అన్వేషించండి

Jabardasth Comedian Appa Rao: ‘జ‌బ‌ర్ద‌స్త్’ నుంచి వ‌చ్చేస్తుంటే నన్నెవరూ ఆపలేదు, బుల్లెట్ భాస్కర్‌ను చూస్తే ఎవ్వరూ నవ్వరు: అప్పారావు

Appa Rao: జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా ఎంతోమంది సెల‌బ్రిటీలు అయ్యారు. అలా పేరు తెచ్చుకున్న వ్య‌క్తి అప్పారావు. ఆసమ్ అప్పి పేరుతో టీమ్ లీడ‌ర్ గా కూడా చేశారు. ఒక్క‌సారిగా షో నుంచి బ‌య‌టికి వ‌చ్చేశారు.

Jabardasth Comedian Appa Rao Comments: ఆస‌మ్ అప్పి ఉర‌ఫ్ అప్పారావు. ‘జ‌బ‌ర్ద‌స్త్’ అనే ఒక కామెడీ షో ద్వారా సెల‌బ్రిటీ అయ్యారు ఆయన‌. 'V..A..D..I..N..A.. వ‌దిన‌', 'B..A..V..A..' లాంటి డైలాగులు చెప్పి ఫేమ‌స్ అయ్యారు ఆయ‌న‌. వివిధ టీమ్స్ లో చేసి ఒక్క‌సారిగా షో నుంచి బ‌య‌టికి వ‌చ్చేశారు. అయితే, అస‌లు ఆయ‌న ఎందుకు బ‌య‌టికి వ‌చ్చారు? వ‌చ్చేయాల్సిన కార‌ణాలు ఏంటి? టీమ్ లీడ‌ర్ గా ఎందుకు తీసేశారు? వ‌చ్చేట‌ప్పుడు ఆయ‌న ఎలాంటి సంఘ‌ట‌న‌లు ఎదుర్కొన్నారు అనే విష‌యాలు ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పారు. 

టీమ్ లీడ‌ర్ గా ఎందుకు మానేశారు? బుల్లెట్ భాస్క‌ర్ తో ఎందుకు క‌లిశారు? 

బుల్లెట్ భాస్క‌ర్ కంటే ముందు న‌న్ను పంచ్ ప్ర‌సాద్ తో క‌లిపారు. ఆస‌మ్ అప్పీ - పంచ్ ప్ర‌సాద్ టీమ్ అని వ‌చ్చేది. ఆ త‌ర్వాత బుల్లెట్ భాస్క‌ర్ తో క‌లిపారు. సోలో టీమ్ లో చేస్తున్న‌ప్పుడు నాలో హైప‌ర్ టెన్ష‌న్ వ‌చ్చిన‌ట్లు గ‌మ‌నించారు మా డైరెక్ట‌ర్స్. వాళ్లు "అప్పారావు గారు.. మీకున్న ఏజ్ ఫ్యాక్ట‌ర్స్ కి మీరు ఈ టెన్ష‌న్ తీసుకోలేరు" అన్నారు. దాంతో నేను కూడా ఓకే చెప్పాను. ఆ త‌ర్వాత తీసుకెళ్లి చంటి టీమ్ లో క‌లిపారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ బుల్లెట్ భాస్క‌ర్ టీమ్ లో అన్నారు. కొన్ని రోజులు చేశాను. ఇక కొన్ని రోజుల‌కి నేను జ‌బ‌ర్ద‌స్త్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాను. 

ప్రాధాన్య‌త త‌గ్గిన‌ట్లు అనిపించింది నిజ‌మేనా? 

ష‌క‌ల‌క శంక‌ర్ ద‌గ్గ‌ర అతితక్కువ టైంలో పాపుల‌ర్ అయిపోయిన వ్య‌క్తిని. అంత గొప్ప ఎంక‌రేజ్ మెంట్ ఇచ్చారు. అంత పెద్ద క్యారెక్ట‌ర్ ఇచ్చారు. త‌ను సినిమాల్లోకి వెళ్లిపోయిన త‌ర్వాత ర‌చ్చ‌ర‌వి టీమ్ లో వేశారు. అక్క‌డ డ‌బుల్ పాపులారిటీ వ‌చ్చింది. వ‌దినా డైలాగ్, బావా డైలాగ్ లాంటివి మంచి పాపులారిటీ ఇచ్చాయి. దీంతో బ‌య‌ట ఈవెంట్స్ బాగా వ‌చ్చాయి. నెల‌కు 15 నుంచి 20 రోజులు ఔట్ డోర్ వెళ్లేవాడిని. ఆ త‌ర్వాత ర‌చ్చ‌రవి సినిమాల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఆయ‌న కూడా మానేశాడు.

