అన్వేషించండి

Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు

Jagadhatri Serial Today Episode August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. యువరాజుకు పెద్దగండం తప్పినందుకు  కమలాకర్‌ ఇంట్లో పార్టీ ఏర్పాటు చేస్తాడు. అప్పుడే పాములుపట్టేవాడు రాగా....ఆదిలక్ష్మీ బయటకు వెళ్లి వాడిని పంపించేందుకు చూస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కేదార్‌, జగధాత్రి మాకు నిజం తెలిసిపోయిందని మీరు ఇక నటించలేరని  అంటారు. ధాత్రి బయటకు వెళ్లడం చూసి వైజయంతి కూడా వస్తుంది. అక్కడ మాటలన్నీ విని కోపంతో ఆదిలక్ష్మీని కొడుతుంది. నాకొడుకు చంపాలని చూశావంటూ తిడుతుంది. దీంతో ఆదిలక్ష్మీ కౌషికి కాళ్లమీదపడి క్షమాపణలు చెబుతుంది. ఆ తర్వాత ఇంట్లో పార్టీలో కేదార్‌కు జ్యూస్‌లో మందు కలిపి తాగిస్తారు. తాగిన మత్తులో యువరాజు కేదార్‌ను మా అన్నయ్య అంటూ కౌగిలించుకోవడంతో ఇంట్లో అందరూ చాలా సంతోషిస్తారు.

బయటపడిన ఆదిలక్ష్మీ గుట్టు

యువరాజు ప్రాణాలతో బయటపడటంతో కమలాకర్‌  ఇంట్లో మంచి డ్రింక్‌ పార్టీ ఏర్పాటు చేస్తాడు. కమలాకర్‌, బూచీ ఇద్దరూ మందు తాగుతూ యువరాజును కూడా పిలుస్తారు. దీంతో ముగ్గురూ కలిసి మందు తాగుతారు. కేదార్‌ను పిలిచినా నాకు అలవాటు లేదని చెప్పడంతో వదిలేస్తారు. కేదార్‌, జగధాత్రి బెదిరించడంతో  పాములు ఇచ్చిన వాడు ఇంటికి వస్తాడు, వాడిని చూడగానే ఆదిలక్ష్మీ బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లి వాడిని ఎందుకు వచ్చావని నిలదీస్తుంది. జగధాత్రి పోలీసులకు పట్టిస్తానని బెదిరించిందని చెబుతాడు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్లకపోతే ఆ విషం ఉన్న పాములు నేనే తెప్పించానన్న సంగతి అందిరికీ తెలిసిపోతుందని ఆదిలక్ష్మీ అంటుంది.

ఆదిలక్ష్మీ చెంపలు వాయించిన వైజయంతి  

ఆదిలక్ష్మీ  హడావుడిగా బయటకురావడం చూసి కేదార్‌, జగధాత్రి కూడా వస్తారు. వాళ్ల వెనకే వైజయంతి నిషిక కూడా వస్తారు. ఆదిలక్ష్మీ మాటలు విన్న ధాత్రి...మాకు అంతా తెలిసిపోయిందని ఆ పాములను తెప్పించింది మీరేనన్న సంగతి అర్థమైపోయిందని అంటారు. ఆ మాటలు విన్న వైజయంతికి కోపం వచ్చి నా కొడుకునే చంపించాలని చూస్తావా అంటూ వచ్చి చెంపలు పగులగొడుతుంది. ఈ గొడవతో అందరూ బయటకు వస్తారు. కౌశికి విషయం తెలిసి వాళ్ల అత్తయ్యను తిడుతుంది. మీరు ఏం చేసినా సహించానని కానీ నా తమ్ముడినే చంపాలని చూస్తే ఊరుకోనని మర్యాదగా  బయటకు వెళ్లిపోండని అంటుంది. దీంతో ఆదిలక్ష్మీ కౌషికి కాళ్లమీదపడి క్షమాపణలు కోరుతుంది. నేను కేవలం యువరాజును బెదిరించాలని మాత్రమే చూశానని చంపాలనుకోలేదని వేడుకుంటుంది. దీంతో కమలాకర్‌, జగధాత్రి కూడా ఈ ఒక్కసారికి ఆమెను క్షమించమని చెప్పడంతో  కౌషికి ఇంట్లోకి రానిస్తుంది.

కేదార్‌కు తాగించిన యువరాజు

గొడవ సద్దుమణగడంతో మళ్లీ అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు. కేదార్‌కు కూడా మందు తాగిద్దామని బూచీ అనడంతో  కమలాకర్ సరేనంటాడు. జ్యూస్‌లో మందు కలిపి కేదార్‌కు బాగా తాగిస్తారు. అటు యువరాజుకు కూడా బాగా ఎక్కువ అవుతుంది. దీంతో అన్నదమ్ములు ఇద్దరూ ఒకచోట చేరి ఒకరినొకరు ఓదార్చుకుంటారు. యువరాజు కేదార్‌ను ప్రేమగా అన్నయ్య అని పిలుస్తాడు. ఇన్నిరోజును నిన్ను అనవసరంగా దూరం పెట్టాను అని ఏడుస్తాడు. అటు కేదార్‌ కూడా నువ్వు నా ముద్దుల తమ్ముడివిరా అంటూ దగ్గరకు తీసుకుంటాడు. ఇది చూసి నిషిక, వైజయంతికి ఒళ్లు మండిపోగా....ఇంట్లో వాళ్లంతా చాలా సంతోషిస్తారు. నిషిక చెప్పినా వినకుండా యువరాజు  మరింత రెచ్చిపోతాడు. కేదార్‌ నా సొంత అన్నయ్య అని అంటూ కౌగిలించుకుంటాడు. రేపటి నుంచి ఎవరైనా మా అన్నయ్య మాట వినాల్సిందేనని అంటాడు. అది చూసి కమలాకర్‌ కళ్లు చెమర్చుతాయి. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలిరా అంటూ దగ్గరకు తీసుకుంటాడు. కొడుకులిద్దరినీ చూసి సుధాకర్‌, కౌషికి కూడా చాలా సంతోషిస్తుంది.
జగద్ధాత్రి సీరియల్ టుడే ఎపిసోడ్
Jagadhatri Serial Today Episode

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Embed widget