Jagadhatri Serial Today August 6th: ‘జగధాత్రి’ సీరియల్: జేడీ నుంచి తప్పించుకున్న మీనన్ – కౌషికి, సురేష్ మధ్య మొదలైన వార్
Jagadhatri Today Episode: ఇంట్లో ఇంత పెద్ద సంఘటన జరుగుతుంటే మీరిద్దరు ఎక్కడికి వెళ్లారని ధాత్రి, కేదార్ లను కౌషికి అనుమానించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: కమలాకర్ వెళ్లి కరెంట్ ఆన్ చేస్తాడు. తర్వాత అందరూ బయటికి వచ్చి చూడగానే డెడ్‌బాడీస్ ఉంటాయి. అందరూ షాక్ అవుతారు. ఏమీ తెలియనట్టు కేదార్, ధాత్రి, యువరాజ్, కమలాకర్ వస్తారు. ఇంతలో కౌషికి పోలీసులకు ఫోన్ చేస్తుంది. తర్వాత కేదార్, ధాత్రి ఇంతకుముందు ఇంట్లో కనిపించలేదని అడుగుతుంది. మెయిన్ ఆఫ్ అయ్యిందేమో చూద్దామని వెళ్లామని పక్కనే ఎవరో ఉంటే చెప్పే వెళ్లామని ధాత్రి అనగానే సురేష్ మీరు నాకే చెప్పారు సిస్టర్ అంటాడు. ఇంతలో నిషిక మీరు కరెంట్ పోయినప్పుడు స్టేజీ దగ్గరే లేరని అడుగుతుంది. దీంతో అందరూ టెన్షన్ పడుతుంటారు.
సురేష్: నేను స్టేజీ ఎక్కుతున్నానా? అప్పుడే కరెంట్ పోయింది. అప్పుడే వాళ్లు నాకు చెప్పారు. నేను కూడా హెల్ఫ్ చేద్దామని వాళ్లతో వెళ్లాను.
సుధాకర్: సరే వాళ్లు ఎక్కడికి వెళ్తే ఏంటి పదండి లోపలికి వెళ్దాం.
కౌషికి: జరిగినదాన్ని తలుచుకుని ఎంతసేపని ఇక్కడే ఉంటారు పిన్ని. సాయంత్రం నుంచి ఎవ్వరూ ఏమీ తినలేదు. గెస్టులు కూడా వెళ్లిపోయారు.
కేదార్: పోలీసులు వచ్చి ప్రొసీజర్ కూడా పూర్తి చేశారు. బాడీస్ ను కూడా తీసుకెళ్లిపోయారు.
సుధాకర్: వాళ్ల వేషాలకు వాళ్లకు ఏ సంబంధం లేదు కౌషికి. వాళ్లు మన ఫంక్షన్‌కే వచ్చారంటావా?
కమలాకర్: వాళ్లు రౌడీలు కదా అన్నయ్యా వాళ్లు మన పార్టీకి ఎందుకు వస్తారు.
యువరాజ్: మన పార్టీ జరుగుతుండటం అంతలో అలా జరగడం అంతా కో ఇన్సిడెంట్ అంతే. వాళ్లకు మనకు ఏ సంబంధం లేదు.
ధాత్రి: కో ఇన్సిడెంటో లేదా ఎవరైనా కో ఆపరేషన్ చేస్తే ఇంట్లోకి వద్దామనుకున్నారో.. అవన్నీ పోలీసులే తేలుస్తారులే యువరాజ్.
కేదార్: ఈఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఎవరి పనుల్లో వాళ్లు ఉంటారు. గుట్టుచప్పుడు కాకుండా వాళ్ల పని ముగించుకుని వెళ్లిపోదామనుకుంటే మాత్రం పోలీసులు వాళ్లని.. వాళ్ల వెనకున్న వాళ్లని.. వాళ్లతో పనిచేసేవాళ్లని అందర్ని పట్టుకుంటారు.
సుధాకర్: జరిగినదాన్ని గురించి మాట్లాడుతుంటే ఇలానే భయపడుతుంటాము. పదండి తినేసి రెస్ట్ తీసుకుందాము.
అని చెప్పగానే అందరూ తినడానికి వెళ్తుంటే.. బలరాం అనే వ్యక్తి వచ్చి కౌషికిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు మాట్రిమోని డాట్ కాంలో మీ ప్రొఫైల్‌లో చూశానని చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇదంతా దివ్యాంక ప్లాన్ అయ్యుండొచ్చని వైజయంతి, నిషిక మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనం ఈ సాకుతో రచ్చరచ్చ చేద్దాం అనుకుంటారు. దీంతో నిషిక, వైజయంతి, సూటిపోటి మాటలతో కౌషికిని ఇబ్బంది పెడుతుంటారు. సురేష్‌ను రెచ్చగొడతారు. దీంతో సురేష్ బాధతో కౌషికి దగ్గరకు వెళ్తాడు.
సురేష్: నువ్వు రెండో పెళ్లి చేసుకుందామనుకున్నావా? కౌషికి. నా ప్రశ్నకు సమాధానం నీ చూపులు కాదు కౌషికి. నోరు తెరిచి చెప్పు వీళ్లంతా చెప్పింది నిజమేనా?
కేదార్: ఏంటి బావా అక్క మనసు తెలియదా? మాటల్లోనే చెప్పాలా?
ధాత్రి: పొద్దునే మీకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని వదిన చెప్పారు కదా? మరి ఇంకో పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తుంది. ఎందుకు ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది.
నిషిక: చిన్న కరెక్షన్ జగధాత్రి. విడాకులు వద్దని చెప్పింది కౌషికి వదిన కాదు. మీరు వదిన ఏమీ మాట్లాడలేదు. మీరు మాట్లాడుకుని మీరే సంతోషపడిపోయారు.
అని చెప్పగానే కౌషికి ఏడుస్తూ సురేష్‌ను పట్టుకోబోతుంటే సురేష్ వద్దని నువ్వు నన్ను తాకే అర్హత కోల్పోయావు.. నేనిక నీ జీవితంలోంచి సైడ్ అయిపోతాను. నువ్వు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో అని చెప్పి వెళ్లిపోతాడు. వైజయంతి, నిషిక హ్యాపీగా ఫీలవుతుంటారు. తర్వాత ధాత్రి, కేదార్ ఇద్దరూ కలిసి కౌషికిని ఓదారుస్తారు. సురేష్ అలాంటి వాడు కాదని కన్వీన్స్ చేస్తారు. మరోవైపు దివ్యాంక, నిషికకు ఫోన్ చేసి మన దెబ్బ ఎలా ఉందని అడుగుతుంది. అందరూ హ్యాపీగా ఫీలవుతుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: బ్రెడ్ బూరెలు.. వినడానికి కొత్తగా ఉన్నా, తినడానికి టేస్టీగా ఉంటాయి.. సింపుల్ రెసిపీ ఇదే