Jagadhatri Serial Today January 11th: ‘జగధాత్రి’ సీరియల్: త్రిష కేసులో క్లూ సంపాదించిన ధాత్రి – పట్టుకునేలోపే పారిపోయిన అనుమానితుడు
Jagadhatri Today Episode : హీరోయిన్ త్రిష హత్య కేసులో క్లూ దొరుకుతుంది ధాత్రికి దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri Serial Today Episode: కేదార్, ధాత్రి రెస్టారెంట్‌కు వెళ్తారు. అక్కడ ప్లవర్ ఇస్తూ ధాత్రి, కేదార్‌కు ప్రపోజ్ చేస్తుంది. కేదార్ ఎమోషనల్ అవుతాడు. తర్వాత పాత మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. ఒకరికొకరు విషెష్ చెప్పుకుంటారు. కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా గడుపుతారు. ఇంతలో అక్కడే ఒకతనికి సూప్‌లో బొద్దింక రావడంతో అతను లేచి అరవగానే.. మేనేజర్ వచ్చి ఇంకోటి వస్తుందని కేర్‌లెస్‌గా వెళ్లిపోతుంటే.. వాళ్లు అంత కేర్‌లెస్‌గా వెళ్తున్నావేంటి..? వేరేది తీసుకురావొచ్చు కానీ ఈ ఫుడ్ తింటే మాకు ఏమైనా అయ్యుంటే అని అడగ్గానే.. సూప్‌లో బొద్దింక తీసి కింద పడేసి ఇక్కడ బొద్దింకే లేదు మీరేంటి రాదాంతం చేస్తున్నారు అంటూ వెళ్లిపోతుంటే.. ధాత్రి వెళ్తుంది.
కేదార్: ధాత్రి.. ధాత్రి.. ఫస్ట్ డేట్ నాశనం చేశాడు వెధవ.. వీణ్ని..
ధాత్రి: ఆగండి సార్.. ఎక్కడికి అలా వెళ్లిపోతున్నారు.
మేనేజర్: ఎవరు మీరు..?
ధాత్రి: మీ కస్టమర్ నే సార్.. మంచి ఫుడ్ పెట్టాల్సింది మీ బాధ్యత.. మీ బాధ్యత తప్పి మీరు తప్పు చేశారు. దానికి మీరు వాళ్లకు సారీ చెప్పాల్సింది.
మేనేజర్: ఏంటి నేను సారీ చెప్పాలా..? నేను చెప్పను.
ధాత్రి: సరే నేను చెప్పిస్తాను.
మేనేజర్: రేయ్…
ధాత్రి: ఓహో వీళ్లా నీ ధైర్యం… వీళ్లను కొడితే ఆటోమేటిక్ గా నీ ధైర్యం చచ్చిపోతుంది.
మేనేజర్: ఏంటి వీళ్లను కొడతావా..? వీళ్లను చూశావా ఎలా ఉన్నారో..
ధాత్రి: సరే ఒక్కోక్కరిని ఒక్క దెబ్బే కొడతాను. తిరిగి వాళ్లు నన్ను ఎన్ని దెబ్బలైనా కొట్టొచ్చు.
మేనేజర్: రేయ్ ఇది తిరిగి ఇక్కడి నుంచి వెళ్లకూడదు.
అని చెప్పగానే.. మేనేజర్ మనుషులు ధాత్రి మీదకు వస్తారు. అందరినీ పిచ్చకొట్టుడు కొడుతుంది. దీంతో మేనేజర్ సారీ చెప్తాడు. ధాత్రిని చూసి భయపడతాడు. బొద్దింక పడిన సూప్‌ను మేనేజర్‌కు తాగిస్తుంది ధాత్రి. మేనేజర్ విదిలించుకోవడంతో ఆ సూప్ వెళ్లి ఎవరో వ్యక్తి మీద పడుతుంది. తర్వాత మేనేజర్ సారీ చెప్పడంతో మాకు కాదు అక్కడ సారీ చెప్పు అనగానే అతనికి మేనేజర్ సారీ చెప్పగానే.. సారీ చెప్పకుండా తప్పించుకోవాలని చూస్తున్నావా..? నేను ఫుడ్ ఇన్ స్పెక్టర్‌ను నీ హోటల్ ను సీజ్ చేస్తాము అంటూ అతను వెళ్లిపోతాడు. సూప్ పడిన వ్యక్తి కాలి ముద్రను చూసి హీరోయిన్ ఇంట్లో దొరికిన వ్యక్తి కాలి ముద్రతో పోలి ఉందని అనుమానిస్తారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తారు. అందులో ఆ వ్యక్తి ముఖం కనిపించదు. నడుకుంటూనే వెళ్లాడు పార్కింగ్ లోనే ఉంటాడని వెళ్లి అక్కడ వెతుకుతారు.
కేదార్: కనిపించాడా ధాత్రి..
ధాత్రి: అదిగో మన సాక్ష్యం నడుచుకుంటూ మనకు ఎదురుగా వస్తుంది. ఏంటి మేనేజర్ గారు బాగున్నారా..?
కేదార్: మరి అంత షాక్ అవుతున్నారేంటి..? తప్పు చేసిన వాళ్ల దగ్గరకు పోలీసులు వస్తారు కదా..?
మేనేజర్: తప్పా నేనేం తప్పు చేశాను. మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పాను.
ధాత్రి: మాకు కావాల్సింది సమాధానం కాదు. నిజం.
అంటూ త్రిష మేనేజర్‌ను ధాత్రి, కేదార్ ప్రశ్నించగానే మేనేజర్ షాక్ అవుతాడు. తన కాలికి ఉన్న ఆరు వేళ్ల గురించి చెప్పగానే.. మరింత షాక్ అవుతాడు మేనేజర్. భయంతో పారిపోతుంటే.. వెనకాలే ఫాలో అవుతారు ధాత్రి, కేదార్. కొద్ది దూరం పరిగెత్తాక మేనేజర్ తప్పించుకుని వెళ్లిపోతాడు. మేనేజర్ పరుగెత్తుకుని మినిస్టర్ దగ్గరకు వెళ్తాడు. పోలీసులు తనను పట్టుకోవడానికి వచ్చారని జరిగింది మొత్తం చెప్తాడు. నేను దొరికితే మీరు కూడా దొరికపోతారు సార్ అని చెప్తాడు. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















