Jagadhatri Serial Today August 5th: ‘జగధాత్రి’ సీరియల్: వజ్రపాటి ఇంట్లో డెడ్ బాడీస్ – జేడీ నుంచి తప్పించుకున్న మీనన్
Jagadhatri Today Episode: మీనన్ ను పట్టుకునేందుకు ధాత్రి ప్రయత్నించినా మీనన్ ఎస్కేప్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: యువరాజ్, కమలాకర్ ఏదో చేయబోతున్నారని అనుమానిస్తారు ధాత్రి, కేదార్. వెంటనే కిరణ్‌కు ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. ఇంతలో యువరాజ్ కమలాకర్ మీనన్ కోసం ఎదురుచూస్తుంటారు. తర్వాత కేదార్, ధాత్రి, సురేష్, కిరణ్ నలుగురు కలుసుకుని సీక్రెట్‌గా యువరాజ్ ఏం చేయబోతున్నారని మాట్లాడుకుంటారు. ఇంతలో ధాత్రి కనిపెడుతుంది. యువరాజ్ బొమ్మలలో గన్స్ పెట్టి అమ్ముతున్నారని.. ఈ పంక్షన్ అవకాశంగా తీసుకుని గన్స్ చేతులు మారుతాయని అయితే మీనన్ చూస్తుండగానే గన్స్, మీనన్‌ను పట్టుకుందాం అంటుంది ధాత్రి. ఇంతలో కౌషికి వస్తుంది. కౌషికిని చూసిన ధాత్రి, కేదార్, సురేష్ షాక్ అవుతారు. కిందకి పదండి అంటూ ముగ్గురిని కిందకు తీసుకెళ్తుంది. మరోవైపు మీనన్ జోకర్ వేషం వేసుకుని ఇంట్లోకి వస్తాడు. ఇంతలో గన్స్ బయ్యర్ కూడా వస్తాడు.
కౌషికి: ఎవరు బాబాయ్ ఈయన..?
కమలాకర్: మన వజ్రపాటి టవర్స్ కోసం మనం కొత్తగా అపాయింట్ చేసిన కొత్త డిజైనర్. మిస్టర్ అబ్దుల్. ట్విన్ టవర్స్ కూడా డిజైన్ చేసింది వీళ్ల కంపెనీయే అమ్మా..
కౌషికి: అవునా.. వెల్‌కం టూ ఇండియా.. అండ్ వెలకం టూ వజ్రపాటి ఫ్యామిలీ.
ధాత్రి: వదినను చూడగానే యువరాజ్‌లో కంగారు. వదినను దాటగానే ముఖంలో హ్యాపీనెస్. వాడు డిజైనర్ కాదు దొంగ అని చెప్తుంది.
కేదార్: మరైతే బయ్యర్‌గాణ్ని ముందు పట్టుకుంటే మన పని ఈజీ అవుతుందేమో ధాత్రి.
ధాత్రి: అవును కేదార్. కానీ యువరాజ్ వాళ్లు పక్కనే ఉన్నారు. బయ్యర్‌ను సెపరేట్‌గా తీసుకెళ్లాలి.
కౌషికి: బేరర్ ఇటు ఇవ్వు..
బయ్యర్: నో.. వద్దులేండి
యువరాజ్: బయ్యర్ వచ్చేశాడు. ఏంటి బాబాయ్ బాయ్ ఇంకా రాలేదు.
కమలాకర్: ఎందుకురా భయపడుతున్నావు. ఇక్కడ గన్స్ డెలివరీ గురించి మనమే ఇప్పుడు ప్లాన్ చేశాం. ఇంతలోనే ఈ విషయం జేడీకి ఎలా తెలుస్తుంది.
యువరాజ్: జేడీ నెట్ వర్క్ వైఫైలా మన చుట్టు ఉంటుంది బాబాయ్. కంటికి కనిపించదు కానీ తన కళ్ల ముందే మనం ఉంటాం. మనల్ని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది.
మీనన్: యువరాజ్..
యువరాజ్: బాయ్..
మీనన్: మాట్లాడకుండా నా వెంట రండి.
యువరాజ్: బాబాయ్ పద..
ధాత్రి: ఆ జోకర్ ను చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది కేదార్.
కేదార్: మీననే అంటావా?
ధాత్రి: చెప్పలేము.. చుట్టూ ఫ్యామిలీలు ఉన్నాయి. మనం రిస్క్ కూడా తీసుకోలేం. ముందు బయ్యర్‌ను అరెస్ట్ చేసి గన్స్ హ్యాండోవర్ చేసుకోవాలి.
అని ధాత్రి చెప్తుంది. మరోవైపు బయటకు వెళ్లిన మీనన్, యువరాజ్, కమలాకర్ గన్స్ ఉన్న పెట్టెలను వ్యాన్ లోకి షిఫ్ట్ చేస్తుంటారు. ఇంతలో కిరణ్, బయ్యర్ కు జ్యాస్ ఇవ్వబోయి వాడి మీద పోస్తాడు. దీంతో బయ్యర్ వాష్ రూంకి వెళ్తుంటే ధాత్రి వాణ్ని ఫాలో అవుతుంది. గన్స్ బాక్స్ వ్యాన్‌లోకి ఎక్కించడం చూస్తుంది. సురేష్‌కు కరెంట్ ఆఫ్ చేయమని చెప్తుంది. సురేష్ వెళ్లి కరెంట్ ఆఫ్ చేస్తాడు. వెంటనే ధాత్రి, కేదార్ గన్స్ లోడ్ చేస్తున్న దగ్గరకు వెళ్లి రౌడీలను చంపేస్తుంటారు. ఇది పసిగట్టిన మీనన్ ట్రక్ వేసుకుని ఎస్కేప్ అవుతాడు. కమలాకర్ వెళ్లి కరెంట్ ఆన్ చేస్తాడు. తర్వాత అందరూ బయటికి వచ్చి చూడగానే డెడ్‌బాడీస్ ఉంటాయి. అందరూ షాక్ అవుతారు. ఏమీ తెలియనట్టు కేదార్, ధాత్రి, యువరాజ్, కమలాకర్ వస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: నాకోసం పూరీ జగన్నాధ్ అద్భుతమైన క్యారెక్టర్ క్రియేట్ చేశారు - డబుల్ ఇస్మార్ట్ ఈవెంట్లో అలీ