అన్వేషించండి

Ram Pothineni: స్టేజ్‌పైన చెప్తే పద్ధతిగా ఉండదు, తను చార్మీకి రైట్ హ్యాండ్ - ‘డబుల్ ఇస్మార్ట్’ ఈవెంట్‌లో రామ్

Double Ismart Trailer Launch: తాజాగా జరిగిన ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రామ్‌తో పాటు ఇతర నటీనటులు పాల్గొన్నారు. ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు రామ్.

Ram Pothineni At Double Ismart Trailer Launch: చాక్లెట్ బాయ్ అని పేరు తెచ్చుకున్న రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాతో తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. అంతే కాకుండా ఈ మూవీ వల్ల తన మ్యానరిజం కూడా మారింది. అప్పటినుండి మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యాడు రామ్. ఇప్పుడు మరోసారి అదే ఇస్మార్ట్ శంకర్ పాత్రలో ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమాను సిద్దం చేశాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ ఈవెంట్‌కు రామ్‌తో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొన్నారు. తన ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్‌కు అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాడు రామ్. ‘డబుల్ ఇస్మార్ట్’ ఎక్స్‌పీరియన్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు.

గుర్తుండిపోయే క్యారెక్టర్..

‘‘2018 డిసెంబర్‌లో పూరీ జగన్నాధ్ గోవా వెళ్లారు. పక్కన ఉంటే ఎనర్జీ ఉంటుందని నన్ను రమ్మంటే నేను కూడా వెళ్లాను. ఎలాంటి సినిమా చేద్దామని ఆయన నన్ను అడిగినప్పుడు చాలా ఏళ్లు అయిపోయింది పదేళ్ల వరకు గుర్తుండిపోయే క్యారెక్టర్ చేద్దామన్నాను. అప్పుడు రాశారు ఇస్మార్ట్ శంకర్. ఇస్మార్ట్ శంకర్‌ను స్టేజ్‌పైన వర్ణించడం పద్ధతిగా ఉండదు. కానీ డీసెంట్‌గా చెప్పాలంటే వాడొక మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్. ఇది నాకు లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. యాక్ట్ చేస్తున్నప్పుడే చాలా కిక్ వచ్చింది. ఆ కిక్‌లో 10 శాతం ఆడియన్స్‌కు వచ్చినా నేను చాలా హ్యాపీ అవుతాను. నేను ఎంజాయ్ చేసినంత మీరూ చేయాలి’’ అంటూ పూరీతో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పుకొచ్చాడు రామ్.

కమర్షియల్ సినిమా ఈజీ కాదు..

‘‘ఇస్మార్ట్ శంకర్ లాంటి మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ క్యారెక్టర్‌తో పాటు అదిరిపోయే స్క్రిప్ట్ ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు డబుల్ ఇస్మార్ట్ స్క్రిప్ట్ రాశారు. ఇప్పటివరకు పూరీ చేసిన సినిమాల్లో చాలా టైమ్ తీసుకొని చేసిన సినిమా ఇది. చాలా కష్టపడ్డారు. కమర్షియల్ సినిమా అంటే గుర్తొచ్చేది పూరీ జగన్నాధ్. కమర్షియల్ సినిమా అంటే ఈజీ కాదు. నాకు సినిమాల్లో గ్యాప్ వచ్చినప్పుడు ఫారిన్ వెళ్తుంటాను. ముఖ్యంగా ఇటలీలో ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు. వాళ్ల దగ్గర ఓకే అంటాను కానీ హైదరాబాద్ వచ్చి డబుల్ మసారా బిర్యానీనే ఆర్డర్ చేస్తాను. ఆ కిక్ మనకే తెలుస్తుంది. అలా మన రక్తంలోనే కమర్షియల్ సినిమా ఉంది. కమర్షియల్ సినిమాకు ఉండే సక్సెస్ రేట్ చాలా తక్కువ’’ అంటూ కమర్షియల్ సినిమాలపై వ్యాఖ్యలు చేశాడు రామ్.

చార్మీ రైట్ హ్యాండ్..

‘‘అలీతో ఈ సినిమాలో కలిసి షూట్ చేయలేకపోయాను. కానీ లొకేషన్‌లో అందరూ చాలా ఎంజాయ్ చేశామని చెప్పారు. హీరోయిన్ కావ్య అయితే లొకేషన్‌లో చీమలకు చక్కెర పెట్టేంత మంచి అమ్మాయి. చీమలనే అలా చూసుకుంటుందంటే బాయ్‌ఫ్రెండ్‌ను ఇంకా బాగా చూసుకుంటుందని అనుకుంటున్నాను. విషు.. ఛార్మీకి రైట్ హ్యాండ్ లాంటోడు. ఇద్దరు కలిసి యుద్ధాలు చేశారు. సినిమా అంతా పూర్తయ్యి బాగా అలసిపోయిన సమయంలో ప్రమోషన్స్ పెడతారు. ప్రమోషన్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ అప్పుడే మీ దగ్గర నుండి ఎనర్జీ వస్తుంది’’ అంటూ ‘డబుల్ ఇస్మార్ట్’లో కలిసి పనిచేసిన అందరికీ థాంక్యూ చెప్పాడు రామ్.

Also Read: ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ విడుదల - ఈసారి యాక్షన్, రొమాన్స్ అంతా డబుల్

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget