Illu Illalu Pillalu Serial Today September 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ పెళ్లిపై అనుమానాలు! ప్రేమ కల్యాణ్‌తో తప్పు చేసిందని తగిలించిన భాగ్యం!
Illu Illalu Pillalu Serial Today Episode Sep 23rd భాగ్యం భద్రావతిని పిలిచి ప్రేమ కల్యాణ్‌తో పెళ్లికి ముందే తప్పు చేసిందని రామరాజు ఫ్యామిలీ అంటున్నారని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ, కల్యాణ్‌ల ఫొటోలు రామరాజు చూసేస్తాడు. కల్యాణ్ రామరాజుకి కాల్ చేస్తాడు. నీ చిన్న కోడలు నేను లవర్ అని చెప్తాడు. ఇంతలో ధీరజ్ కల్యాణ్‌ని కొడతాడు. ఎవరు కల్యాణ్ అని వల్లి పుల్లలు పెట్టడానికి అడిగితే ఎవరు కాదులే మీరంతా లోపలికి వెళ్లండి అని రామరాజు పంపేసి భార్యని తీసుకొని బయటకు వెళ్తాడు.
ధీరజ్ కల్యాణ్‌ని చితక్కొడతాడు. కాలేజ్‌లో అందరికీ ప్రేమ ఫొటోలు పంపుతావా.. తనని బ్యాడ్ చేయాలి అని చూస్తావా అని చితక్కొడతాడు. కల్యాణ్ దెబ్బలు తిన్నా సరే నువ్వు నన్ను కొట్టినా చంపినా.. తనకి నేను వదలనురా నేను ప్రేమ ప్రేమించుకోవడం లేచిపోయిన విషయం మీ నాన్నని చెప్పానురా అని అంటాడు. మీ నాన్నకి ఇప్పటికే డౌట్ మొదలైందిరా.. ప్రేమ జీవితం రోడ్డున పడకుండా ఎలా కాపాడుతావురా అని అంటాడు.
సాగర్ నర్మదతో ధీరజ్ ప్రేమల పెళ్లి విషయం నీకు అమ్మకి తెలుసు అని నాకు అనిపిస్తుంది. నువ్వు, అమ్మ, ధీరజ్ పక్క ఊరు గుడికి వెళ్లి వచ్చిన తర్వాత ధీరజ్ పెళ్లి అయింది.. దీని వెనక నువ్వు అమ్మ ఉన్నావని అనిపిస్తుంది.. ధీరజ్ అబద్ధం చెప్తున్నాడని అనిపిస్తుంది అని సాగర్ అనుమానపడతాడు. ప్రేమ ధీరజ్‌ల పెళ్లి వెనక డౌట్ ఉంది.. వాళ్ల పెళ్లి వెనక ఏదో జరిగిందని అనిపిస్తుందని అంటాడు. ఎవరో ముక్కు ముఖం తెలియని వాడి మాటలు పట్టించుకోవడం ఏంటి సాగర్ ఈ విషయం వదిలేయ్ అని అంటుంది నర్మద.
ఇంట్లో మంట రేపేశానని వల్లి తెగ సంబరపడిపోతుంది. గదిలో చందు కూడా ఉండటంతో గెంతులేయలేకపోతుంది. ప్రేమ ఇంటికి వస్తే గట్టిగా అవుతుందని తనలోని శాడిజం మొత్తం బయటకు తీస్తుంది. ప్రేమని ఇరికించాలని తనకి సపోర్ట్ ఎవరో ఒకరు ఉండాలని తన భర్తకే ప్రేమ గురించి చెడుగా చెప్పాలని ఫిక్స్ అయిపోతుంది. భర్తతో ప్రేమ గురించి చెడుగా చెప్తుంది. పరాయి మగాడితో అలా ఫొటోలు తీసుకోవడం ఏంటి బా అంటే నిజం తెలుసుకోకుండా మాట్లాడకు అని అంటాడు. అంత చనువుగా ఉంది అంటే ఏదో ఉందని అంటే చందు అరుస్తూ ప్రేమని మేం చిన్నప్పుడు నుంచి చూస్తున్నాం.. తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని గడ్డి పెట్టి వెళ్లిపోతాడు.
వల్లి ఇంకా ఫోన్ చేయలేదు.. అక్కడేం జరిగిందో అని భాగ్యం తెలుసుకోవాలని కాలు కాలిన పిల్లలా తెగ ఆరాటపడిపోతుంది. ఇంతలో వల్లీ ఫోన్ చేస్తుంది. ప్రేమ ఇంకా ఇంటికి రాలేదని.. ఆ అబ్బాయి ప్రేమ ప్రేమించుకున్నారని నువ్వు చెప్పిన మాటే నిజం అయిందని విషయం మొత్తం చెప్తుంది. ఈ గంధరగోళాల సంగతి నేను తేల్చుతా అటు ధీరజ్, ఇటు కల్యాణ్ వాళ్ల సంగతి నేను తేల్చుతా ఎటు నుంచి తేల్చుకురావాలో అటు నుంచి తేల్చుకొని వస్తా కాసేపట్లో మీ ఇంట్లో సునామీ వస్తుందని అంటుంది.
రామరాజు వేదవతిని పిలిచి కల్యాణ్ కాల్ చేశాడని ప్రేమ వాడు ప్రేమించుకున్నారు. ప్రేమ తనని మోసం చేసిందని చెప్తున్నాడని ఎవరి మాట నమ్మాలో అర్థం కావడం లేదని చెప్తాడు. మొత్తం గుర్తు చేసుకొని ఆ రోజు గుడికి మీతో పాటు చిన్నోడు వచ్చాడు కదా.. ఆ రోజు ముందు నువ్వు నర్మద వచ్చారు.. మీరు వచ్చిన పది నిమిషాలకు ధీరజ్, ప్రేమలు వచ్చారు కదా వాళ్ల గురించి నీకు ఏమైనా తెలుసా అని అడుగుతాడు. వేదవతి కంగారు పడి తనకే తెలీదని అంటుంది. మరి నీకేం తెలుసు అని రామరాజు కేకలేస్తాడు. ప్రేమ నీ మేనకోడలే కదా అసలు వాళ్ల పెళ్లి ఎలా జరిగిందో అడిగి తెలుసుకోవాలి కదా.. ఇంటి కోడలు ఫొటోలు బయటకు వెళ్తే కష్టం కదా అని అంటాడు. వెంటనే ప్రేమ వాళ్లని రమ్మని చెప్పమని అంటాడు.
వేదవతి ప్రేమకి కాల్ చేస్తుంది. ఏమైంది అని అడిగితే నాకు టెన్షన్‌గా ఉంది. వెంటనే వచ్చేయ్ అంటుంది. ఏమైంది అత్తయ్య అంత టెన్షన్ పడుతున్నారని ప్రేమ అనుకుంటుంది. భాగ్యం భద్రావతి, విశ్వల్ని ఇంటికి పిలుస్తుంది. మీకు విషయం చెప్తే తట్టుకోలేరు.. అని తెలుసు కానీ మీ ఇంటి ఆడ పిల్ల మీద నింద పడిందని తెలియకపోతే ఎలా అని అంటుంది. ఏంటి చెప్పు అని భద్రావతి అడిగితే మీ ప్రేమ ఎవరో ఒక కుర్రాడితో దిగిన ఫొటోలు బయట పడ్డాయి.. ఆ ఫొటోలు రామరాజు అన్నయ్యతో సహా ఇంట్లో అందరూ చూశారు.. మీ మేనకోడలు ప్రేమ, ఆ అబ్బాయికి సంబంధం ఉందని పెళ్లికి ముందే తప్పు చేసిందని అంటున్నారని చెప్తుంది. భద్రవతి, విశ్వ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















