అన్వేషించండి

Double Ismart Trailer Launch: నాకోసం పూరీ జగన్నాధ్ అద్భుతమైన క్యారెక్టర్ క్రియేట్ చేశారు - డబుల్ ఇస్మార్ట్ ఈవెంట్లో అలీ

Ali Comments at Double Ismart Trailer Launch: తాజాగా వైజాగ్‌లో ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. ఇందులో పాల్గొన్న అలీ.. పూరీ జగన్నాధ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Actor Ali At Double Ismart Trailer Launch: పూరీ జగన్నాధ్ సినిమాల్లో అలీ పాత్రలకు ఒక సెపరేట్ క్రేజ్ ఉంటుంది. సినిమా కథతో సంబంధం లేకుండా అలీ కోసం ప్రత్యేకంగా ఒక స్టోరీని రెడీ చేస్తారు పూరీ. అలా పూరీ డైరెక్ట్ చేసిన దాదాపు అన్ని సినిమాల్లో అలీ గెటప్స్, కామెడీ ఎవర్‌గ్రీన్‌గా మిగిలిపోయాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి ‘డబుల్ ఇస్మార్ట్’తో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యారు. తాజాగా విడుదలయిన మూవీ ట్రైలర్ చూస్తుంటే ఇందులో మరోసారి ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌తో అలీ నవ్వించబోతున్నారని అర్థమవుతోంది. ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న అలీ.. పూరీ జగన్నాధ్, రామ్‌పై ప్రశంసలు కురిపించారు.

నిరంతరం కష్టపడ్డాడు..

‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ విశాఖపట్నంలో జరిగింది. అందుకే విశాఖపట్నం కళాకారులను గౌరవిస్తుందని ప్రశంసించారు. అలాంటి కళాకారుల్లో ఒకడు పూరీ జగన్నాధ్ అని గుర్తుచేశారు. ‘‘నాకు హాలీవుడ్‌లో రాంబో తెలుసు. టాలీవుడ్‌లో మా రాపో తెలుసు. ఈ సినిమాలో తను పడిన కష్టం అంతాఇంతా కాదు. రామ్ నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. పూరీ జగన్నాధ్ డైలాగ్స్‌తో, మణిశర్మ మ్యూజిక్‌తో, రామ్ ఎనర్జీ, స్టెప్పులతో స్టెప్పా మార్ ఎలా ఉంటుందో మీరు టీజర్ చూశారు. పూరీ జగన్నాధ్‌కు ఇదొక అద్భుతమైన సినిమా కాబోతుంది. తను ఎక్కడా తగ్గడు. కరెక్ట్‌గా ఒక టాబ్లెట్ వేస్తాడు. ఈ 15 తారీఖుకు ఆ టాబ్లెట్ రెడీగా ఉంది. మీరంతా రెడీగా ఉండాలి’’ అని నమ్మకంగా చెప్పారు అలీ.

తుప్పును వదిలిస్తాడు..

పూరీ జగన్నాధ్ మొదటి సినిమా ‘బద్రి’ దగ్గర నుండి ఆయన తెరకెక్కించిన ప్రతీ సినిమాను గుర్తుచేసుకున్నారు అలీ. ‘‘కోవిడ్ సమయంలో అద్భుతమైన సినిమా చేయాలని లైగర్ ట్రై చేశారు. కానీ భగమంతుడు ఆ అవకాశం ఇవ్వలేదు. ప్రతీ ఒక్కరికి ఒక హిట్, ఫ్లాప్ ఉంటుంది. ఏ డైరెక్టర్, నిర్మాత అయినా ఫ్లాప్‌ను తీయాలని అనుకోరు. జనాల్ని మెప్పించాలి, హిట్ కొట్టాలి అనే ఉద్దేశ్యంతోనే సినిమాలు చేస్తారు’’ అంటూ ‘లైగర్’ ఫెయిల్యూర్‌పై స్పందించారు అలీ. థియేటర్లకు పట్టిన తుప్పును వదిలించడానికి ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తున్నాడని అన్నారు. హీరోయిన్ కావ్య థాపర్ డ్యాన్స్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. మూవీ టీమ్ అంతా సినిమా కోసం చాలా కష్టపడ్డారని తెలిపారు.

ఆ క్యారెక్టర్ ఏంటంటే..

‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ విడుదలయినప్పటి నుండి అసలు అలీ క్యారెక్టర్ ఏంటి అని ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. దానికి కూడా ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చేశారు అలీ. ‘‘అమెజాన్ ఫారెస్ట్‌లో ఒక భాష ఉంటుంది. ఆ భాషను కనిపెట్టి నా క్యారెక్టర్‌ను క్రియేట్ చేశాడు పూరీ జగన్నాధ్. నాకోసం అలాంటి అద్భుతమైన క్యారెక్టర్‌ను సృష్టించినందుకు సంతోషంగా చేశాను. నా కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ముంబాయ్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా చల్లగా ఉంది’’ అంటూ తన స్టైల్‌లో ఈ క్యారెక్టర్ గురించి కామెడీగా వివరించారు అలీ. మొత్తానికి పూరీ జగన్నాధ్, రామ్ కలిసి చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా సీక్వెల్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఆగస్ట్ 15న థియేటర్లలో సందడి చేయనుంది.

Also Read: స్టేజ్‌పైన చెప్తే పద్ధతిగా ఉండదు, తను చార్మీకి రైట్ హ్యాండ్ - ‘డబుల్ ఇస్మార్ట్’ ఈవెంట్‌లో రామ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Puliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget