అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today April 8th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి యాక్సిడెంట్! తండ్రి చేసిన కుట్రకి ప్రేమ బలైపోతుందా!

Illu Illalu Pillalu Serial Today Episode April 8th భాగ్యం చెప్పిన యాక్సిడెంట్ గురించి తెలుసుకున్న సేనాపతి చందుని చంపేయమని లారీ డ్రైవర్‌కి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode అమూల్య ఇచ్చిన కాఫీ అమృతంలా ఉందని ధీరజ్ తెగ పొడిగేస్తాడు. కాఫీ చేసింది నేను కాదు అన్నయ్యా.. నీ భార్య,, కావాలంటే తనని పొగుడు అని అమూల్య అనడంతో ధీరజ్ ఛీ.. ఛీ.. తూ.. తూ అనేస్తాడు. రామరాజుతో సహా అందరూ కాఫీ బాగుంది తాగరా అని అంటాడు. ఇక అటుగా సాగర్ వెళ్లడం చూసిన తిరుపతి వచ్చి కాఫీ తాగరా అంటే సాగర్ తండ్రిని చూసి వద్దులే నేను తాగితే మళ్లీ కొంత మంది కాఫీ తాగడం మానేసి ఈ జన్మలో కాఫీ వద్దనేస్తారు అని అంటాడు.

తిరుపతి అందరితో అల్లుళ్లు ఈ మధ్య మీరు ఇలా తయారయ్యారు ఏంట్రా.. పెద్దోడు.. ఏదో పొగొట్టుకున్నట్లు ఉన్నాడు. చిన్నోడు భార్యతో ఎడమొహం పెడమొహం ఇక నడిపోడు అయితే ఏకంగా తండ్రి మీదే యుద్ధం ప్రకటించాడు అని అంటాడు. ఆ మాటలకు రామరాజు మనసులో పెద్దోదు భార్య లేదని దిగులుగా ఉన్నాడు అని అనుకొని చందుని పిలిచి వల్లీని ఎప్పుడు తీసుకొస్తావ్‌రా అని అడుగుతాడు. ఎందుకు అని చందు అంటే అలా అంటావేంట్రా వల్లీ లేకపోవడంతో చూడు ఇళ్లంతా ఎలా బోసిపోయిందో అని అంటాడు. వల్లీ మన ఇంటి మహాలక్ష్మీరా తను లేకపోతే మన ఇంటికి కలే లేదురా వెళ్లి కోడల్ని ఇంటికి తీసుకురా అని రామరాజు అంటాడు. దానికి చందు ఏంటి నాన్న మాట్లాడితే వల్లీ వల్లీ అంటారు.. తను లేకపోతే కొంపలు ఏమైనా మునుగిపోతాయా.. లేకపోతే మన ఇల్లు లేదు అన్నట్లు మాట్లాడుతారేంటి.. అని అంటాడు. ఏంట్రా ఎప్పుడూ లేనిది వల్లీ గురించి అలా మాట్లాడుతున్నావ్ అని రామరాజు అడిగితే చందు నిజం చెప్పకుండా.. వాళ్ల అమ్మకి బాలేదు కదా వెళ్లింది వస్తుందిలే అని అంటాడు.

రామరాజు తిరుపతి, ధీరజ్‌లతో పెద్దోడు ఏంట్రా ఇలా అంటున్నాడు అని అంటే దానికి ధీరజ్ ఏం లేదు నాన్న.. వాళ్ల అమ్మకి బాలేక వెళ్లింది కదా.. అయినా నా భార్యే వచ్చి ఇంటి పనులు చూసుకోవాలా.. మీ భార్యలు లేరా అని అంటున్నాడు అని కవర్ చేస్తాడు. ప్రేమ దగ్గరకు వెళ్లి కొంత మందికి పని లేక కొంపలో కుంపటిలు పెడుతున్నారు. ఇక నుంచి నువ్వే ఇంటి పనులు అన్నీ చేయాలి అని ప్రేమకి చెప్పి వెళ్లిపోతాడు. ప్రేమ కోపంగా మనసులో ధీరజ్‌గా చెప్తారా నీ సంగతి అని అనుకుంటుంది. 

భాగ్యం యాక్సిడెంట్ చేయమని చెప్పిన వ్యక్తి సేనాపతి సైట్‌లో పని చేస్తుంటాడు. సేనాపతి వచ్చి ఏంట్రా లోడ్ పంపకుండా మీటింగ్ అంటే వీడికి ఏదో డమ్మీ యాక్సిడెంట్ ఉందంట అది చేస్తే 5 వేలు వస్తాయని అంటున్నాడు అని మరో వ్యక్తి సేనాపతికి చెప్తాడు. నిన్ను పంపిన వాడికి ఫోన్‌ చేయరా మాట్లాడుతా అని సేనాపతి చెప్తాడు. ఆ వ్యక్తి ఫోన్ తీస్తూ ఉంటే చందు ఫోటో కింద పడుతుంది. అది చూసిన సేనాపతి అతన్ని పక్కకి తీసుకెళ్లి విషయం అడుగుతాడు. అతను మొత్తం విషయం సేనాపతికి చెప్తాడు. సేనాపతి షాక్ అయిపోతాడు. దాంతో సేనాపతి డమ్మీ లేదు వాడి మమ్మీ లేదు.. వాడిని గుద్దేయ్.. లారీ స్పీడ్ 100 తగ్గొద్దు.. వాళ్లు 5 వేలు ఇవ్వడం ఏంటి.. నేను 50 వేలు ఇస్తా అని అంటాడు. సరే అని అతను వెళ్తాడు. 

ధరీజ్ గదిలో డల్‌గా ఉంటే ప్రేమ కాఫీ కప్ పట్టుకొని వచ్చి కాఫీ తాగుతూ తన కాఫీనీ తానే పొగిడేస్తుంది. సౌండ్ లేకుండా తాగు అని ధీరజ్ ప్రేమ మీద అరుస్తాడు. ఇది మా ఆయన సగం తాగి వదిలేసిన కాఫీ కదా అందుకే ఇంత స్వీట్ అని ధరీజ్ వినేలా మాట్లాడుతుంది. ప్రేమ కాఫీ తాగమని ధీరజ్‌తో చనువుగా మాట్లాడాలని చూస్తే ధీరజ్ చాలా కోప్పడతాడు. నేను సరదాగా నవ్వించాలి అని చూస్తే ఇలా చేస్తావేంట్రా అని ప్రేమ అడిగితే నీకు బాధ పెట్టడమే తెలుసు బాధని దూరం చేయడం తెలీదు.. అని అంటాడు. నువ్వు దిగజారి ప్రవర్తిస్తున్నావని అనిపిస్తుంది.. మనం కేవలం రూం మేట్స్ మాత్రమే.. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తే ఈ గదిలో కూడా ఉండను గుర్తు పెట్టుకో అని అంటాడు. ప్రేమ చాలా బాధ పడుతుంది. కాలేజ్‌కి డ్రాప్ చేయరా అని అంటే నీకు నిజంగా సిగ్గు లేదు అని ధీరజ్ వదిలేసి వెళ్లిపోతాడు. 

ప్రేమ తనని డ్రాప్ చేయమని  బతిమాలుతూ వెనక వెళ్తుంది. చందు అది చూసి ఏమైందని అడుగుతాడు. ప్రేమ విషయం చెప్పగానే.. వాడు నీ మంచితనం అర్థం చేసుకోలేకపోతున్నాడు.. నీ గురించి తెలుసుకున్న రోజు పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు అని అంటాడు. ఇక చందు ప్రేమని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తానని తీసుకెళ్తాడు. మరోవైపు ఇడ్లీబాబాయ్ చందు బైక్ పంక్చర్ చేయడానికి రోడ్డు మీద మేకులు వేస్తాడు. వల్లీ భాగ్యంతో నా భర్తకి ఏం కాకూడదు.. కానీ యాక్సిడెంట్ అవ్వాలి,, కేవలం కాలు బెనికితే చాలు అప్పుడు నేను కార్యేషు దాసీ అని వెళ్తానని అంటుంది. చందు, ప్రేమని తీసుకురావడం చూసిన శ్రీవల్లి ఈ గుంటూరు పొట్టి  మిరపకాయ్ కూడా ఉందమ్మా ఏంటి పరిస్థితి అని అంటుంది. చందు, ప్రేమ వస్తుంటే టైర్ పంక్చర్ అయిపోతుంది. 

చందు ప్రేమతో నేను ధీరజ్‌ని పిలుస్తాను.. వాడు నిన్ను డ్రాప్ చేస్తాడు అని అంటాడు. నన్ను డ్రాప్ చేయమని అంటే వాడు అస్సలు రాడు.. నేను నడుచుకొని వెళ్తానని ప్రేమ అంటుంది. నేను పిలిస్తే వస్తాడు అని చందు ధీరజ్‌కి కాల్ చేసి రమ్మంటాడు. నేను రాను అని ధీరజ్ అంటే నీ భార్య ఇక్కడ ఇబ్బంది పడుతుంది అంటే రాను అంటావా అని తిట్టి రమ్మని చెప్తాడు. ఇక లారీ డ్రైవర్ చందుని చూసి లారీ స్టార్ట్ చేసి స్పీడ్‌గా వస్తాడు. ధీరజ్ వచ్చే వరకు ప్రేమని చందు పక్కన నిల్చొమని అంటాడు. హమ్మయ్యా ప్రేమ వెళ్లిపోయింది అని వల్లీ వాళ్లు అనుకుంటారు. ఇక ప్రేమ పక్కకి వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చుకుంటుంది. అప్పుడే చందు వైపు లారీ రావడం చూసిన ప్రేమ బావ అని చందుని పిలుస్తుంది. చందు ఫోన్‌లో మాట్లాడుతూ పట్టించుకోకపోవడంతో ప్రేమ పరుగున వెళ్లి చందుని పక్కకి లాగేస్తుంది. తర్వాత లారీ ప్రేమని ఢీ కొడుతుంది. అందరూ ప్రేమ అని అరుస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 10th: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget