Jagadhatri Serial Today April 22th:మినిస్టర్‌పై జేడీ,కేడీ ఎందుకు చేయిచేసుకున్నారు...? ఏ కేసులో మినిస్టర్ కొడుకును అరెస్ట్‌చేశారు..?
Jagadhatri Serial Today Episode April 22th: మినిస్టర్‌పై జేడీ,కేడీ ఎందుకు చేయిచేసుకున్నారు...? ఏ కేసులో మినిస్టర్ కొడుకును అరెస్ట్‌చేశారు..?

Jagadhatri Serial Today Episode: మినిస్టర్ కొడుకు యాక్సిడెంట్ కేసులో పోలీసులకు లొంగిపోయిన డ్రైవర్ సూరిని ఇంటరాగేషన్ చేయడానికి జేడీ,కేడీ బయటకు తీసుకెళ్తారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది.ఎటు నుంచి కారువచ్చి ఢీకొట్టిందో అడుగుతారు.అసలు ఆ యాక్సిడెంట్ చేయని సూరి తనకు ఏం చెప్పాలో అర్థంగాక....ఈ యాక్సిడెంట్ నేనే చేశానని అరెస్ట్ చేయడంటూ పిచ్చిపిచ్చిగా అరుస్తుంటాడు. నిన్ను అరెస్ట్ చేయాలంటే నువ్వు తప్పు ఎలా చేశావో తెలుసుకోవాలి కదా అని జేడీ అంటుంది. నువ్వు ఎటు నుంచి ఎటు వస్తుంటే కారు ఢీకొట్టిందో చెప్పాలని అంటుంది. ఇదంతా నాకు తెలియదని మా లాయర్‌తో మాట్లాడుకోమని చెబుతాడు. ఇప్పుడు నువ్వు ఈకేసు మీద వేసుకున్నావంటే.....ఖచ్చితంగా బయటకు రాలేవని జేడీ సూరిని హెచ్చరిస్తుంది. డబ్బులు కోసం ఆశపడితే జీవితాంతం జైలులోనే ఉండాల్సి ఉంటుందని చెబుతుంది. నువ్వు ఎన్ని చెప్పినా ఈ యాక్సిడెంట్ మినిస్టర్ కొడుకు చేశాడని మాకు తెలుసని....వాడిని ఎలాగూ అరెస్ట్ చేస్తామని కేడీ అంటాడు.అప్పుడు అలాంటి వాళ్లకు సహకరించిన నీకు కూడా జైలుశిక్ష తప్పదని అంటాడు. మర్యాదగా అప్రూవర్‌గా మారిపోయి మాకు సహకరిస్తే నీకు శిక్ష పడకుండా చూస్తామని చెబుతాడు. అయినా సరే సూరి మాట వినకపోవడంతో పక్కనే వచ్చి కానిస్టేబుల్ వీడితో మాటలు ఏంటి మేడం కాల్చిపడేద్దామని గన్ తీస్తాడు.
జేడీ తనను ఎన్‌కౌంటర్ చేస్తుందేమోనని భయపడి సూరి అక్కడి నుంచి పరుగెత్తుతాడు. వాడి వెనక జేడీ,కేడీ ఇద్దరూ పరుగులు తీస్తారు. మర్యాదగా లొంగిపోకుంటే కాల్చిపడేస్తామని కేదార్ హెచ్చరిస్తాడు.ఇంతలో సూరి పారిపోతూ కొంతదూరం వెళ్లిన తర్వాత రోడ్డుపక్కన పడిపోతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన జేడీ,కేడీ....రేప్‌కు గురై చనిపోయిన అమ్మాయి బాడీ చూస్తారు. వెంటనే ఆమె బాడీపై వస్త్రం కప్పి స్టేషన్‌కు చెప్పమని కానిస్టేబుల్‌కు చెబుతుంది. నా అనుమానమే నిజమైందని...కేవలం యాక్సిడెంట్ కేసు అయితే మినిస్టర్ ఇంత కంగారుపడేవాడు కాదని....ఖచ్చితంగా వాళ్లు ఈ అమ్మాయిని రేప్ చేసి పారిపోతూ యాక్సిడెంట్ చేసి ఉంటారని అంటుంది. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే ఈ అమ్మాయిని రేప్ చేసింది కూడా నువ్వేనని కేసు పెట్టాల్సి ఉంటుందని జేడీ హెచ్చరిస్తుంది. దీంతో సూరి భయపడిపోయి ఈరేప్‌కు,ఆ యాక్సిడెంట్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదని ఒప్పుకుంటాడు.మినిస్టర్ డబ్బులు ఇస్తానంటే ఈ పనికి ఒప్పుకున్నానని చెబుతాడు.
మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఈ లింక్‌ను ఫాలో అవ్వండి
జేడీకి అసలు విషయం తెలిసిపోయిందని తెలుసుకున్న మినిస్టర్ కొడుకును దుబాయ్ పారిపోమ్మని పంపిస్తుంటాడు.అప్పుడే అక్కడికి జేడీ,కేడీ ఇద్దరూ వచ్చి మినిస్టర్ కొడుకుని కొట్టి అరెస్ట్ చేస్తారు.తాను అధికారపార్టీ మనిషినని నాతో పెట్టుకోవద్దని మినిస్టర్ హెచ్చరించినా లెక్కచేయకుండా జేడీ వాడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తుంది.ఇంతలో సాధూవద్దకు వచ్చిన మినిస్టర్ మర్యాదగా నా కొడుకుని వదిలిపెట్టమని...లేకుండా మీ అంతు చూస్తానని చెబుతాడు. నిజంగా మీ అబ్బాయి ఎలాంటి తప్పు చేయకపోతే వాడే రెండురోజుల్లో బయటకు వచ్చేస్తాడని సాధూ చెబుతాడు.ఎఫ్‌ఐఆర్ కూడా రాసేశారని ఇప్పుడు నేను ఏం చేయలేనని చెబుతాడు. దీంతో మినిష్టర్ కోపంతో అరవడంతో జేడీ కూడా గట్టిగా సమాధానమిస్తుంది. ఆ కోపంలో మినిస్టర్ సాధు మీద చేయిచేసుకుంటాడు. ఇప్పుడు అనవసరంగా గొడవ చేస్తే....మీ అబ్బాయి మరింత ఇరుక్కుంటాడని సాధు హెచ్చరిస్తాడు. డ్రైవర్ అప్రూవర్‌గా మారిపోయాడని,మీవాడు తప్పు చేసినట్లు సాక్ష్యాలు ఉన్నాయని చెబుతాడు.ఇంతకు మించి గొడవ చేస్తే మీ పదవి కూడా ఊడుతుందని హెచ్చరిస్తాడు. దీంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోగా...జేడీ,కేడీ మినిస్టర్ కారుకు అడ్డుతగిలి ముఖాలకు మాస్కులు పెట్టుకుని సాధూసార్‌పై చేయిచేసుకున్నందుకు బదులు తీర్చుకుంటారు.
మరిన్ని ఆసక్తికరమైన వెబ్‌స్టోరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు






















