News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Kevvu Karthik Marriage : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కెవ్వు కార్తిక్, అమ్మాయి ఎవరంటే?

జబర్దస్త్ కమెడియన్స్ ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. త్వరలో ఈ లిస్టులో చేరబోతున్నాడు కెవ్వు కార్తిక్. సిరి అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు.

FOLLOW US: 
Share:

బుల్లితెరపై ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది ‘జబర్దస్త్’ కామెడీ షో. ఈ షో ద్వారా ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు ప్రపంచానికి పరిచయం అయ్యారు. చక్కటి కామెడీ టైమింగ్స్ తో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. ప్రస్తుతం ఈ షో కమెడియన్స్ అంతా బాగానే సెటిల్ అయ్యారు. కొంత మంది ఇప్పటికే కొత్త ఇండ్లు కొనుక్కోవడంతో పాటు పెళ్లి చేసుకుని హ్యాపీగా జాలీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మరో టీమ్ లీడర్ మూడు ముళ్ల బంధంతో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇంతకీ తను ఎవరో కాదు కెవ్వు కార్తిక్.

కార్తిక్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?

తన పెళ్లి గురించి కెవ్వు కార్తిక్ స్వయంగా వెల్లడించాడు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని చెప్పాడు. తాజాగా తనతో కలిసి దిగిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేశాడు. అమ్మాయి పేరు సిరి అని మాత్రమే చెప్పాడు. మిగతా వివరాలు ఏవీ బయటకు వెల్లడించలేదు. “పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని విన్నాను. కానీ. ఆ సమయంలో అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది. రెండు భిన్నమైన ఆత్మలు, భిన్నమైన జీవితాలు, భిన్నమైన అభిప్రాయాలు, విభిన్న ప్రపంచాలు, జీవిత ప్రయాణ పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఒకే హృదయంగా మారుతున్నాయి. నా జీవితానికి స్వాగతం సిరి” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు. అంతకు ముందు పోస్టులో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పిన కెవ్వు కార్తిక్. అమ్మాయితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. కానీ, ఆమె ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ ఫోటోలు షేర్ చేస్తూ “మన లైఫ్ లోకి ఒక కొత్త వ్యక్తి వస్తే, జీవితం మరింత అందంగా, హ్యాపీగా ఉంటుందని కొందరు చెప్పారు. బహుశా అది ఇదేనేమో” అంటూ రాసుకు వచ్చాడు. తన జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు థాంక్స్ అని చెబుతూనే,  నీతో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు.   

View this post on Instagram
 
A post shared by Kevvu Kartheek (@kevvukartheek)

ఉద్యోగానికి రాజీనామా చేసి, మిమిక్రీ ఆర్టిస్టుగా మారిన కార్తిక్

ఇక కెవ్వు కార్తిక్ గురించి చెప్పాలంటే,  సాధారణ కంటెస్టెంట్ గా ‘జబర్దస్త్’ షోలోకి అడుగు పెట్టి, చక్కటి కామెడీతో  టీమ్ లీడర్ గా ఎదిగాడు. తనదైన మార్క్ పంచులతో అందరినీ అలరిస్తాడు. ఎలాంటి డబుల్ మీనింగ్ పంచులు లేకుండా చక్కటి కామెడీతో కడుపుబ్బా నవ్విస్తాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన  కార్తిక్,  అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఓవైపు ఇంజనీరింగ్‌ చదువుతూనే, మిమిక్రీలో డిప్లొమా పూర్తి చేశాడు. ఎంటెక్‌ కంప్లీట్ చేసి ఉద్యోగం సంపాదించాడు. కానీ, తనకు మిమిక్రీ, కామెడీ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే ఉద్యోగాన్ని వదిలి, హైదరాబాద్‌ వచ్చి మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజీ షోలు చేశాడు. ఆ తర్వాత ‘కామెడీ క్లబ్‌’, ‘జబర్దస్త్‌’ షోలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఆ తర్వాత విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పటికే అమెరికా,  ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, న్యూజిలాండ్, దుబాయ్ సహా పలు దేశాల్లో స్టేజి షోలు ఇచ్చాడు. ప్రస్తుతం ‘జబర్దస్త్’ కామెడీ షోలో టీమ్ లీడర్ గా కొనసాగుతున్నాడు.

Read Also: ‘బింబిసార 2’ నుంచి తప్పుకున్న వశిష్ఠ్, కొత్త దర్శకుడు ఎవరో తెలుసా?

Published at : 04 Jun 2023 09:46 AM (IST) Tags: Jabardasth comedian Karthik Kevvu Karthik Kevvu Karthik wedding Kevvu Karthik wif pics Kevvu Karthik wife Siri

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

బెదరగొట్టిన ‘యానిమల్’, రామ్ ‘స్కంద’.. ‘చంద్రముఖి-2’ ఎలా ఉన్నాయ్? ఇవీ ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలు

బెదరగొట్టిన ‘యానిమల్’, రామ్ ‘స్కంద’.. ‘చంద్రముఖి-2’ ఎలా ఉన్నాయ్? ఇవీ ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలు

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ గౌతమ్ మెడపై గాయాలు - తేజను తిట్టిపోస్తున్న ప్రేక్షకులు

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ గౌతమ్ మెడపై గాయాలు - తేజను తిట్టిపోస్తున్న ప్రేక్షకులు

Bigg Boss Season 7 Latest Promo: ఓరి వీరి వేషాలో, చూస్తుంటునే డోకు వస్తోందిగా - వింత అవతారాల్లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు, దెయ్యం పిల్లగా ప్రియాంక!

Bigg Boss Season 7 Latest Promo: ఓరి వీరి వేషాలో, చూస్తుంటునే డోకు వస్తోందిగా - వింత అవతారాల్లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు, దెయ్యం పిల్లగా ప్రియాంక!

Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!

Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది