అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today may 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీ కడుపు సంగతి నర్మద, ప్రేమలు తేల్చేస్తారా! రెచ్చిపోయిన సాగర్.. ధీరజ్‌ని అపార్థం చేసుకున్నాడా!

Illu Illalu Pillalu Serial Today Episode may 14th: నర్మద, ప్రేమ వల్లీని మరో డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాలి అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Latest Episode: ధీరజ్, ప్రేమ రొమాన్స్‌తో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ మే 14వ తేదీ నాటి ఎపిసోడ్ మొదలవుతుంది. ప్రేమని ధీరజ్‌ హగ్ చేసుకుంటే నర్మద అక్కడికి వెళ్లి ఏంటి పొద్దు పొద్దున్నే మొదలు పెట్టారా మీ రొమాన్స్ అంటుంది. ఇద్దరూ కంగారుగా దూరం వెళ్లి అది కాదు వదినా రాత్రి పాలు తాగి ప్రేమ ఏం చేసిందో తెలుసా అని అంటాడు. ప్రేమ చెప్పొద్దు అంటే దానికి నర్మద మాకు పెళ్లయింది మీ రొమాన్స్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అని ప్రేమతో మాట్లాడాలి అని పక్కకి తీసుకెళ్తుంది. 

పాలలో మత్తు మందు కలిపింది సుకన్యనే అని నర్మద ప్రేమకు చెప్తుంది. తనకేంటి అవసరం అక్కా అని ప్రేమ అడిగితే వల్లీ, చందు బావని ఒకటి చేయాలని కలిపాని అని చెప్పిందని సుకన్యతో మాట్లాడిన విషయం మొత్తం నర్మద ప్రేమకి చెప్తుంది. సుకన్య మాటలు నమ్మేలా లేవని నర్మద అంటుంది. అది చెప్పిందంతా అబద్ధమే అక్క. నిజంగానే చందు బావకి ఇంకా కోపం పోలేదు అంటే అందుకు క్షమించమని మాట్లాడి ఒప్పించాలి కానీ ఇలా ఎవరైనా చేస్తారా.. ఇదంతా చూస్తుంటే దీని వెనక ఏదో మతలబు ఉందని నాకు అనిపిస్తుంది అక్కా అని ప్రేమ అంటుంది. సుకన్య ఇలా చేయడం వెనక ఉన్న మతలబు ఎలా కనిపెడతాం అని నర్మద అంటుంది.

Also Read: జగద్ధాత్రి సీరియల్ నటి దీప్తి మన్నే గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌! ఫ్రెండ్‌తో ఆడిషన్‌కు వెళ్లి సీరియల్ ఆఫర్ ఎలా కొట్టేసింది!

ప్రేమ నర్మదతో ఆ రోజు మనం సరిగా పట్టించుకోలేదు కానీ ఆ రోజు డాక్టర్ ఇచ్చిన స్కానింగ్ రిపోర్ట్‌లో వల్లీ పేరు కానీ డిటైల్స్ కానీ ఏం లేవు.. అని అంటుంది. స్కానింగ్ రిపోర్ట్స్ తన దగ్గరే ఉన్నాయని ప్రేమ తీసుకు రావడానికి వెళ్తుంది. గది మొత్తం వెతికినా కనిపించవు.. నర్మదకు విషయం చెప్తుంది. రిపోర్స్ట ఎలా పోయావి అని నర్మద అంటే ఇలా అని సుకన్య రిపోర్ట్స్ తీసి వల్లీకి చూపిస్తుంది. 

Also Read: సూర్యనారాయణ ఇంటి ముందుకొచ్చి గొడవపెట్టుకున్న సరోజ...కోడలు సింధూ చేసిన పని పెద్దయ్యకు చెప్పిన సరోజ

నర్మద వాళ్ల మాటలు వల్లీ, సుకన్య ఇద్దరూ చాటుగా వింటారు. నర్మద ప్రేమతో స్కానింగ్ రిపోర్ట్స్ మిస్ అవ్వడం.. చందుబావ వల్లీని ఒకటి చేయడానికి సుకన్య మందు కలపడం ఇవన్నీ చూస్తుంటే వల్లీ నిజంగా ప్రెగ్నెంట్ కాదేమో అని డౌట్‌గా ఉందని నర్మద అంటుంది. ఆ మాటకు వల్లీ బిత్తరపోతుంది. ఇంతలో నర్మద వాళ్ల దగ్గరకు ధీరజ్ వచ్చి స్కానింగ్ తీసే టైంలో మీరు లేరా వదినా అని అడిగితే లేం ధీరజ్ మమల్ని బయటకు వెళ్లమని చెప్పారు అంటుంది.

