Jagadhatri Serial Today January 4th: ‘జగధాత్రి’ సీరియల్: యువరాజ్‌కు షాక్ ఇచ్చిన ధాత్రి – ఇంట్లో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించిన యువరాజ్
Jagadhatri Today Episode: యువరాజ్ విషం కలిపిన కూరను ఇంట్లో వాళ్లు తినేలా చేశానని చెప్తుంది ధాత్రి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: ధాత్రి, కేదార్‌కు అన్నం తినిపిస్తుంది. బయటి నుంచి చూస్తున్న యువరాజ్ కాసేపట్లో వీడు చనిపోతాడు అనుకుంటాడు. ఇంతలో కేదార్ నురగలు క్కకుంటూ చనిపోతాడు. ఎస్సై వచ్చి కేదార్ అనే వ్యక్తికి విషం ఇచ్చి స్టేషన్ లో చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అంటాడు. ఇంతలో కేదార్ తిను ఇంకొంచెం తిను అంటున్న ధాత్రి మాటలు యువరాజ్‌కు వినిపిస్తాయి. యువరాజ్ లోపలికి చూసి ఇదంతా నా కలా… అయినా కొద్ది సేపట్లో జరిగేది ఇదే కదా అనుకంటాడు. ఇంతలో భోజనం చేయడం అయిపోయాక నేను వెళ్లి సాక్ష్యం సంపాదిస్తాను కేదార్ అని చెప్పి ధాత్రి బయటకు వస్తుంది. యువరాజ్ బాధపడుతూ నేను కూరలోనే కదా విషం కలిపింది మరి వాడికి ఏం కాలేదేంటి అనుకుంటాడు. బయటకు వచ్చిన ధాత్రి కారు చాటున దాక్కున్న యువరాజ్‌ను పిలుస్తుంది.
ధాత్రి: ఏంటి యువరాజ్ నువ్వు కలిపిన విషం కలిపినా కూడా కేదార్ కు ఏం కాలేదని చూస్తున్నావా..? ఆ కారు వెనకాల ఎంత సేపు ఉంటావు కానీ బయటకు రా.. మా ఆడవాళ్ల రాజ్యం వంటిళ్లు. ఆ రాజ్యానికే వచ్చి మమ్మల్ని మోసం చేయాలనుకుంటావా..? అతను మీ అన్నయ్యా మరీ ఇంత క్రూరంగా ఎలా ఆలోచిస్తున్నావు.
యువరాజ్: వాడు నా అన్న కాడు ఎప్పటికీ కాడు కూడా..
ధాత్రి: ఒక సాటి మనిషిగా కూడా చూడలేకపోతున్నావా..? చేయని తప్పుకు మనిషి జైల్లో ఉన్నాడు అయినా కూడా నీ కోపం తీరడం లేదా..? ఇంతకీ నువ్వు విషం కలిపిన కూరను నేను ఏం చేశానో తెలియడం లేదు కదా..?
యువరాజ్: ఏం చేశావు.
ధాత్రి: లంచ్ టైం అవుతుంది. ఇంట్లో అందరూ కూర్చుని అదే కూర తింటుంటారు.
యువరాజ్: పిచ్చి పట్టిందా..? ఆ కూర టేబుల్ మీద ఎలా పెట్టావు.
ధాత్రి: నువ్వు అంత ఇష్టంగా విషం కలిపిన కూర వేస్ట్ చేయడం ఎందుకని..
యువరాజ్: వాళ్లు తినే టైం అవుతుంది. వెళ్లి వెంటనే ఆపాలి.
అంటూ యువరాజ్ అక్కడి నుంచి పరుగెడతాడు. కారులో వెళ్తూ.. నిషికకు ఫోన్ చేస్తాడు. నిషిక ఫోన్ లిఫ్ట్ చేయదు. మరోవైపు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని బోజనం చేస్తుంటారు. బూచి అన్నం కలిపి గుత్తి వంకాయ కూర కలిపి వైజయంతికి తినిపిస్తుంటాడు. ఇంతలో పరుగెత్తుకొచ్చిన యువరాజ్ భయంతో ఈ ఫుడ్ ఎవ్వరూ తినకండి అంటాడు. గుత్తి వంకాయ కూర ఎవరైనా వేసుకున్నారా..? అని అడుగుతూనే బూచి చేతిలో ప్లేట్ పారేస్తాడు.
సుధాకర్: యువరాజ్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు..
ధాత్రి: అంత మంది అడుగుతున్నారుగా యువరాజ్ చెప్పు.
యువరాజ్: పక్కాగా నన్ను లాక్ చేసింది. ( మనసులో అనుకుంటాడు)
కౌషికి: యువరాజ్ ఎందుకు అలా చేస్తున్నావు.. చెప్పు..
యువరాజ్: అది బల్లి పడింది అక్కా..
ధాత్రి: బల్లి పడింది నువ్వు చూశావా..? పడిన బల్లి చెప్పిందా..?
కౌషికి: ఇక్కడ తింటున్న మాకే బల్లి కనబడలేదు.. అక్కడ ఉన్న నీకు ఎలా కనిపించింది.
యువరాజ్: అసలు ఆ కూర ఎవరైనా తిన్నారా..?
బూచి: ఎవరం తినలేదు బామ్మర్ది.. కానీ కొంచెం అత్తకు పెట్టాను.
అని చెప్పగానే.. యువరాజ్ భయంతో వైజయంతిని తీసుకుని హాస్పిటల్ కు వెళ్తుంటే ధాత్రి వెళ్లి జోక్ చేశాను అంటూ ఆపుతుంది. అందరూ వచ్చి యువరాజ్‌ను తిడతారు. ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటారు. తర్వాత సాక్ష్యం కోసం హీరోయిన్ ఇంటికి వెళ్లిన ధాత్రి అక్కడ ఎస్సై శ్రీనివాస్‌ను చూసి షాక్ అవుతుంది. గేటు ముందు నిలబడిన శ్రీనివాస్ నా పర్మిషన్ లేకుండా ఎవ్వరినీ లోపలికి పంపొద్దని చెప్తుంటాడు. ఇంతలో కిరణ్ తాగినట్టు బైక్ మీద వెళ్లి శ్రీనివాస్‌తో గొడవ పెట్టుకుంటాడు. మరోవైపు నుంచి ముసుగు వేసుకుని ధాత్రి లోపలికి వెళ్తుంది. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!