అన్వేషించండి

Jagadhatri Serial Today August 2nd: ‘జగధాత్రి’ సీరియల్‌: మధు పెళ్లి ఆపేందుకు ధాత్రి ప్లాన్ – కేదార్ ను చంపేందుకు మీనన్ ప్లాన్

Jagadhatri Today Episode: కమీషనర్ కొడుకుతో మధు పెళ్లి జరగకూడదని ధాత్రి, కేదార్ లు పెళ్లి ఆపేందుకు ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: ఎస్సై రఘురాంను కలిసి తన తల్లి కావ్యకు సంబంధించిన కేసు గురించి వివరాలు తెలసుకుంటుంది ధాత్రి. ఆ టైంలో ఉన్న కమీషనర్‌ సత్యప్రసాద్‌ గురించి తెలుసుకుని ఆయనే తన తల్లి మీద చెరగని ముద్ర వేశారని అర్థం చేసుకుని ఎస్సై దగ్గర ఒక ఫైల్‌ తీసుకుని వెళ్లిపోతుంది. మరోవైపు అదే కమిషనర్‌ సత్యప్రసాద్‌, సుధాకర్‌ ఇంటికి వచ్చి తన కొడుక్కి సుధాకర్‌ కూతురుని ఇవ్వమని అడుగుతాడు. అదే టైంలో డీటెయిల్స్‌ తీసుకుని ఇంటికి వస్తారు కేదార్‌, ధాత్రి. ఇంట్లో కమీషనర్‌ సత్యప్రసాద్‌ను చూసి షాక్‌ అవుతారు.

ధాత్రి: అతను..?

కేదార్: కమిషనర్‌..

ధాత్రి: మా అమ్మను నమ్మించి మోసం చేసి చంపి. మా అమ్మ నిజాయితీని అమ్ముకున్న నీచుడు కేదార్‌ అతడు. అతన్ని వదిలిపెట్టను.

యువరాజ్‌: మధు మీకు నచ్చింది. సూర్య మాకు నచ్చాడు. మంచిరోజు చూసి ఎంగేజ్‌మెంట్‌ ఫిక్స్‌ చేద్దాం అంకుల్‌.

సత్యప్రసాద్‌: ఓరేయ్‌..  అబ్బాయి తిరిగి మళ్లీ అమెరికా వెళ్లే లోపు పెళ్లి చేసేసి అమ్మాయిని కూడా అబ్బాయితో పంపించేద్దాం అనుకుంటున్నాం రా.. నువ్వేమంటావు.

సుధాకర్‌: సరేరా అలాగే కానిద్దాం..

వైజయంతి: కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆపలేము అన్నయ్యగారు. పెళ్లి అనుకుంటున్నాం.. అప్పుడే జరిగిపోతుంది.

సుధాకర్‌: అరేయ్‌ మన ఇన్నేళ్ల స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా. రేయ్‌ వెంటనే నిశ్చితార్థం పెళ్లి రెండు పెట్టేసుకుందాం.

 అనుకుని అందరూ హ్యాపీగా ఉంటారు. ధాత్రి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అనుకుని లోపలికి వెళ్లి అందరూ అనుకోవడం కాదు. మాధురికి కూడా పెళ్లి ఇష్టమో కాదో తెలుసుకోండి వదిన. అనగానే కౌషికి అవును కదా అంటుంది. ఇంతలో వైజయంతి, యువరాజ్‌, నిషిక ధాత్రిని తిడతారు. సుధాకర్‌, ధాత్రి అన్నదాంట్లో తప్పేముందని మాధురిని అడుగుతాడు. మాధురి ఇష్టమేనని వెళ్లిపోతుంది. కమీషనర్‌కు ధాత్రి, కావ్య కూతురు అన్న విషయం తెలియడంతో కమీషనర్‌ షాక్‌ అవుతాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ధాత్రి, కేదార్‌ ఆలోచిస్తుంటారు.

కేదార్‌: అసలు కళ్ల ముందు జరుగుతుంది. కలో నిజమో తెలియడం లేదు ధాత్రి, మనం వెతుకుతున్న కమీషనర్‌ మన ఇంట్లో కనిపించడం ఏంటి? నాన్న ఆయనతో వియ్యం అందుకోవడం ఏంటి?

ధాత్రి: అదే నాకు అర్థం కావడం లేదు కేదార్‌. మా అమ్మా చావుకు కారణమైన కమీషనర్ మన ఇంటికే పిల్లను అడగడానికి వచ్చాడంటే.. అసలు నమ్మలేకపోతున్నాను.

కేదార్‌: నాకు తెలిసి ఆ ఫైల్‌ ఇప్పటికీ సత్యప్రసాద్‌ దగ్గరే ఉండి ఉండొచ్చు.

ధాత్రి: అవును కేదార్‌ అందుకే అంత భయపడ్డాడు. వదలను ఆ సత్యప్రసాద్‌ను మా అమ్మను చంపిన ఏ ఒక్కరిని వదలను. నేను పగ తీర్చుకునేది మా అమ్మ ప్రాణం తీశారని కాదు. మా అమ్మ పరువు తీసినందుకు.

కేదార్‌: అత్తయ్యా చావులో కూడా నిజాయితీ ఉంది కాబట్టి ఆ దేవుడు ఇన్నాళ్ల తర్వాత కూడా నిజాన్ని కళ్ల ముందకు తీసుకొచ్చి నిల్చోబెట్టాడు. కానీ మనకు ఆ నిజం నిరూపించడానికి ఎక్కువ సమయం లేదు.

 అని ఇద్దరూ మాట్లాడుకుని సత్యప్రసాద్‌ దుర్మార్గాలను ఆధారాలతో సహా నిరూపించి ఇంట్లో వాళ్లను నమ్మించి.. మధు పెళ్లి ఆపాలని అలాగే సత్యప్రసాద్‌కు శిక్ష పడేలా చేయాలని ప్లాన్‌ చేస్తారు. మరోవైపు మీనన్‌, కమలాకర్‌కు ఫోన్‌ చేసి గన్స్‌ త్వరగా డెలివరీ చేయాలని రేపు గన్స్‌ ఫికప్‌కు నేనే వస్తానని చెప్తాడు. యువరాజ్‌, కమలాకర్‌ సరే అంటారు. తర్వాత ధాత్రి వాళ్ల నాన్నమ్మ సుబ్బు వస్తుంది. యువరాజ్‌ వచ్చాడని తెలిసి చూడ్డానికి వచ్చానని చెప్తుంది. అలాగే కేదార్‌, ధాత్రి పెళ్లి అనుకోకుండా జరిగిపోయిందని అందర్ని పిలిచి ఒక రిసెప్షన్‌ పెడిత బాగుంటుందని సుబ్బు చెప్తుంది. కౌషికి, సురేష్‌ మంచి మాట చెప్పారని అంటారు. వైజయంతి, నిషిక, యువరాజ్‌ ఇంట్లో రిసెప్షన్‌ జరగనివ్వమని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ప్రకృతి మధ్యలో మత్తు కళ్లతో మాయ చేస్తున్న ఈషా రెబ్బా - ఆమెను ఇలా చూసి అబ్బా అంటున్న కుర్రకారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: వారసుడి కోసం విహారి చేయాల్సిన పరిష్కారమేంటి? సహస్ర, లక్ష్మీల డెలివరీలు జరుగుతాయా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: వారసుడి కోసం విహారి చేయాల్సిన పరిష్కారమేంటి? సహస్ర, లక్ష్మీల డెలివరీలు జరుగుతాయా!
Godavari Serial Today May 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం చెల్లినే ఎదురించిన సింహాద్రి! మురళీ, నందుల నిశ్చితార్థం జరుగుతుందా!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం చెల్లినే ఎదురించిన సింహాద్రి! మురళీ, నందుల నిశ్చితార్థం జరుగుతుందా!
Karthika Deepam 2 Serial Today May 18th: కార్తీకదీపం సీరియల్: దీప, కార్తీక్‌లను విడదీసేసిన జ్యోత్స్న! 2 వారాలు జ్యో, దీపలకు కొత్త బాధ్యతలు!
కార్తీకదీపం సీరియల్: దీప, కార్తీక్‌లను విడదీసేసిన జ్యోత్స్న! 2 వారాలు జ్యో, దీపలకు కొత్త బాధ్యతలు!
Nindu Manasulu Serial Today May 18th: నిండు మనసులు: ప్రేరణ నా భార్య అంటూ గణకి అదిరిపోయే షాక్ ఇచ్చిన సిద్ధూ! తండ్రి మోసం తేల్చాసిందేనన్న ప్రేరణ!
నిండు మనసులు: ప్రేరణ నా భార్య అంటూ గణకి అదిరిపోయే షాక్ ఇచ్చిన సిద్ధూ! తండ్రి మోసం తేల్చాసిందేనన్న ప్రేరణ!

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Rakshana Sena: తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
Dollar vs Indian Rupee: డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
Supreme Court: హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
Viral News: చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
India Hottest Cities: భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!
భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!
Indian Student Dies In US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Embed widget