Also Read:కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమున కలలో కనిపించిన బిడ్డ ఎవరు? విహారికి ప్రమాదం పొంచి ఉందా! కడుపులో బిడ్డకా!

మరి మందులు అని అడుగుతాడు. డాక్టర్ ట్యాబ్లెట్స్ ఇవ్వలేదు అని ప్రేమ అంటే.. అవును కదా.. డాక్టర్ మందులు ఇచ్చి మళ్లీ రమ్మని చెప్తుంది కదా.. అదేమీ లేదు అంటే కచ్చితంగా ఇదంతా డ్రామానే అని నర్మద అంటుంది. ఆ వల్లీ కచ్చితంగా ప్రెగ్నెంట్ కాదు అక్కా.. అది నిజంగా ప్రెగ్నెంట్ అయింటే అడ్డమైన గడ్డి తినకుండా చక్కగాతింటూ మందులు వేసుకునేది అని ప్రేమ అంటుంది. వల్లీ ప్రెగ్నెంట్ కాదు అని ఎలా నిరూపిస్తాం అని నర్మద అడుగుతుంది. దానికి ధీరజ్ మరో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి చెక్‌అప్ చేయించండి నిజం తెలిసిపోతుంది అని అంటాడు. ప్రేమ రేపే వల్లిని హాస్పిటల్‌కి తీసుకెళ్దాం అని అంటుంది నర్మద.

Also Read:బయటపడుతున్న పార్లలమ్మ పాపాల చిట్టా, ఎంక్వైరీ మొదలుపెట్టిన బాలు - గుండెనిండా గుడిగంటలు మే 13 ఎపిసోడ్

వల్లీ  చాలా టెన్షన్ పడుతుంది. బాబాయ్ ఏంటే ఇది అని సుకన్యతో అంటుంది. మీ అమ్మని కలుద్దాం పద అని సుకన్య అంటుంది. మరోవైపు సాగర్ మామ ఎక్కించిన మాటలు తలచుకొని ధీరజ్ మీద నెగిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ధరీజ్ సాగర్‌ని చూసి కాఫీ పట్టుకొని వెళ్లి కూర్చొని ఏంట్రా నడిపోడా అంత సీరియస్‌గా ఆలోచిస్తున్నావ్.. కొంప తీసి ఈ ఇల్లు అమ్మితే ఎంత వస్తుందని ఆలోచిస్తున్నావా ఏంటి అని అడుగుతాడు. సాగర్ కాఫీ తీసుకొని విసిరేసి ఏంట్రా పిచ్చిపిచ్చిగా ఉందా.. నాతో డ్రామాలు ఆడుతున్నావా.. 5 లక్షలు అడిగిన నువ్వు ఇప్పుడు నా కోసం కాఫీ తెచ్చావు అంటే నమ్మాలా అని అరుస్తాడు.

Also Read:నిండు మనసులు: మామ కుటుంబాన్ని రంజిత్‌ కలుపుతాడా! ప్రేరణని ఎత్తుకొని సిద్ధూ ముడుపు కట్టిస్తాడా!

ఇంట్లో నుంచి నిన్ను వెళ్లనివ్వకుండా ఆపడానికి అలా చేశానురా.. నాకు మా అన్నయ్య కంటే డబ్బే కాదు ఏదీ ముఖ్యం కాదురా అని ధీరజ్ చెప్పినా సాగర్ వినడు. వద్దు.. నువ్వు కూడా మీ నాన్నలాగే..నువ్వేంటో నా మీద నీకు వచ్చిన కుళ్లు అర్థమైందిరా.. నేను మంచి గవర్నమెంట్ ఉద్యోగిని.. నువ్వు జస్ట్ క్యాబ్ డ్రైవర్‌వి అందుకే నా మీద నీకు అసూయ అని సాగర్ అంటాడు. ఓరేయ్ నీకు పిచ్చా మా అన్నయ్య మంచి పొజిషన్‌లో ఉంటే నా కంటే సంతోషించేవాళ్లు ఎవరురా అని ధీరజ్ అంటే ఆపరా నీకు అన్నయ్య కంటే.. డబ్బు ఎక్కువ అని సాగర్ అంటాడు. 

