అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today May 12th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అన్ని జంటలకు ఓకే రోజు మళ్లీ ఫస్ట్‌నైటా! పాలతో సుకన్య చేసిన మ్యాజిక్ ఫలించిందా!

Illu Illalu Pillalu Serial Today Episode May 12th వల్లీ, చందులను ఒకటి చేయాలని సుకన్యా పాలలో మందు కలపడం వేదవతి ఆ పాలను అందరికీ పంచేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ప్రసాద్‌రావు మందు కొడుతూ అల్లుడిని రెచ్చగొడుతుంటాడు. ధీరజ్ స్వార్థంతో ఆలోచించి 5 లక్షలు కట్టమని చెప్పాడని.. నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోతే నీ వాటా కూడా వాళ్లే తీసుకోవచ్చని ప్లాన్ చేశారని లేనిపోని వన్నీ సాగర్ తలకెక్కిస్తాడు. నీ బాధ కంటే ధీరజ్ డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నాడు. ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా రైస్మిల్లులో పని చేశావ్ కానీ నీ త్యాగాన్ని ఎవరైనా గుర్తించారా.. మరెక్కడైనా పని చేసుంటే తక్కువలో తక్కువ పది లక్షలు సంపాదించేవాడివి.. ఇన్నాళ్లు మీ నాన్నే నీకు శత్రువు అంటే ఇప్పుడు మీ తమ్ముడు తయారయ్యాడు.. ఈ 5 లక్షల కోసం రేపు నిన్ను కొట్టడానికి వస్తాడు.. నువ్వు ఎదగడాన్ని నీ అన్నదమ్ములు కూడా ఓర్చుకోలేకపోతున్నారు.. ఇక నుంచి నువ్వు నీ గురించి ఆలోచించు.. ఏం ఆలోచించకుండా వేరే కాపురం పెట్టు అవసరం అయితే ఆ 5 లక్షలు నేను సర్దుతా అని రెచ్చగొడతాడు. 

సుకన్య కిచెన్‌లో పాలు మరిగిస్తూ ఇదిగో పింక్‌ చీర ఇవిగో మల్లెపూలు అని పాట పాడుతుంది. ఇంతలో వల్లీ వచ్చి ఓసేయ్ నువ్వు ఈ రోజు రాత్రికి నన్ను నా మొగుడిని కలుపుతా అని చెప్పి పాటలు పాడుతున్నావేటే అని అంటే ఈ రోజు మీకు మళ్లీ ఫస్ట్‌నైట్ ఖాయం. తల్లిని అవుతున్నా అని నువ్వు చెప్పిన అబద్ధం ఈ రాత్రితో నిజం అవుతుంది అని అందుకు మన ఊరి నుంచి మంచి పవర్ ఫుల్ మందు తీసుకొచ్చా అని చెప్పి దాన్ని పాలలో కలిపేస్తుంది. ఈ పాలు చందుతో తాగించే అని అంటుంది. ఇంతలో వేదవతి వచ్చి ఏంటి ఏంటి ఆ పౌడర్ అని అంటే బాధం పౌడర్ అని కవర్ చేస్తుంది. దాంతో వేదవతి చందు ఒక్కడికేనా ఇంట్లో అందరికీ ఇవ్వాలి అని చెప్పి మళ్లీ పాలు మరిగించి వాటిలో పౌడర్ కలిపి నర్మద, ప్రేమలకు చెరో గ్లాస్ ఇచ్చి మీ భర్తలకు  ఇవ్వండి అని చెప్తుంది. వేదవతి రామరాజు కోసం ఓ గ్లాస్ తీసుకెళ్తుంటే తిరుపతి తీసుకొని తాగేస్తాడు. తర్వాత కన్యా కన్యా అంటూ సుకన్య కోసం వెళ్తాడు.

ప్రేమ ధీరజ్ దగ్గరకు పాలు తసుకొని వెళ్లి పాలు తాగమని అంటుంది. ఇందాకే మజ్జిగా తాగాను ఇప్పుడు పాలు తాగితే కడుపులోనే పెరుగు అయిపోతుంది నువ్వే తాగేయ్ అని అంటాడు. దాంతో ప్రేమే పాలు మొత్తం తాగేస్తుంది. నర్మద కూడా సాగర్‌కి పాలు ఇస్తుంది. అక్కర్లేదు అని సాగర్ అనేస్తాడు. దాంతో నర్మద కోపంగా పాలు మొత్తం తాగేస్తుంది. ఇక చివరకు వల్లీ పాల గ్లాస్‌ తీసుకొని చందు దగ్గరకు వెళ్తుంది. చందు రోజు అలవాటు వల్ల వల్లీ ఇచ్చిన పాలు మొత్తం తాగేస్తాడు. తిరుపతి కన్యా కన్యా అంటూ సుకన్య కోసం ఇల్లంతా తిరుగుతాడు. సుకన్య వినేసి వీడు కూడా తాగేసినట్లు ఉన్నాడు వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది. ప్రేమకి ఫుల్లుగా మత్తు ఎక్కిపోతుంది. ధీరజ్ పడుకొని ఉంటే వెళ్లి పక్కనే పడుకొని ధీరజ్ మీద చేతులు వేస్తుంది. ఏయ్ ఏంటే మాటలు తేడాగా ఉన్నాయి.. మనిషివి తూలుతున్నావ్.. మందు తాగావా ఏంటి అని అడుగుతాడు. అవునురా నీ ప్రేమ అనే మందు తాగాను అంటుంది. ఏయ్ ఏమైందే నీకు అని ధీరజ్ అడుగుతాడు. నువ్వు నాకు పూర్తిగా నచ్చేశావురా అని ధీరజ్‌ని ముద్దు పెట్టుకుంటుంది. 

సాగర్‌ కోపంగా ఉంటే నర్మద సాగర్‌ని ఈడ్చుకెళ్లి లాగిపెట్టి కొట్టి నువ్వు పెళ్లాన్ని పట్టించుకోవడం లేదురా.. అని వాయించేస్తుంది. ఈమధ్య మల్లెపూలు తీసుకురావడం లేదు అని అంటుంది. నేను ఎలాంటి టెన్షన్స్‌లో ఉన్నానో నీకు తెలుసు కదా అని సాగర్ అంటే అలా అని ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను నిర్లక్ష్యం చేస్తావా అని అడుగుతుంది. అనవసరంగా మన మనసుల మధ్య దూరం పెంచుతున్నావ్‌రా అని హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఇక చందుకి కూడా మత్తు ఎక్కుతుంది. వల్లీ దగ్గరకు వెళ్లి దగ్గరకు తీసుకుంటే ఇప్పుడే వచ్చేస్తా బా అని వల్లీ బయటకు వెళ్తుంది. సుకన్యా ఇళ్లంతా తిరుగుతూ తిరుపతికి దొరక్కుండా పరుగులు పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  
 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget