(Source: ECI/ABP News/ABP Majha)
Jagadhatri Serial Today August 10th: ‘జగధాత్రి’ సీరియల్: సత్యప్రసాద్ ను ఎంక్వైరీకి తీసుకెళ్లిన జేడీ – ధాత్రికి సపోర్ట్ చేసిన సుధాకర్
Jagadhatri Today Episode: వజ్రపాటి ఇంట్లో ఉన్న సత్య ప్రసాద్ ను జేడీ, కేడీ వచ్చి ఎంక్వైరీకి తీసుకెళ్లడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: సత్యప్రసాద్‌ను ఎంక్వైరీ చేయాలని తీసుకెళ్లడానికి వజ్రపాటి ఇంటికి వస్తారు జేడీ, కేదార్. సత్యప్రసాద్ రానని మొండికేస్తాడు. నాతో పెట్టుకుంటే మీ ఉద్యోగాలు ఊడిపోతాయని బెదిరిస్తాడు. నేను ఎంతో మందిని తొక్కి ఈ స్థాయికి వచ్చానని మీరేం చేయలేరని అంటాడు. దీంతో బలవంతంగా సత్యప్రసాద్‌ను స్టేషన్‌కు తీసుకుని వస్తారు.
సత్యప్రసాద్: నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టగానే గెలిచారని అనుకుంటున్నారా? అయినా మీరేంటి చేయడానికి పని, సాల్వ్ చేయడానికి కేసులేం లేవా? ఎప్పుడో ముగిసిపోయిన కేసు తీసుకొచ్చారు. కావ్య మొదట్లో బాగానే ఉండేది. తర్వాత అండర్ వరల్డ్‌తో చేతులు కలిపింది. చివరికి వారి చేతుల్లోనే చచ్చింది.
ధాత్రి: ఓరేయ్.. చంపేస్తాను. ఇంకోసారి కావ్య గారి గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను సత్యప్రసాద్ గారు. నాకు కావాల్సింది మీరు ప్రపంచానికి చెప్పిన అబద్దం కాదు. ప్రపంచం తెలుసుకోవాల్సిన నిజం. అంతవరకు మిమ్మల్ని వదలను.
కేదార్: కావ్య గారు చనిపోయిన రోజు అక్కడ ఏం జరిగింది. కావ్య గారు ఎలా చనిపోయారు.
ధాత్రి: కావ్య గారి మర్డర్ జరిగినప్పుడు డ్యూటీలో ఉన్న ఎస్సై ఇచ్చిన స్టేట్‌మెంట్. మీరు అప్పుడు ప్రెస్ మీట్ లో చెప్పిందేమో మీరు అక్కడికి వెళ్లే సరికే కావ్య గారు చనిపోయారని చెప్పారు. మరి ఆయనేంటి కావ్య గారు అర్జెంట్‌గా మిమ్మల్ని కలవడానికి వచ్చారని చెప్పారు.
కేదార్: ఇవన్నీ మీనన్ కేసుకు సంబంధించిన ఫైల్స్. అన్ని మీరే క్లోజ్ చేశారు. అన్ని మీనన్‌కు సంబంధం లేదని ఎవరో చోటా క్రిమినల్స్ ను కేసులో ఇరికించి కేసు క్లోజ్ చేశారు. ఎందుకు?
సాధు: మొత్తానికి వాడితో నీళ్లు తాగించావు జేడీ
ధాత్రి: మీనన్ విషయంలో మీకు ఇన్ని కో ఇన్సిడెంట్స్. ఏటి? మీరు ఫోన్ చేసిన కొద్ది సేపట్లోనే కావ్య గారు ఎందుకు మీనన్ చేతిలో చనిపోయారు?
అంటూ ధాత్రి, కేదార్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే సత్యప్రసాద్ భయపడతాడు. ఇంతలో సాధుకు హోం మినిస్టర్ ఫోన్ చేసి సత్యప్రసాద్‌ను వెంటనే వదిలిపెట్టమని చెప్తాడు. దీంతో ధాత్రి, కేదార్ షాక్ అవుతారు. సత్యప్రసాద్ వెళ్తూ జేడీకి వార్నింగ్ ఇస్తాడు. దీంతో సాధు కూడా సత్యప్రసాద్‌కు వార్నింగ్ ఇస్తాడు. అయితే హోం మినిస్టర్ తో మీకు ఫోన్ చేయించింది ఎవరు సార్ అని అడగ్గానే కౌషికి చేయించిందని సాధు చెప్తాడు. మరోవైపు వజ్రపాటి ఇంట్లో అందరూ బాధపడుతుంటారు.
వైజయంతి: పోయింది.. ఇవాళ్టితో ఈ ఇంటికి ఉన్న మర్యాద అంతా పోయింది.
మధు: అమ్మా ఎవరికీ ఏమీ తెలియదు. నువ్వు ముందు ఆ ఏడుపు ఆపు.
నిషిక: ఎప్పుడూ మా వదిన మా వదిన అని దాని తొక పట్టుకుని తిరుగుతావు కదా? ఇప్పటికైనా దాని నిజస్వరూపం తెలిసిందా?
వైజయంతి: నా కొడుకు కంపెనీ లాగేసుకున్నారు. ఇప్పుడు నా బిడ్డ పెళ్లి చెడగొడుతున్నారు.
యువరాజ్: అమ్మా.. అక్క హోం మినిస్టర్ తో మాట్లాడి ప్రసాద్ అంకుల్ ను తీసుకురావడానికి వెళ్లింది కదా?
అని చెప్తుండగానే ఇంతలో కౌషికి వస్తుంది. ఏమైందని అడుగుతారు. హోం మినిస్టర్ గారితో మాట్లాడితే ప్రసాద్ అంకుల్‌ను వదిలేశారని ఆయన ఇంటికి వెళ్లిపోయారని చెప్తుంది. ఇంతలో ధాత్రి, కేదార్ వస్తుంటే నిషిక వాళ్లను ఆగండి అని తిడుతుంది. దీంతో మా అమ్మ ఏ తప్పు చేయలేదు. అని నిరూపించుకునే సాక్ష్యం దొరికింది. అది కూడా ఆయన దగ్గర ఉంది అది ఆయన ఇచ్చే వరకు నేను కేసు వాపసు తీసుకోను అంటుంది ధాత్రి. ఇంతలో సుధాకర్ కూడా ధాత్రిని సపోర్టు చేస్తాడు. ధాత్రి చెప్పింది నిజమే అయితే మాధురి ఆ ఇంటికి వెళితే సుఖంగా ఉంటుందా? అంటూ చెప్పగానే కౌషికి కూడా నిజానిజాలు తెలిశాక మాధురి పెళ్లి గురించి మాట్లాడుకుందాం అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: చీరలో ఎంత బావున్నారు మేడం..డిప్యూటీ సీఎం తాలూక కదా ఇలా నిండుగా కనిపించండి అంటున్న ఫ్యాన్స్!