చియాసీడ్స్ కి పది రెట్లు ఎక్కువ నీళ్లు పీల్చుకునే సామర్థ్యం ఉంటుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రొటీన్, ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.. చియా సీడ్స్ ఉదయాన్నే తీసుకుంటే రోజంతా యాక్టివ్గా ఉంటారు. శక్తి విడుదల అవుతుంది. దీనిలో ఫైబర్ వల్ల కడుపు నిండుగా ఉండి క్యాలరీ ఇన్ టేక్ తగ్గుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. చియా సీడ్స్ నుంచి లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రొటీన్, ఫైబర్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. చియా సీడ్స్ లోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల నిరోధక వ్యవస్థ బలపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.