Jagadhatri Serial Today April 23th:మీనన్ బతికే ఉన్నాడని జేడీ ఎలా నిరూపించింది..? డ్రాగన్‌సాయంతో మీనన్‌ను ఎలా పట్టించింది..?
Jagadhatri Serial Today Episode April 23th: మీనన్ బతికే ఉన్నాడని జేడీ ఎలా నిరూపించింది..? డ్రాగన్‌సాయంతో మీనన్‌ను ఎలా పట్టించింది..?

Jagadhatri Serial Today Episode: మీనన్ ఆటకట్టించేందుకు జేడీ,కేడీ ఇద్దరూ సిద్ధమవుతారు. ఆ ఇంట్లో ఉన్నది పుల్లయ్యకాదని మీనన్ అని నిరూపించేందుకు ప్లాన్ వేస్తారు. ఓ పెట్టెలో పామును తీసుకెళ్లి మీనన్ అది బయటకు తీసేలా రెచ్చగొడతారు. దీంతో పామున మీనన్ భయటకు తీయగానే అది కాటువేస్తుంది. తనను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని....నేనే మీనన్ అని ఒప్పుకుంటానని చెబుతాడు. దీంతో డ్రాగన్ సాయంతో మీనన్‌ను జేడీ ఆస్పత్రికి తీసుకెళ్తుంది.విషం శరీరమంతా ఎక్కుతుందని భయపడి ప్రాణాలు కాపాడుకునేందుకు మీనన్ చాలా గట్టిగా అరుస్తుంటాడు. అప్పుడే అక్కడ జేడీ,కేడీ డాక్టర్‌తో మాట్లాడుతుంటారు. వాడిని కరిచిన పాముకు అసలు విషంలేదని....కేవలం ఇది నాటకమని చెబుతారు. కానీ మీరు మాత్రం విషం ఉందని చెప్పి వాడిని భయపెట్టాలని అంటారు. ఇదంతా విన్న డ్రాగన్ వెళ్లి మీనన్‌కు చెప్పి ఇక్కడి నుంచి పారిపోదామని చెబుతుంది. దీంతో డ్రాగన్‌ను తీసుకుని మీనన్ పారిపోతుంటాడు. ఆ విషయం చూసిన జేడీ, కేడీ వెంటపడి మీనన్‌ను కాల్చేందుకు ప్రయత్నించగా డ్రాగన్ అడ్డుపడుతుంది. మీనన్‌ను చంపాలంటే ముందు నన్ను చంపాలని అంటుంది.ఆమాటలు విన్న జేడీకి ఏం అర్థంకాదు...డ్రాగన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందని అనుకుంటాడు. ఇంతలో మీనన్ డ్రాగన్‌ను అడ్డుపెట్టుకుని తన మనుషులు కారు తీసుకుని రాగా....అందులో పారిపోతాడు. డ్రాగన్ కారు ఎక్కేందుకు ప్రయత్నించగా అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. మోసపోయానని గ్రహించిన డ్రాగన్ మీనన్‌పై పగపడుతుంది.
మరిన్ని ఆసక్తికరమైన వెబ్‌స్టోరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
అసలు ఇందంతా ఎందుకు చేశావని జేడీ డ్రాగన్‌ను నిలదీస్తుంది. మీరు రాకముందు మీనన్ నా దగ్గరకు వచ్చాడని మీతో కలిసి పనిచేస్తే చిల్లర తప్ప ఏమీ రాదని చెప్పాడని చెబుతుంది. అదే తనను పెళ్లిచేసుకుంటే కోట్లరూపాయల ఆస్తివస్తుందని ...మీడియా ముందుకు వచ్చి తాను అసలు మీనన్ భార్యనే కాదని అదంతా మీరు ఆడించిన నాటకమని చెప్పమన్నాడని చెబుతుంది.మీరు నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిన తర్వాత బెయిల్‌పై విడిపించి దుబాయ్ పంపిస్తానన్నాడని వివరిస్తుంది. అలా నమ్మించి నా మెడలో తాళి కట్టాడని చెబుతుంది. అయినా ఆ క్రిమినల్‌గాడి మాటలు నువ్వుఎలా నమ్మావని జేడీ మండిపడుతుంది.అప్పుడే డ్రాగన్ మీనన్‌కు ఫోన్ చేయగా....తనను అవమానించేలా మాట్లాడటంతో డ్రాగన్‌కు కోపం నషాలానికి ఎక్కుతుంది. దీంతో ఆ మీనన్‌ను పట్టుకునేందుకు మీరు ఏం చెప్పినా చేస్తానని మాట ఇస్తుంది. అయితే ఆ మీనన్‌ను బయటకు రప్పించేందుకు మంచి ప్లాన్ ఉందని చెప్పి డ్రాగన్‌ను తీసుకుని వెళ్తుంది.
మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఈ లింక్‌ను ఫాలో అవ్వండి
సాధుసార్ దగ్గరకు వెళ్లి ఇవన్నీ మీనన్ అక్రమంగా సంపాదించిన ఆస్తులకు సంబంధించిన పేపర్లని కొన్ని బ్యాగుల్లో ఉన్నపేపర్లు చూపిస్తుంది. ఇవన్నీ మినిస్టర్‌లకు బినామీగా ఉన్న మీనన్ ఆస్తులని ఇవి బయటపడితే వాళ్ల జీవితాలు భయటపడతాయని చెబుతుంది.కాబట్టి వీటిని ఈ డ్రాగన్ సాయంతో అనాథ ఆశ్రమాలకు పంచిపెడుతున్నట్లు చెబుదామని అప్పుడు మీనన్ బయటకు రాక తప్పదని జేడీ అంటుంది.మరి ఈ పేపర్లు ఎక్కడివని అడిగితే...ఇవన్నీ నకిలీ పేపర్లని అంటుంది.కానీ మీనన్ ఇవన్నీ నిజమైనవే అనుకుని వస్తాడని చెబుతుంది.దీనికి సాధు ఓకే చెప్పడంతో జేడీ మీడియాను పిలిచి ప్రెస్‌మీట్ పెట్టిస్తుంది. అదంతా నిజమే అనుకుని మీనన్ రావడం మీడియా చూడటం జరిగిపోతాయి.చనిపోయిన మీనన్ ఎలా బతికి వచ్చాడని ప్రశ్నించగా...అసలు ఇతను మీనన్ కాదని ఆ వేషంలో ఉన్నవాడని కేదార్ చెబుతాడు. మీనన్ పేరు చెప్పి దందాలు చేయడానికి వచ్చాడని చెబుతాడు.
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు






