Also Read:‘మేఘసందేశం’ సీరియల్‌: శరత్ చంద్రను ఓదార్చిన భూమి – కొత్త ప్లాన్‌ వేసిన అపూర్వ

ధీరజ్ ఎమోషనల్ అవుతూ కేవలం నీ గురించి మాత్రమే ఆలోచించి నేను ఏమైపోయినా పర్లేదు అని నువ్వు ఆ రోజు ఏడిస్తే నర్మద వదినతో నీకు నేను పెళ్లి చేశానురా.. నాన్న నన్ను తిట్టి నాలుగు రోజులు బయటకు గెంటేస్తే నానా తిప్పలు పడ్డానురా అలాంటి నేను ఇలా చేస్తానా అని ధీరజ్ అంటే ఆ రోజు తమ్ముడు వేరు ఇప్పుడు వేడు.. నిన్ను మీ నాన్న మార్చేశాడు.. మూడు నాలుగు రోజుల్లో డబ్బు కట్టేసి వెళ్లిపోతా అని సాగర్ అంటాడు. ధీరజ్ చాలా బాధ పడతాడు.

మరోవైపు రోడ్డు మీద సైకిల్ బండి పెట్టుకొని భాగ్యం, ఇడ్లీబాబాయ్ ఇడ్లీ అమ్ముతూ ఉంటారు. ఇంతలో అక్కడికి వల్లీ, సుకన్య వెళ్తారు. నర్మదకు నా కడుపు మీద డౌట్ వచ్చేసిందని ధీరజ్ మరో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమన్నాడు అని చెప్తుంది. అసలు ఆ నర్మద ఇంట్లో ఉంటేనే కదా నిన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లడానికి భాగ్యం అంటుంది. నర్మద శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లేలా చేస్తున్నా అని అంటుంది. ఎలా అని వల్లీ అంటే సాయంత్రం నువ్వే కల్లారా చూస్తావు కదా అని అంటుంది. ధీరజ్ వేదవతి దగ్గరకు వెళ్లి నీకు ఓ విషయం చెప్పాలి అని సరదాగా అంటే వేదవతి చాలా కోపంగా ఉన్నాను అని అంటుంది. మా అమ్మకి నా మీద కోపం ఎందుకు అని అడుగుతాడు. కారు కొనుక్కోవడానికి మీ నాన్న డబ్బు ఇస్తాను అంటే ఎందుకు తీసుకోవడం లేదురా.. పోనీ నా గాజులు ఇస్తానురా అంటే అమ్మా నేను కారు కొనేశా.. అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

మరిన్ని తెలుగు సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 27th: 'గోదావరి' సీరియల్: రేయ్ సింహాద్రి తోట వదిలే ప్రసక్తే లేదు..! సూర్యకి షాక్‌ ఇచ్చిన భువన, సింహాద్రి! ఇంట్లో వాళ్లకి జాను చెప్పిన నిజమేంటి?
'గోదావరి' సీరియల్: రేయ్ సింహాద్రి తోట వదిలే ప్రసక్తే లేదు..! సూర్యకి షాక్‌ ఇచ్చిన భువన, సింహాద్రి! ఇంట్లో వాళ్లకి జాను చెప్పిన నిజమేంటి?
Nindu Manasulu Serial Today July 27th: నిండు మనసులు: సిద్ధూ వర్సెస్ ఎమ్మెల్యే కొడుకు! చేయి విరిచేసిన సిద్ధూ.. గణ మర్యాదకి కారణమేంటి?
నిండు మనసులు: సిద్ధూ వర్సెస్ ఎమ్మెల్యే కొడుకు! చేయి విరిచేసిన సిద్ధూ.. గణ మర్యాదకి కారణమేంటి?
Meghasandesam Serial Today July 27th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి గదిలో ఆకాష్‌ను చూసిన అపూర్వ – అపూర్వ చెంప పగులగొట్టిన శరత్‌ చంద్ర
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి గదిలో ఆకాష్‌ను చూసిన అపూర్వ – అపూర్వ చెంప పగులగొట్టిన శరత్‌ చంద్ర
Karthika Deepam 2 Serial Today July 27th: కార్తీకదీపం 2 సీరియల్: దీప దశరథ్ కూతురని శ్రీధర్‌కి తెలిసిపోయిందా! సూరజ్ చేతిలో అదిరిపోయే స్వీట్ మెమోరీస్!
కార్తీకదీపం 2 సీరియల్: దీప దశరథ్ కూతురని శ్రీధర్‌కి తెలిసిపోయిందా! సూరజ్ చేతిలో అదిరిపోయే స్వీట్ మెమోరీస్!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Embed widget