అన్వేషించండి

Double Ismart Trailer: ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ విడుదల - ఈసారి యాక్షన్, రొమాన్స్ అంతా డబుల్

Double Ismart Trailer: ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ సిద్ధమయ్యింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలయ్యింది.

Double Ismart Trailer Is Out Now: ఒక సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే భారీ అంచనాల మధ్య విడుదల అవుతుంది. అలాగే ‘డబుల్ ఇస్మార్ట్’పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అప్పటివరకు చాక్లెట్ బాయ్ ఇమేజ్‌తో ఉన్న రామ్‌ను పూర్తిగా మార్చేసిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఇప్పుడు అదే సినిమాకు ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సీక్వెల్‌తో సిద్ధమయ్యాడు దర్శకుడు పూరీ జగన్నాధ్. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించిన ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రామ్ మ్యాడ్‌నెస్ డబుల్ రేంజ్‌లో ఉందని ప్రేక్షకులు అంటున్నారు.

కావ్యను చూసి ఫిదా..

‘‘నేనెవరో తెలుసా’’ అంటూ మాస్ స్టైల్‌లో రామ్ చెప్పే డైలాగ్‌తో ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ మొదలవుతుంది. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ కథకు ఇది కొనసాగింపు కాబట్టి తన తలకు యూఎస్‌బీ కేబుల్ అలాగే ఉంటుంది. దానిని కూడా ట్రైలర్‌లో ప్రత్యేకంగా చూపించారు. ఇందులో నీ పేరేంటి అని రామ్‌ను అడగగా.. ‘‘ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్’’ అని చెప్తాడు. అలా సంజయ్ దత్ కంటపడతాడు. తనకు టార్గెట్ అవుతాడు. అప్పుడే హీరోయిన్‌గా కావ్య థాపర్ ఎంట్రీ ఇస్తుంది. చూసిన వెంటనే కావ్య అందానికి ఫ్లాట్ అవుతాడు రామ్. ‘‘వెళ్లి దిష్టి తీయించుకో. లేకపోతే శంకర్ దిష్టి తగులుతుంది’’ అంటూ మాస్ స్టైల్‌లో తన ప్రేమను చెప్తాడు.

వింత గెటప్‌లో అలీ..

‘డబుల్ ఇస్మార్ట్’లో రామ్, కావ్య థాపర్ మధ్య కెమిస్ట్రీ ఒక రేంజ్‌లో ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘‘మీ వదినేమో కుతుబ్ మినార్. మనమేమో చార్మినార్.. రెండూ గుద్దుకుంటే ఎట్లుంటది రా’’ అంటూ తన ఫ్రెండ్ అయిన గెటప్ శ్రీనుతో తన లవ్ గురించి చెప్తాడు రామ్. అలా రామ్, కావ్య మధ్య ప్రేమ మొదలవుతుంది. అప్పుడే ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్‌లో అలీ ఎంట్రీ. పూరీ జగన్నాధ్ సినిమాల్లో అలీ గెటప్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అదే విధంగా ‘డబుల్ ఇస్మార్ట్‌’లో కూడా కోతిలాగా కనిపించే మనిషిగా కామెడీ క్రియేట్ చేశాడు అలీ. పైగా ఎవరికీ అర్థం కాని భాషలో మాట్లాడుతూ కన్‌ఫ్యూజ్ చేశాడు. 

మళ్లీ మెమొరీ ట్రాన్స్‌ఫర్..

అసలు చావే లేని మనిషిగా బ్రతకాలని అనుకుంటాడు సంజయ్ దత్. దానికోసం రామ్‌ను ఎంపిక చేసుకుంటాడు. ఒకరి బ్రెయిన్‌లోని మెమొరీ మరొకరి బ్రెయిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఆ తర్వాత ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ అంతా యాక్షన్‌తో నిండిపోయింది. ఈసారి రామ్ వర్సెస్ సంజయ్ దత్ మధ్య జరిగే యాక్షన్ మాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వనుందని ట్రైలర్‌తోనే తెలిసేలా చేశాడు పూరీ జగన్నాధ్. పైగా ‘ఇస్మార్ట్ శంకర్’లాగానే ఈ సీక్వెల్‌లో కూడా మాస్ స్టైల్‌లో, హైదరాబాదీ యాసలో రామ్ చెప్పే డైలాగులు ఫ్యాన్స్‌ను ఆకట్టుకోనున్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఆగస్ట్ 15న రామ్ ఫ్యాన్స్ కోసం ‘డబుల్ ఇస్మార్ట్’ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేశారు మేకర్స్.

Also Read: ‘దేవర’ పాటకు ముహూర్తం ఫిక్స్ - టైమ్ కూడా చెప్పేసిన మేకర్స్

టాప్ హెడ్ లైన్స్

Kalatheylaa Song Lyrics: కలతేలా లిరిక్స్... మధ్యతరగతి భర్తకు మోటివేషన్ ఇచ్చేలా విశాల్ 'మకుటం'లో సాంగ్
కలతేలా లిరిక్స్... మధ్యతరగతి భర్తకు మోటివేషన్ ఇచ్చేలా విశాల్ 'మకుటం'లో సాంగ్
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి
రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి
Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
Allu Arjun: వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్
వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget