళ్లీ ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాను.
అని కౌషికి చెప్పగానే కేదార్, ధాత్రి హ్యాపీగా ఫీలవుతారు. కానీ ధాత్రి వాళ్ల నాన్న నా కూతురిని కేదార్‌ను మీ ఇంటికి పంపించడం నాకు ఇష్టం లేదు అంటాడు. కానీ కేదార్, ధాత్రి ఇంటికి వెళ్లడానికి ఓకే అంటారు. మరోవైపు ఆటోలో వెళ్తున్న సూరిని యువరాజ్ పట్టుకుంటాడు. సాక్ష్యాలు తీసుకుని సూరిని కత్తితో పొడిచి వెళ్లిపోతాడు. మరోవైపు ఇంట్లో అందరూ కేదార్, ధాత్రి వెళ్లిపోయారని స్వీట్లు పంచుకుంటుంటే ఇంతలో కేదార్, ధాత్రి ఇంటికి వస్తారు. వారిని చూసి అందరూ షాక్ అవుతారు.
నిషిక: ఎంత ధైర్యం ఉంటే మళ్లీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలని చూస్తున్నారు.
వైజయంతి: ఇంట్లోంచి పొమ్మని బయటకు తోసేశాము కదా మళ్లీ ఎందుకు తిరిగి వచ్చారు.
నిషిక: మీకు ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత కూడా లేదు. అయినా మళ్లీ మళ్లీ రావడానికి సిగ్గుగా లేదా? మీకు.. ఏంటే చెప్తుంటే ఇంకా ఇక్కడే నిలబడ్డారు. పోండి బయటకి.
కౌషికి: వాళ్లు ఎక్కడికి వెళ్లరు. వీళ్లిద్దరు ఇవాళ్టీ నుంచి ఇక్కడే ఉంటారు. పదండి.
నిషిక: అందరం కలిసి వాళ్లను ఇంట్లోంచి పంపించేశాం. ఇప్పుడు మీరు వెళ్లి వాళ్లను తిరిగి తీసుకొస్తే ఏమనుకోవాలి వదిన. నీకు మాకంటే వీళ్లే ఎక్కువా?
అంటూ వైజయంతి, కాచి, వాళ్ల నాన్న కౌషికిని నిలదీస్తారు. దీంతో ధాత్రి, కేదార్ ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను అంటుంది నిషిక. నేను ఎవరి పర్మిషన్ తీసుకోవడం లేదు అంటుంది కౌషికి. నేను వీళ్లిద్దరికీ పెళ్లి చేస్తానని మాటిచ్చాను అందుకే వీళ్ల పెళ్లి జరిపించడానికి మళ్లీ మన ఇంటికి తీసుకొచ్చాను అంటుంది కౌషికి. దీంతో నిషిక కోపంగా ధాత్రిని బయటకు గెంటివేస్తుంటే.. ధాత్రి ఎదురు తిరుగుతుంది. నిషిక ధాత్రిని తిడుతుంది. దీంతో కౌషికి నిషికను తిట్టగానే లోపలికి వెళ్తుంది. కేదార్, ధాత్రిలను కూడా పెళ్లి జరిగే వరకు మీరు ఎవరితో గొడవ పడొద్దని కౌషికి చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పెళ్లికి ముందే హనీమూన్ వెళ్లిన సిద్ధార్థ్, అదితి - ఎక్కడికి వెళ్లారో తెలుసా? ఫోటోలు వైరల్