Ammayi garu Serial Today September 22nd: అమ్మాయిగారు సీరియల్: సూర్యప్రతాప్ ఆలోచనలకు అర్థమేంటి? రాఘవ నిజం చెప్పాడా! చనిపోయాడా?
Ammayi garu Serial Today Episode September 22nd చంద్ర, సుమలు రాఘవ చెప్పే విషయం వినమని సూర్యకి చెప్పడం.. దీపక్ రాఘవని చంపడానికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాఘవ తల మీద విజయాంబిక కొట్టేయడంతో రాఘవని రూప వాళ్లు హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. రూప దేవుడిని దండం పెట్టుకుంటుంది. పాతికేళ్లగా తన తల్లి మీద పడిన నింద తొలగిపోవాలని మీరు ఉన్నారని నిరూపించుకోండి.. నిజం నిరూపణ అవ్వాలి తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడాలని కోరుకుంది.
విజయాంబిక, దీపక్‌లు హాస్పిటల్‌కి వస్తారు. రాఘవ ఎలా అయినా చనిపోవాలని విజయాంబిక కొడుకుతో చెప్తుంది. ఇంతలో డాక్టర్ వచ్చి రాఘవ ప్రాణాలకు ప్రమాదం ఏం లేదని రూప, రాజు, విరూపాక్షిలతో చెప్తారు. రూప వాళ్లు హ్యాపీగా ఫీలైతే విజయాంబిక షాక్ అవుతుంది. రాఘవ ఇంకా మెలకువలోకి రాలేదని వస్తే ట్రీట్మెంట్ చేస్తానని డాక్టర్ చెప్తారు. విజయాంబిక దీపక్‌తో రాఘవ బతకకూడదు అని చెప్తుంది. అందుకు దీపక్ తన దగ్గర ఓ ఐడియా ఉందని చెప్తాడు. ఐడియా వర్కౌట్ చేయాలని అనుకుంటారు.
సూర్యప్రతాప్ గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో సుమ, చంద్ర సూర్యప్రతాప్ దగ్గరకు వస్తారు. చంద్ర సూర్యతో అన్నయ్య నేను ఎప్పుడూ మీరు చెప్పిందే నిజం అని నమ్మాను. నువ్వు చేసిందే రైట్ అని నమ్మాను. అందరూ అదే నమ్మారు. కానీ వదిన విషయంలో మాత్రం ఎక్కడో పొరపాటు జరిగినట్లు నాకు అనిపిస్తూనే ఉంది అన్నయ్యా. ఇన్నేళ్లు అజ్ఞాతంలో ఉన్న రాఘవ మీ ముందుకు వచ్చాడు. అతను ఏం చెప్తాడో వినేలోపు అక్క అతని తల పగలగొట్టింది. అక్క అంతలా ఎందుకు రియాక్ట్ అయిందో అర్థం కాని విషయం అన్నయ్య. వదిన కూడా మీరు ప్రశ్నించిన ప్రతీ సారీ నేను ఏ తప్పు చేయలేదు అనే చెప్తున్నారు. మీరు వదిన చెప్పింది ఎందుకు నమ్మడం లేదు అని అడగటం లేదు అన్నయ్యా కానీ రాఘవ చెప్పేది వినాలి కదా అంటున్నా అని చంద్ర అంటాడు. సుమ కూడా ఎవరు తప్పు చేసినా వాళ్లేం చెప్తారో విని శిక్ష వేస్తారు అంతే కానీ అక్క విషయంలో అలా జరగలేదు.. అక్క విషయంలో చూసింది కాకుండా మనసులో ఆలోచించండి అని అంటుంది.
