Jagadhatri Serial Today January 18th: ‘జగధాత్రి’ సీరియల్: టెన్ పర్సెంట్ కమీషన్ అడిగిన దివ్యాంక – నిజం తెలిసి షాక్ అయిన సురేష్
Jagadhatri Today Episode : డ్యాకుమెంట్ లో సురేష్ సంతకం చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తుంది దివ్యాంక దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri Serial Today Episode: ధాత్రి కూడా త్రిపాఠి ఏం చేస్తున్నావు.. మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు.. ఇది నా కేసు నేను డీల్ చేస్తాను. మీరు వెళ్లండి అంటుంది. త్రిపాఠి వెళుతూ మహేంద్రను చూసి ఏంట్రా అలా చూస్తున్నావు అంటూ గన్ లోడ్ చేసి కాలుస్తాడు. ధాత్రి, కేదార్ షాక్ అవుతారు. ఇంతలో కేదార్, త్రిపాఠినీ తోసేస్తాడు. గన్ పక్కకు ఫైర్ అవుతుంది. వెంటనే ధాత్రి గన్ తీసుకుని బయటుక వెళ్తుంది. నా గన్ ఇవ్వండి అంటూ త్రిపాఠి వెనకాలే వెళ్తాడు.
ధాత్రి: ఏం చేస్తున్నారో మీకైనా అర్తం అవుతుందా..?
కేదార్: పిచ్చి పట్టిందా..? మేము కానీ కాపాడకపోతే ఈ పాటికి వాడు చచ్చిపోయేవాడు.
ధాత్రి: ఎందుకు ఈ పని చేశారు. చెప్పండి ఎందుకు చేశారు ఈ పని. ఇలా మీరు ఎప్పుడు ఇలా చేయలేదు.
త్రిపాఠి: ఏయ్ ఏంట మీ గోల నేనేమైనా నిజాయితీ పరుణ్ని చంపాలనుకున్నానా..? వాడు ఒక క్రిమినల్.. హత్య చేసి ఒప్పుకోకుండా పోలీసులను పిచ్చి వాళ్లను చేస్తున్నాడు.
ధాత్రి: ఇలా తప్పు చేసిన వాళ్లను చంపుకుంటూ పోతే ఎలా..? అయినా శిక్ష వేయడానికి నువ్వెవరు..? రమ్య లాకర్ రూంలో పెట్టు.. సాధు సార్ రాగానే నీ యాక్షన్‌కు వివరణ ఇచ్చి మీ గన్ తీసుకొండి..
త్రిపాఠి: జేడీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు..
ధాత్రి: మీరు ఎప్పుడో క్రాస్ చేసేశారు.
త్రిపాఠి: దీనికి నువ్వు చాలా బాధపడతావు. ఇది గుర్తు పెట్టుకో..
ధాత్రి: మీరు కూడా ఇది గుర్తు పెట్టుకోండి. ఇంకోసారి తప్పు చేయకుండా ఉండటానికి. సాధు సార్‌కు వివరణ ఇచ్చే వరకు ఈ స్టేషన్ లో అడుగుపెట్టకూడదు. బయలుదేరండి.
కేదార్: ఈ మనిషికి ఉన్నట్లుండి పిచ్చి పట్టిందా..? జేడీ..
ధాత్రి: లేదు జేడీ.. మేనేజర్‌కు నిజం తెలుసు.. వాడు నోరు తెరిస్తే ఇంకెవరికో ప్రమాదం అందుకే ఇలా చేస్తున్నాడు.
కేదార్: సాధు సార్ రాగానే.. ఈసారి త్రిపాఠిని వదలకూడదు..
అంటూ కేదార్ సీరియస్ అవుతుంటాడు. ఇంతలో ఇంటికి వచ్చిన ధాత్రి వాళ్ల నాన్న ఇంటికి వస్తాడు. ధాత్రి కనిపించడం లేదని ఫోన్ చేస్తాడు. ఎందుకు వచ్చారని అడగ్గానే.. సిరికి మంచి సంబంధం వచ్చింది దాని గురించే ఇంటికి వచ్చాము.. అని చెప్పగానే.. రమ్య, కిరణ్‌కు జాగ్రత్తగా ఉండమని చెప్పి ధాత్రి, కేదార్ ఇంటికి వెళ్తారు. ధాత్రిని చూసి సిరి లేచి పలకరించబోతుంటే.. నిషిక అడ్డు పడుతుంది. అయినా వినకుండా వెళ్లి ధాత్రిని పలకరిస్తుంది సిరి.
ధాత్రి: ఎలా ఉన్నావు సిరి..
సిరి: బాగున్నాను అక్కా..? నెవ్వెలా ఉన్నావు..
ధాత్రి: బాగున్నాను..
సిరి: బావగారు బాగున్నారా..?
కేదార్: బాగానే ఉన్నా…
సిరి: అదే అక్కా బావగారు బాగున్నారా..? మూవీ చాలా బాగుంటుంది కూడా..? మా అక్కతో మాట్లాడుతుంటే ఏదో అంటున్నారేంటి బావగారు. ఓ నేను మిమ్మల్ని బాగున్నారా అని అడిగాను అనుకున్నారా..?
అనగానే కేదార్ మీరిద్దరూ గెలిచారు అంటాడు. అందరూ నవ్వుకుంటుంటే.. నిషికను చూసి బూచి మండుతున్నట్టు ఉంది అంటాడు. దీంతో నిషిక బూచిని కోపంగా చూస్తుంటుంది. ఇంతలో అబ్బాయి ఎవరు అని ధాత్రి అడగ్గానే మన బోర్డు ఆఫ్ డైరెక్టర్ ధనుంజయరెడ్డి గారి కొడుకు అనగానే మంచి సంబంధమే అంటుంది ధాత్రి. మంచి సంబంధం కాదు అంటుంది నిషిక. దీంతో అందరి మధ్య గొడవ జరగుతుంది. తర్వాత డాక్యుమెంట్స్ లో సంతకం చేయడానికి సురేష్ ఇంటకి వస్తాడు.
సురేష్: వచ్చిన పని కానిస్తే నేను త్వరగా వెళ్లాలి..?
సుధాకర్: ఆ మాట ఎలా అనగలుగుతున్నావు సురేష్. ప్రేమిస్తున్నాను. కలిసి ఉంటాను అన్నావు.. అన్ని మాటలు మాట్లాడి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఈ డీల్ చేసుకోవడానికి వచ్చావు. నువ్వన్నట్టు ప్రేమే ఉంటే ఇవాళ డబ్బు తీసుకుని సంతకం పెట్టడానికి వచ్చే వాడివే కాదు.
సురేష్: డబ్బు తీసుకుని సంతకం పెట్టడం ఏంటి..?
ధాత్రి: మీరు డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాలంటే.. మీక ప్రాపర్టీ లో టెన్ పర్సెంట్ ఇవ్వాలని దివ్యాంక చెప్పింది అన్నయ్య.
కౌషికి: ఆ మాట నువ్వు చెప్పలేదని ఆ మాటలు దివ్యాంకవి అని చెప్పు సురేష్
అంటుంది. కౌషికి.. దీంతో సురేష్ ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తుంటాడు. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