ర‌చ్చ‌ర‌వి త‌ర్వాత పంచ్ ప్ర‌సాద్ టీమ్ లో వేశారు, కొన్నాళ్లు సోలోగా చేశాను. ఈ హైప‌ర్ టెన్ష‌న్ వ‌ల్ల మానేశాను. త‌ర్వాత బుల్లెట్ భాస్క‌ర్ దగ్గ‌ర ఫ‌స్ట్ లాక్ డౌన్ త‌ర్వాత స్కిట్స్ చేశాను. అప్పుడు క‌రోనా వ‌ల్ల ఏజ్ ఫ్యాక్ట‌ర్ వ‌ల్ల ఆగిపొమ‌న్నారు. దీంతో ఆగిపోయాను. హోల్డ్ లో పెట్టారు. మ‌ళ్లీ పిల‌వ‌లేదు. నేనే అడిగాను.. ర‌మ్మ‌న్నారు. అప్పుడు బుల్లెట్ భాస్క‌ర్ టీమ్ లో చేయ‌ను అని చెప్పాను. ఎందుకంటే ఒక సాధార‌ణ కంటెస్టెంట్ క‌న్నా నా క్యారెక్ట‌ర్ ప‌డిపోయింది. బుల్లెట్ భాస్క‌ర్ ఉన్న‌ప్పుడు కూడా నేనే హైలైట్ అయ్యేవాడిని. బుల్లెట్ భాస్క‌ర్ రాగానే ఎవ్వ‌రూ న‌వ్వ‌రు. ఎందుకంటే నా ఫేస్ లో కామెడీ ఉంటుంది. కానీ మంచి క్యారెక్ట‌ర్ ఇవ్వ‌లేదు. ఈ క్యారెక్ట‌ర్సే ఉన్నాయి అనేవాళ్లు. మ‌నం రాసుకునే స్క్రిప్ట్ క‌దా.. ఒక టీమ్ లీడ‌ర్ గా నాకు ఇంపార్టెంట్స్ ఇవ్వాలి క‌దా అన్నాను. కుద‌ర‌దు అన్నారు. దాంతో బుల్లెట్ భాస్క‌ర్ తో చేయ‌లేదు. 

మ‌రి ఎందుకు బ‌య‌టికి వ‌చ్చేశారు?  

బుల్లెట్ భాస్క‌ర్ ద‌గ్గ‌ర మానేసి వేరే టీమ్ లోకి వెళ్లాల‌ని అనుకున్నా. వేరే టీమ్ లో ఎక్క‌డైనా చేస్తాను.. కానీ, నాకు మేనేజ్ మెంట్ రెమ్యున‌రేష‌న్ ఇవ్వాలి అని చెప్పాను. అప్పుడు దాని గురించి మ‌ళ్లీ మాట్లాడ‌దాం అని చెప్పి రాకింగ్ రాకేశ్ టీమ్ లో వేశారు. మేనేజ్ మెంట్ డ‌బ్బులు ఇవ్వాల‌నే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టారు. నేను మ‌ళ్లీ రెమ్యున‌రేష‌న్ గురించి అడిగాను. "అప్పుడే డైరెక్ట‌ర్, రాకేశ్ ఇద్ద‌రు.. బాబాయ్ నువ్వు ముందు రా బాబాయ్ మేనేజ్ మెంట్ ఎంత ఇస్తారో ప‌క్క‌న పెట్టు" అని ఉంటే బాగుండేది. కానీ, "మేనేజ్ మెంట్ నాకు పెంచితే కానీ నేను ఏం చెప్ప‌లేను" అని అన్నాడు రాకేశ్. స‌రే అని.. స్కిట్‌కు 20 వేలు ఇవ్వాలని అడిగా. 10 వేల రూపాయ‌లు ఇచ్చినా ఉందాం అనుకున్నాను. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. అప్పుడు మేనేజ్ మెంట్ కి ఎన్‌వోసీ స‌ర్టిఫికెట్ కావాల‌ని మెసేజ్ పెట్టాను. కానీ, క‌నీసం ఏంటి? ఇబ్బంది ప‌డుతున్నారా? అని అడ‌గ‌లేదు. ఎన్‌వోసీ ఇచ్చేశారు. అంటే ఆవు పాలు ఇచ్చిన‌న్ని రోజులు ద‌గ్గ‌ర ఉంచుకుని, వొట్టిపోయింద‌ని ప‌డేయ‌కూడ‌దు క‌దా. అది నాకు బాధ అనిపించింది. అని అన్నాడు అప్పారావు. 

Also read: పవన్‌కు సపోర్ట్‌గా చిరంజీవి- గెలిపించాలని వీడియో సందేశం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
పవన్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
Mobile Phone Safety: ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Nitish Fabulous Century: నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
Embed widget