చంద్ర అన్నయ్యతో విరూపాక్షి వదిన తప్పు చేసి ఉంటే మీ ముందుకు రాదు కదా అన్నయ్య. రాఘవ తప్పు చేసినా రాడు కదా అన్నయ్య. వాళ్లిద్దరి గురించి మా కంటే మీకు ఎక్కువ తెలుసు కదా అన్నయ్యా. రాఘవ మీ నమ్మిన బంటు అని చెప్పారు కదా. వదిన, రాఘవల బంధం తల్లీకొడుకుల బంధంగా ఉండేదని చెప్పేవారు కదా అన్నయ్య అని చంద్ర అంటాడు. సుమ అందుకొని అలాంటి బంధం ఎందుకు అక్రమ సంబంధంగా మారుతుంది బావగారు.. ఏ స్త్రీ అయినా ఒకర్ని బిడ్డలా చూస్తుంది అంటే తన ప్రాణం పోయినా సరే అలాగే చూస్తుంది కానీ వేరేలా చూడదు బావగారు అని అంటుంది. ఒకసారి రాఘవ చెప్పేది వినండి.. వదిన చెప్పేది నిజమైతే మీరు వదినను అపార్థం చేసుకుంటే ఆ బాధ మీకు జీవితాంతం ఉండిపోతుందని అంటారు.
సూర్యప్రతాప్ గతంలో విరూపాక్షి రాఘవ తల్లి కోసం డబ్బు ఇవ్వడం సూర్య సమక్షంలో చీర ఇవ్వడం అన్నీ గుర్తు చేసుకుంటాడు. ఇక దీపక్ డాక్టర్ వేషంలో రాఘవ దగ్గరకు వెళ్తాడు. రాఘవని చంపాలని ప్రయత్నిస్తాడు. అయితే అక్కడ సిస్టర్ ఉంటుంది. ఆమెను బయటకు పంపి రాఘవని చంపాలి అనుకుంటే రూప లోపలికి వెళ్తుంది. దీపక్ డాక్టరే అనుకొని రూప ఎలా అయినా రాఘవని బతికించండి డాక్టర్ అతను బతకడం మాకు చాలా అవసరం అని అంటుంది. నేను చూసుకుంటా మీరు వెళ్లండి అని దీపక్ రూపని పంపేస్తాడు. మళ్లీ దీపక్‌ని చంపాలని ప్రయత్నిస్తే సిస్టర్, రాజు లోపలికి వస్తారు. ఎలా ఉందని రాజు అడిగితే అతను ట్రైనీ డాక్టర్ అతనికి ఏం తెలీదు. మెయిన్ డాక్టర్ వస్తున్నారని నర్స్ చెప్పడంతో దీపక్ బయటకు వెళ్లిపోతుంది.
దీపక్ తల్లితో వాడిని చంపాలి అనుకుంటే రూప, రాజు, నర్సు ఇలా ఎవరో ఒకరు వస్తున్నారు. అయినా రాఘవ ఇంకా లేవలేదు కదా అంతలో చంపేద్దాంలే అని అంటాడు. ఇంతలో సూర్యప్రతాప్ హాస్పిటల్‌కి రావడం చూసి విజయాంబిక, దీపక్‌లు షాక్ అయిపోతారు. ఓరేయ్ మీ మామయ్య వచ్చేశాడురా అని విజయాంబిక అంటుంది. చంద్ర రాజుతో రాఘవకి ఎలా ఉందని అడుగుతాడుసూర్యప్రతాప్‌ని చూసి రాజు, రూప సంతోషపడతారు. ఇంతలో డాక్టర్ వచ్చి రాఘవకి మెలకువ వచ్చింది మీరు వెళ్లి చూడండి అంటారు. ఆ మాటతో విజయాంబిక, దీపక్‌లు బిత్తరపోతారు. సూర్యప్రతాప్‌తో పాటు అందరూ లోపలికి వెళ్తారు.
రాఘవ సూర్యప్రతాప్‌ని చూసి చేయి ఊపితే రాజు సూర్యప్రతాప్‌తో రాఘవ మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు అని అంటాడు సూర్యప్రతాప్ రాఘవ దగ్గరకు వెళ్తాడు. రాఘవ ఆక్సీజన్ పైపు తీసి అయ్యగారు నన్ను క్షమించండి.. ఆ రోజు అని రాఘవ ఆగిపోతాడు. సీన్ చూస్తే రాఘవ చనిపోయినట్లుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















